కావలసిన పదార్థాలు
- తోటకూర. 2 కట్టలు
- ఉల్లిపాయలు. 4
- టమోటాలు. 4
- పచ్చిమిర్చి. 6
- తాలింపుగింజలు. 3 టీస్పూ//
- పచ్చిశెనగపప్పు. 50 గ్రా.
- వెల్లుల్లి.. 4 రేకలు
- ఉప్పు.. సరిపడా
- కారం. సరిపడా
- చింతపండు. సరిపడా
తయారీ విధానం
తోటకూరను శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఉల్లి, మిర్చి, టమోటాలను ముక్కలుగా తరుగుకోవాలి.
తరిగినవన్నీ ఒక గిన్నెలో వేసి దానిపై శనగపప్పు చల్లి ఉప్పు వేసి ఉడికించాలి.
తరువాత ఒక బాణెలి లో నూనె పోసి కాగిన తరువాత పోపుపెట్టి ఉడికించిన కూరలో వేయాలి.
దాంట్లో చిక్కగా కలుపుకున్న చింతపండు రసం పోసి
ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఉడకనిచ్చి, దింపేముందు కొత్తిమీర చల్లాలి.
అంతే తోటకూర పులుసు సిద్ధం.
No comments:
Post a Comment