కావలసిన పదార్థాలు
- మెంతులు. 200 గ్రా.
- జీలకర్ర. 2 టీస్పూ//.
- అల్లంముక్క. చిన్నది
- పసుపు. 1/2 టీస్పూ//.
- చింతపండు. 50 గ్రా.
- ఉప్పు. సరిపడా
- పంచదార. నాలుగు టీస్పూ//.
- నూనె. ఆరు టీస్పూ//.
తయారీ విధానం
మెంతులు నానబెట్టి ఉంచాలి. చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టిన మెంతులను నీటిలో ఉడికించి, నీళ్లు వార్చేయాలి.
పొయ్యిమీద బాణెలి పెట్టి నూనె వేసి, బాగా కాగాక జీలకర్ర వేసి కొద్దిగా నీరుపోసి మెంతులను వేయాలి.
సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా అందులోనే వేసి ఉడికించాలి.
తరువాత చింతపండు పులుసు పోసి, కొంచెం ఉడికిన తరువాత
పంచదార, పసుపు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికిన తరువాత దించేయాలి. అంతే
మెంతులతో పులుసు రెఢీ.
No comments:
Post a Comment