కావలసిన పదార్థాలు
- టొమోటోలు. 1/2 కేజీ
- చింతపండు. కొద్దిగా
- నూనె. తగినంత
- కారం, ఉప్పు. రుచికి సరిపడా
- శెనగపప్పు. 2 టీస్పూ//.
- జీలకర్ర, మెంతిపొడి. 1/2 టీస్పూ//.
- షాజీరా, లవంగం పౌడర్. 2టీస్పూ//.
- అల్లం, వెలుల్లి పేస్ట్. 2 టీస్పూ//.
- ఎండుమిర్చి. 5
- పోపుగింజలు. 1 టీస్పూ//.
తయారీ విధానం
నూనె కాగిన తరువాత అందులో టొమోటో ముక్కలు, చింతపండును వేసి మగ్గనివ్వాలి.
మెత్తగా మగ్గిన తరువాత అందులో తగినంత ఉప్పు, కారం, జీలకర్ర, మెంతిపొడిలను వేసి కలియదిప్పి పక్కన ఉంచాలి.
మరో బాణెలి లో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత
పోపు గింజలు, ఎండుమిర్చి, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా
వేయించి కరివేపాకును కూడా కలిపి టొమోటో మిశ్రమంలో కలపాలి.
చివర్లో షాజీరా, లవంగాల పౌడర్‌ని కూడా కలపాలి. అంతే మసాలా టొమోటో పచ్చడి రెడీ అయినట్లే.
ఈ పచ్చడి నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది.
No comments:
Post a Comment