Monday, May 7, 2012

మునక్కాయ తీపి పులుసు

కావలసిన పదార్థాలు

  • మునక్కాయలు. 4
  • చింతపండు. 2 నిమ్మకాయలంత
  • వరిపిండి. 2 టీస్పూ//
  • బెల్లం. కాస్తంత
  • ఉప్పు. సరిపడా
  • పసుపు. చిటికెడు
  • కారంపొడి. 2 టీస్పూ//
  • మసాలాపొడి.4 టీస్పూ//

తయారీ విధానం

మునక్కాయలను కోసి పక్కన ఉంచాలి. చింతపండును రసంతీసి ఉంచాలి.
అందులో ఉప్పు, పసుపు, కారం, మునక్కాయ ముక్కలు వేసి ఉడికించాలి.
ఇవి ఉడికేటప్పుడే వరిపిండి, బెల్లం కూడా కలిపి ఉడికించాలి.
మునక్కాయ ముక్కలు ఉడికిన తరువాత మసాలాపొడి వేసి బాగా కలిపి సన్నటి మంటమీద కాసేపు ఉంచి దించేస్తే మునక్కాయ తీపి పులుసు తయారైనట్లే.
పులుసు మరింత కారంగా కావాలనుకునేవారు కారంపొడి మోతాదును పెంచుకోవచ్చు.

No comments:

Post a Comment