కావలసిన పదార్థాలు
- కొత్తిమీర. 2 కట్టలు
- కొబ్బరికాయలు. 2 చిన్నవి
- అల్లం. 10 గ్రా.
- వెల్లుల్లి. 10 గ్రా.
- పచ్చిమిర్చి. 200 గ్రా.
- జీలకర్ర. 1 టీస్పూ//.
- నిమ్మరసం. 2 టీస్పూ//.
- పంచదార. 2 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
కొబ్బరి చిప్పలను తురిమి ఉంచుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి కోయాలి.
పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కొబ్బరికోరు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కలిపి రుబ్బాలి.
ఆ తరువాత ఉప్పు, పంచదార కూడా వేసి రుబ్బి, చివరగా నిమ్మరసం కలిపితే కొత్తిమీరతో కొబ్బరి చట్నీ రెఢీ.
No comments:
Post a Comment