కావలసిన పదార్థాలు
- కాలీఫ్లవర్ ముక్కలు. 2 కప్పులు
- నూనె. మూడు టీస్పూ//.
- జీలకర్ర. 1/2 టీస్పూ//.
- ఆవాలు. 1/2 టీస్పూ//.
- మెంతులు. 1 టీస్పూ//.
- ఆవపిండి. మూడు టీస్పూ//.
- కారం. 2 టీస్పూ//.
- మెంతిపిండి. చిటికెడు
- ఉప్పు. తగినంత
- నిమ్మకాయలు. మూడు
తయారీ విధానం
కాలీఫ్లవర్‌ని కడిగిన తరువాత ముక్కలుగా విడదీసి బట్టమీద ఆరబెట్టాలి.
ఓ బాణెలిలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి అవి చిటపటమన్నాక కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేయించి దించాలి.
ఈ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి,
మెంతిపిండి అన్నీ వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండి మరోసారి కలిపితే
కాలీఫ్లవర్ పచ్చడి రెడీ.
No comments:
Post a Comment