కావలసిన పదార్థాలు
- క్యారెట్. 1/4కేజీ
- టొమోటో. 100 గ్రా.
- కసూర్ మేతీ. 1 టీస్పూ//.
- ఎండుమిర్చి. 2
- మిరియాలు. 1 టీస్పూ//.
- పుదీనా. 1 కట్ట
- నిమ్మరసం. 2 టీస్పూ//.
- కొత్తిమీర. 1 కట్ట
- ఉప్పు. తగినంత
- నిమ్మచెక్క తురుము. చిటికెడు
తయారీ విధానం
క్యారెట్‌ను సన్నగా తురమాలి. టొమాటోలను సన్నగా కోయాలి. ఈ రెండింటినీ కలిపి ఓ గిన్నెలో వేసి, 3 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి.
ఓ సన్నని వస్త్రంలో ఎండుమిర్చి, మిరియాలు, కసూరిమేతీ, పుదీనా కలిపి మూటకట్టి ఉడుకుతున్న గిన్నెలో వేసి ఉడికించాలి.
పది నిమిషాలు అలాగే ఉడికించిన తరువాత ఆ మూటను గట్టిగా పిండి తీసేయాలి.
ఇప్పుడు ఉప్పు సరిచూసి ఈ రసాన్ని వడగట్టి,
కప్పుల్లో పోసి నిమ్మరసం, నిమ్మచెక్క తురుము వేసి వేడిగా సర్వ్ చేయాలి.
అంతే. క్యారెట్ శోర్భా రెడీ.
No comments:
Post a Comment