కావలసిన పదార్థాలు
- ఉసిరికాయలు. 8
- ఎండుమిర్చి. 2
- ఆవాలు. 1/4 టీస్పూ//.
- జీలకర్ర. 1/4 టీస్పూ//.
- వెల్లుల్లి. 5 రెబ్బలు
- ధనియాల పొడి. 1.1/2 టీస్పూ//.
- మిరియాల పొడి. 1/4 టీస్పూ//.
- కరివేపాకు. 2 రెమ్మలు
- కొత్తిమీర. 1 కట్ట
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
ఉసిరికాయలను రెండుగా విడదీసి ఆ ముక్కల్లో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించి, తరవాత వడగట్టాలి.
విడిగా ఓ గిన్నెను తీసుకుని కొద్దిగా నూనెవేసి
ఆవాలు, జీలకర్రలతో పోపుపెట్టి అందులో పప్పుతేట, వడగట్టిన ఉసిరిరసం కలిపి
స్టవ్‌మీద పెట్టాలి.
రసం కాస్త మరగగానే దంచిన వెల్లుల్లి, ధనియాలపొడి, మిరియాలపొడి, కొత్తిమీర, కరివేపాకు వేసి ఐదునిమిషాల తరువాత దించాలి.
చివరగా ఉప్పు సరిచూడాలి.అంతే ఉసిరికాయలతో రసం రెఢీ.
No comments:
Post a Comment