Monday, May 7, 2012

పాలకూర పెరుగు పులుసు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పాలకూర. 4 కట్టలు
  • పెరుగు. 3 కప్పులు
  • జీలకర్ర. 1/4 టీస్పూ//.
  • పచ్చిమిర్చి. ఐదు
  • బియ్యం. ఐదు టీస్పూ//.
  • కొబ్బరి. చిన్నముక్క
  • ధనియాలు. 1/2 టీస్పూ//.
  • ఆవాలు. 1 టీస్పూ//.
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 2
  • నూనె. 2 టీస్పూ//.
  • ఉప్పు. సరిపడా.

తయారీ విధానం

పెరుగును గిలకొట్టి కప్పు నీళ్లు పోసి ఉంచాలి. ఇప్పుడు బియ్యం, పచ్చిమిర్చి, కొబ్బరి, ధనియాలు కలిపి మెత్తగా నూరాలి.
ఈ ముద్దను మజ్జిగలో కలిపి స్టవ్‌మీద పెట్టి మరిగించాలి. తరవాత బాగా కడిగి సన్నగా తరిగిన పాలకూరను మజ్జిగలో కలిపి ఐదునిమిషాలు ఉడికించి ఉంచాలి.
చిన్న బాణెలిలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిలతో తాలింపు వేసి, మజ్జిగలో కలపాలి.
చివరగా ఉప్పు సరిజూసి దించేయాలి. అంతే పాలకూర పెరుగు పులుసు రెడీ.

No comments:

Post a Comment