కావలసిన పదార్థాలు
- మామిడికాయ. 1
- చిలగడదుంపలు. 3
- నూనె. 50 గ్రాములు
- ఎండుమిర్చి. 5
- మెంతులు. కాస్తంత
- ఆవాలు. 1 టీస్పూ//
- ఉప్పు, పసుపు. తగినంత
- ఇంగువ. కొద్దిగా
తయారీ విధానం
ముందుగా మామిడికాయ, దుంపలను శుభ్రంగా కడిగి పైచెక్కు తీసి తురిమి ఉంచుకోవాలి.
బాణెలిలో నూనె వేసి కాగిన తరువాత ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి.
ఆ తరువాత స్టవ్‌పై నుంచి బాణే లిని దించేసి, కాసేపు ఆరిన తరువాత రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి.
తరువాత అందులోనే తురిమి ఉంచుకున్న మామిడికాయ, చిలగడదుంపల కోరును కూడా కలిపి నూరాలి.
చివరగా ఉప్పు, పసుపు వేసి మరి కాసేపు నూరాలి. అంతే మామిడికాయ. చిలగడదుంప పచ్చడి రెడీ.
No comments:
Post a Comment