కావలసిన పదార్థాలు
- ఉల్లిపాయ. 1
- నూనె. 1 టీస్పూ//.
- వెజిటబుల్ స్టాక్. 2 కప్పులు
- తోటకూర కట్టలు. 2
- పాలకూర. 1 కట్ట
- పాలు. 1 కప్పు
- మీగడ. 2 టీస్పూ//
- మిరియాలపొడి. కొద్దిగా
- కొత్తిమీర. 1 కట్ట
తయారీ విధానం
ముందుగా తోటకూర, పాలకూరలను బాగా కడిగి సన్నగా తరగాలి.
తరవాత బాణెలి లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఓ నిమిషం వేయించి వెజిటబుల్ స్టాక్ పోయాలి.
ఆపై మంట తగ్గించి తరిగిన ఆకుకూరను పదిహేను నిమిషాలు ఉడికించి దించేయాలి.
చల్లారిన తరువాత అందులో పాలు పోసి మళ్లీ స్టవ్‌మీద పెట్టాలి.
కాసేపు ఉడికించి అందులో మిరియాలపొడి, మీగడ కలిపి చివర్లో కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి గ్రీన్ సూప్ తయార్.
No comments:
Post a Comment