కావలసిన పదార్థాలు
- కందిపప్పు... 1 కప్పు
- ఎండుమిర్చి. 5
- గుమ్మడి తురుము. 1/2 కప్పు
- ధనియాలు, జీలకర్ర. 2 టీస్పూ//
- వెల్లుల్లి... 1 రెబ్బ
- చింతపండు.2 రెబ్బలు
- నూనె. తగినంత
- ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు... తగినంత
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేడిచేసి కందిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
దాంట్లోనే మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర గుమ్మడి వేసి వేయించాలి. వీటన్నింటిని మిక్సీలో వేసి రుబ్బాలి.
దీంట్లో కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి రుబ్బి గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఇంగువతో తాళింపు పెట్టుకోవాలి. అంతే గుమ్మడి చట్నీ సిద్ధమైనట్లే.
No comments:
Post a Comment