కావలసిన పదార్థాలు
- అన్నిరకాల కూరగాయల ముక్కలు. 2 కప్పులు
- ఉప్పు. తగినంత
- కారం. 1/2 కప్పు
- మెంతిపొడి. 1 టీస్పూ//.
- ఇంగువ. 1/4 టీస్పూ//.
- ఆవాలు. 1 టీస్పూ//.
- నిమ్మరసం. 1/2 కప్పు
- నువ్వులనూనె. 1/2 కప్పు
- పసుపు. 1/2 టీస్పూ//.
తయారీ విధానం
ముందుగా కూరగాయలన్నింటినీ తీసుకుని కడిగి సన్నని ముక్కలుగా కోసి ఎండబెట్టాలి.
ఎండిన ముక్కల్ని కుక్కర్‌లో వేసి ఆవిరిమీద 2 నిమిషాలు ఉడికించాలి.
ఓ బాణెలిలో నువ్వులనూనె పోసి కొద్దిగా వేడిచేసి
ఆవాలు వేయాలి. అవి వేగిన తరవాత ఇంగువ, మెంతిపిండి, పసుపు, ఉడికించిన కూరగాయ
ముక్కలు అన్నీ వేసి కలపాలి.
మొత్తం పచ్చడిని వేరే పాత్రలోకి వంపి ఉప్పు, కారం
కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. చివరగా నిమ్మరసం కూడా జోడించి మిగిలిన
నూనెను పచ్చడిమీద పోస్తే రుచికరమైన మిక్స్‌డ్ వెజిటబుల్ పచ్చడి రెఢీ.!
No comments:
Post a Comment