Monday, May 7, 2012

కంది పొడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కంది పప్పు: 1 కప్పు
  • మినపప్పు: 1 కప్పు
  • శనగ పప్పు: 1 కప్పు
  • పెసర పప్పు: 1 కప్పు
  • ఎండు మిరప కాయలు(ముక్కలు చేసుకున్నవి): 1 కప్పు
  • జీలకర్ర ¼ టీస్పూ//
  • ఇంగువ: చిటికెడు
  • ఉప్పు: తగినంత

తయారీ విధానం

ముందుగా బాణెలి లో పప్పులన్నీ కంది పప్పు, శనగ పప్పు, పెసర పప్పు, మినపప్పు వరుసగ విడివిడిగా వేయించుకోవాలి.
చివరగ ఎండుమిరపకాయలు కొద్ది ఉప్పుతో వేయించుకోవాలి. పప్పులు వేడిగ వున్నప్పుడు జీలకర్ర వేసుకోవాలి.
అన్ని చల్లారాక మిక్సిలో వేసి మెత్తగ పొడి చేసుకోవాలి. ఆ పోడిలో మిగిలిన ఉప్పు వేసికలుపుకోవాలి.
ఈ పొడి వేడి అన్నంలో నూనే వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది.


No comments:

Post a Comment