కావలసిన పదార్థాలు
- అల్లం. 1/4 కేజీ
- చింతపండు. తగినంత
- బెల్లం తరుగు. 3 టీస్పూ//
- నీళ్లు. 3 కప్పులు
- వెల్లుల్లి. 5 రేకలు
- ఉప్పు. తగినంత
- పసుపు. చిటికెడు
- నూనె. 2 టీస్పూ//
- ఉల్లిపాయలు. 3
- కరివేపాకు.. 2 రెమ్మలు
- ఆవాలు.. ¼ టీస్పూ//
- మెంతులు.. ½ టీస్పూ//
- కొత్తిమీర.. 1 కట్ట
తయారీ విధానం
ముందుగా చింతపండును పది నిమిషాలపాటు నానబెట్టాలి. అల్లం మెత్తగా గ్రైండ్ చేసి ఉంచాలి.
బాణెలి లో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి వేయించాలి.
ఆపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముద్ద వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి.
తరువాత తగినంత ఉప్పువేసి చింతపండు పులుసు, బెల్లం తరుగు వేసి కాసేపు మరిగించాలి.
చివర్లో కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి అల్లం పులుసు తయార్.
No comments:
Post a Comment