కావలసిన పదార్థాలు
- మామిడి కాయలు – 1 కేజీ
- నీళ్ళు – 3 కప్పు
- చక్కెర – 1.5 కేజీ
- పొటాషియం బై సల్ఫేట్ – 2 టీస్పూ//
- సిట్రిక్ ఆసిడ్ (ఆమ్లం) – ½ టీస్పూ//
తయారీ విధానం
మామిడికాయ తొక్కతీసి ముక్కలు చేయాలి.
ఈ ముక్కలను ఒక కప్పు నీటిలో బాగా ఉడకపెట్టుకోవాలి.
తర్వాత సెగపై నుంచి కిందికి దించి చల్లార్చుకోవాలి.
దీనిని గ్రైండ్ చేసుకొని గుజ్జుని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
నీళ్ళలో చక్కెర, సిట్రిక్ ఆసిడ్ వేసి బాగా కరిగేవరకూ ఉంచాలి.
మిగుళ్ళు యేమీ ఉండకుండా ఒకసారి వడకట్టుకుంటే మంచిది.
దీనికి పక్కన పెట్టుకున్న మామిడి గుజ్జును కలుపుకొని బాగా ఉడకనివ్వాలి.
తర్వాత పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి.
చల్లారిన సిరప్ కొంచం తీసుకొని దానికి పొటాషియం బై సల్ఫేట్ కలుపుకోవాలి.
మిశ్రమం బాగా కలిసేట్లు చూసుకోవాలి.
ఈ సిరప్ గాలిదూరని బాటిల్ లో భద్రపరచుకొని, ఫ్రిడ్జులో పెట్టుకోవాలి.
ఒక గ్లాసు స్క్వాషు తయారీకి ఒక గ్లాసు నీటిలో రెండు స్పూనుల సిరప్ కలుపుకుంటే చాలు.
దీనికి ఐస్ ముక్కలు జోడించండి.
No comments:
Post a Comment