కావలసిన పదార్థాలు
- చిన్న ఉల్లిపాయలు. 1/4 కేజీ
- చింతపండు గుజ్జు. 2 కప్పులు
- కొత్తిమీర తురుము. కొద్దిగా
- పచ్చిమిర్చి. 3
- ఎండుమిర్చి. 2
- కారం. 2 టీస్పూ//.
- ధనియాలపొడి. 3 టీస్పూ//.
- అల్లం వెల్లుల్లి. 1 టీస్పూ//.
- ఆవాలు, జీలకర్ర. చెరో 1/4 టీస్పూ//.
- పసుపు. 1/4 టీస్పూ//.
- బెల్లంపొడి. 1 టీస్పూ//.
- శెనగపిండి. 1 టీస్పూ//.
- కరివేపాకు. 2 రెమ్మలు
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
ఓ బాణెలిలో నూనె పోసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
ఉల్లిపాయలు వేసి ఉప్పు, పసుపు చల్లి మూతపెట్టి
సన్నసెగమీద కాసేపు మగ్గనివ్వాలి. తరవాత అల్లంవెల్లుల్లి వేసి మంచి వాసన
వచ్చేవరకూ వేపి కారం, ధనియాలపొడి చల్లాలి.
అందులోనే చింతపండు గుజ్జు వేసి నీళ్లుపోసి ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తరవాత బెల్లంపొడివేయాలి.
చివరలో శెనగపిండి కలిపిన నీళ్లు పోసి మూతపెట్టి
చిక్కబడేవరకూ ఉడికించి కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే
ఉల్లికారం పులుసు రెడీ.
No comments:
Post a Comment