కావలసిన పదార్థాలు
- గోంగూర. 2 కట్టలు
- మినప్పప్పు. 2 టీస్పూ//
- శనగపప్పు. 2 టీస్పూ//
- మెంతులు. కాసిన్ని
- జీలకర్ర. 1 టీస్పూ//
- ఆవాలు. 1/2 టీస్పూ//
- ఉప్పు. తగినంత
- కారం. 2 టీస్పూ// .
- నూనె.. తగినంత
- వెల్లుల్లి.. 6 రెబ్బలు
- ఉల్లిపాయలు. 2
- ఎండుమిర్చి. 6
- కరివేపాకు.. 2 రెమ్మలు
- ఇంగువ.. చిటికెడు
తయారీ విధానం
గోంగూరను శుభ్రం చేసుకోవాలి.
మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరప, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయల్ని దోరగా వేయించి పక్కనుంచాలి.
అదే బాణెలిలో కాస్తంత నూనలో గోంగూరను వేసి సన్నటి మంటపై వేయించాలి.
దీనిలో ముందు వేయించిన పప్పు దినుసులను వేసి, తగినంత ఉప్పు, కారం కలిపి వేయించాలి.
ఈ మిశ్రమాన్ని మిక్సీలో లేదా రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి.
ఇప్పుడు బాణెలిలో నూనె వేసి కాగిన, తరువాత ఆవాలు,
ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలతో పోపు పెట్టాలి. ఈ
పోపును నూరుకున్న పచ్చడిలో కలుపుకోవాలి
గోంగూరలో జీర్ణశక్తిని పెంచే గుణాలుండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి ఆకలిని పెంచుతుంది.
No comments:
Post a Comment