Monday, May 7, 2012

గుమ్మడి పప్పు పులుసు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కందిపప్పు... 1/4 కేజీ
  • గుమ్మడికాయ... 100 గ్రా
  • పసుపు... 1/2 టీస్పూ//
  • తరిగిన ఉల్లిపాయ... 1
  • కారం... 1/2 టీస్పూ //
  • యాలకులు... 2
  • లవంగాలు... 2
  • దాల్చిన చెక్క... అంగుళం ముక్క
  • షాజీరా... 1/2 టీస్పూ //
  • ఎండుమిర్చి... 2
  • కరివేపాకు... 4 రెబ్బలు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్... 1 టీస్పూ //
  • చింతకాయలు... 5
  • గరంమసాలా పొడి... 1/2 టీస్పూ//
  • ఉప్పు... రుచికి సరిపడా
  • నెయ్యి... 2 టీస్పూ //

తయారీ విధానం

గుమ్మడికాయను ముక్కలుగా తరిగి పక్కనుంచుకోవాలి. కందిపప్పును కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి.
చింతకాయల్ని ఉడికించి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. బాణెలి లో నెయ్యి వేడిచేసి ఆవాలు, జీలకర్ర, గరంమసాలా దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
అందులోనే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దోరగా వేయించాలి.
తరువాత గుమ్మడికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి ఐదునిమిషాలపాటు వేయించాలి.
బాగా వేగిన తరువాత కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి సన్నటి సెగమీద ఉడికించాలి.
గుమ్మడి ముక్కలు మగ్గిన తరువాత చింతపులుసు వేసి ఉడికించి, మెదిపి ఉంచుకున్న పప్పు, గరంమసాలా పొడి వేసి ఉడికిన తరువాత దించీవేయాలి. 

No comments:

Post a Comment