కావలసిన పదార్థాలు
- యాలకుల పొడి: 1 టీస్పూన్,
- కొత్తిమీర:1 కట్ట,
- పసుపు:1/2 టీస్పూ//,
- పాలు: 1/4 లీ.
- నెయ్యి:తగినంత,
- రీఫైండ్ ఆయిల్: 100 గ్రా.
- ఉప్పు:తగినంత,
- కారం:1 టీస్పూ//,
- పచ్చిమిర్చి పేస్ట్:1 టీస్పూ//,
- పెరుగు:150గ్రా.
- పుదీనా:1/2కప్పు,
- వెజిటబుల్ ముక్కలు:4 కప్పు,
- మసాలా దినుసులు:10 గ్రా.
- బాస్మతి రైస్:1/2 కేజీ,
- అల్లంవెల్లుల్లి పేస్ట్:1/2కప్పు,
- ఉల్లిపాయలు:1కప్పు,
తయారీ విధానం
స్టౌవ్‌మీద బాణెలి ని ఉంచి అందులో నూనె పోసి మరిగాక.. మసాలా దినుసులను వేసి వేయించాలి.
అందులోనే పుదీనా,కొత్తిమీర,పసుపు,పచ్చిమిర్చి
పేస్ట్,యాలక్కాయల పొడి,కారం,ఉప్పు,బీన్స్,క్యారెట్ టమోటో,ఉల్లిపాయ
ముక్కలు,పెరుగులను ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.
ఇంకో గిన్నెలో బియ్యం ఎసరు పెట్టి, అందులో పాలు
కూడా పోసి ఎసరు వచ్చాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి,సగం
ఉడికాక గంజి వార్చేసి పక్కన ఉంచుకోవాలి.
వేరొక వెడల్పాటి పాత్రలో అడుగున ఉడికించిన రైస్
కొద్దిగా వేసి, పైన వేయించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను వేసి, మళ్లీ
కొద్దిగా అన్నం.. ఇలా 4వరుసలుగా పేర్చుకోవాలి.
తర్వాత మూత పెట్టి 10ని. ఉడికించాలి. మూత తీసి సరిపడా నెయ్యేసి, అన్నాన్ని దించేయండి. బిర్యానీ రెడీ.
No comments:
Post a Comment