కావలసిన పదార్థాలు
- అరటికాయలు. 5
- ఉల్లిపాయలు. 3
- పచ్చిమిర్చి. 5
- కరివేపాకు. 3 రెమ్మలు
- వెల్లుల్లి.. ½ పాయ
- ఎండుమిర్చి.. 5
- చింతపండు. 100 గ్రా.
- నూనె.. 150 గ్రా.
- ఉప్పు, కారం.. తగినంత
- ధనియాలపొడి.. 2 టీస్పూ//
- పసుపు. 1/2 టీస్పూ// .
- టొమోటోలు. ½ కేజీ
- బెల్లం. 100 గ్రా.
తయారీ విధానం
ముందుగా అరటికాయను ముక్కలుగా కోసి పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి.
బాణెలి లో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి కాసేపు వేయించాలి.
ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను కూడా వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి.
ఉప్పు, కారం, ధనియాలపొడి కూడా వేసి కలియబెట్టి
చింతపండు రసం, ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కలిపి బాగా ఉడికించి
దించేయాలి. అంతే వేడి వేడి అరటికాయ పులుసు తయార్.
No comments:
Post a Comment