కావలసిన పదార్థాలు
- వెల్లుల్లి రేకులు. 5 కప్పులు
- ఉప్పు. 3/4 కప్పు
- కారం. 1 కప్పు
- మెంతిపొడి. 1/4 కప్పు
- జీలకర్ర. 2 టీస్పూ//.
- ఆవపిండి. 1/2 కప్పు
- ఇంగువ. 1/2 టీస్పూ//.
- నిమ్మరసం. 1 కప్పు
- నువ్వుల నూనె. 2 కప్పులు
- పసుపు. 1/4 టీస్పూ//.
తయారీ విధానం
వెల్లుల్లి రేకుల్ని పొట్టుతీసి శుభ్రం చేయాలి. ఓ
బాణెలిలో నూనె వేసి వేడి చేసి ఆవాలు, ఇంగువ, మెంతిపొడి, జీలకర్ర, పసుపు
వేసి వేయించాలి.
తరవాత వెల్లుల్లి వేసి బాగా కలపాలి. వీటిని వేరే జాడీలో వేసి ఉప్పు, కారం కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి.
చివరగా నిమ్మరసం వేసి బాగా కలిపిన తరవాత మిగిలిన నువ్వులనూనెను పచ్చడిమీద పోయాలి. అంతే వెలుల్లి పచ్చడి రెడీ.
No comments:
Post a Comment