కావలసిన పదార్థాలు
- బంగాళాదుంపలు. 1/4 కేజీ
- బ్రెడ్ స్లైసులు... 12
- అల్లం ముక్కలు.. 1 టీస్పూ//
- దానిమ్మగింజల పొడి... 1/2 టీస్పూ//
- మసాలాదినుసుల పొడి.. 1 టీస్పూ //
- పచ్చిమిర్చి ముక్కలు... 2 టీస్పూ//
- ధనియాలపొడి... 1/2 టీస్పూన్
- మిరియాలపొడి... 1/2 టీస్పూ//
- కొత్తిమీర తరుగు... సరిపడా
తయారీ విధానం
ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి, పొట్టుతీసి బాగా నలిపి ఉంచుకోవాలి.
దీనిని ఒక బౌల్‌లో వేసి కారం, ఉప్పు, ధనియాలపొడి,
పచ్చి మిర్చి, కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలు, గరంమసాలాలు వేసి పేస్టులాగా
చేసుకోవాలి.
తరువాత రెండు బ్రెడ్ స్లయిసెస్ చొప్పున నీటిలో
ముంచి అరనిమిషం తర్వాత తీసి... ఒక దానిమీద బంగాళదుంప పేస్టును సమానంగా
సర్ది పైన ఇంకోదాన్ని కవర్ చేసి రెండింటిని కలిపి రోల్ చెయ్యాలి.
ఇలా మొత్తం అన్ని స్లైసులను చేసుకున్న తరువాత బాగా కాగుతున్న నూనెలో వేసి, ఎర్రగా వేయించి తీసేయాలి.
వీటిని టమోటో సాస్‌తో కలిపి తింటే, మంచి రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment