కావలసిన పదార్థాలు
- పచ్చిమామిడికాయ రసం – ¼ లీటరు
- చక్కెర - 650గ్రాములు
- ఉప్పు - 1 టీస్పూ//
- కావల్సిన ఎసెన్స్
తయారీ విధానం
ముందు మామిడికాయ తొక్కతీసి, తురుము పీటతో తురుముకోవాలి.
తురుమును ఒక గిన్నెలో వేసి ఒక టీస్పూను ఉప్పు చేర్చి మూతపెట్టాలి.
సుమారు ఇరవై నిముషాల తర్వాత ఈ తురుమును గట్టిగా పిండితే రసం వస్తుంది. గుడ్డలో వేసి పిండితే శ్రమలేకుండా ఉంటుంది.
తర్వాత చక్కెర పాకం పట్టుకోవాలి.
ఈ పాకంలోకి పచ్చిమామిడిరసం కలపాలి. ఎసెన్స్ చేర్చాలి.
పచ్చిమామిడి షర్బత్ ను తడిలేని సీసాలోనే ఉంచుకోవాలి.
షర్బత్ చేసుకోవాలనుకున్నాప్పుడు, ఒక గ్లాసు నీటికి
ఒక కప్పు షర్బత్ కలుపుకుని, బాగా కలిసేటట్టు చూసుకోవాలి. దీనికి ఐస్ ముక్కల
జత చెర్చుకోవచ్చు.
No comments:
Post a Comment