Sunday, June 21, 2015

గర్భస్థ శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయని, అర్ధమౌతాయని పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. ఇవి అతిశయోక్తులు కాదు, ఇందులో నిజం ఉందని ఉదాహరణ సహితంగా తెలియజేశాయి ధార్మిక గ్రంధాలు.
అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. కనుకనే తర్వాతి కాలంలో అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.
హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుడి మాటలు విని ఆకళింపు చేసుకున్నాడని, అందువల్లనే పుడుతూనే విష్ణుభక్తుడు అయ్యాడని చెప్తారు. నారదుడు లీలావతికి చేసిన ఉపదేశం ఆమె కంటే కూడా ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాడునికే ఎక్కువ ఉపయోగపడ్డాయి.
నేర్చుకోవడం అనేది గర్భస్థ సిసువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అనేక పరిశోధనలు చేసి నిరూపిస్తున్నారు. కడుపులో ఉన్న పిండానికి ముందుగానే వినికిడి శక్తి ఏర్పడుతుందని, దాంతో తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు, తల్లి ఇతరులతో చెప్పే సంగతులు విని గ్రహించగాలుగుతారని నిపుణులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.
గర్భస్థ శిశువు మన మాటలు వింటుంది, గ్రహిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని, ఆవేశాలు, అరుపులకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఎంత మంచి మాటలు వింటూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగితే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుంది అని సూచిస్తున్నారు.

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి?

నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాల గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకోండిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు.
ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధిచినది. నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు.
మన శరీరం చుట్టు రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తలవరకు, తల నుండి పాదం వరకు తిరుగుతుంది. రెండవది ఎడమ వైపునుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది. అనుకూల దిశగా మన శరీర కదలిక వల్ల రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది.
ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివిఎపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలుపడం జరుగుతోంది.
పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమవైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు.

ఆరోగ్యంగా వుండాలంటే ఏ వారం ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి .

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి.
మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోదుమలతో చేసినవి తినటం మంచిది.రాగులతో చేసినవి తినచ్చు.
సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ గ్రహం. కనుక నీరు అధికంగా వుండే, గుమ్మడి, దోస, పుచ్చ పండు వంటివి తింటే బాగా జీర్ణం అయిపోతాయి.
మంగళవారం కుజుడి ప్రభావం వుంటుంది. కుజుడు వేడి గ్రహం. కనుక వేడిపుట్టించే మామిడిపండు, పైన్ ఆపిల్, ఉల్లిపాయ, మిరియం, వెల్లుల్లి, మొదలైనవి బాగా పీల్చబడి త్వరగా జీర్ణం అవుతాయి.
బుధవారం బుధుడి ప్రభావం వుంటుంది. ఈ గ్రహం రెండు రకాలు కనుక ఏ ఆహారం ఈ రోజు తీసుకున్నా పరవాలేదు. పచ్చ పెసర్లుతో చేసినవి,పచ్చబఠానితో చేసినవి తినచ్చు.
గురువారం, గురుగ్రహ ప్రభావం వుంటుంది. పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహారాలు అంటే ఆరెంజ్, నిమ్మ, అరటిపండు, మొదలైనవి తినండి.
శుక్రవారం శుక్రుడి ప్రభావం వుంటుంది. శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు, సంబంధించిన ఆహారాలు, బాదం, పిస్తా, బాదంపప్పు, జింక్ అధికంగా వుండే ఆహారాలైన డార్క్ చాక్లెట్, వేయించిన గుమ్మడి గింజలు, వంటివి తనటం ప్రయోజనకరం.
శనివారం శని ప్రభావం వుంటుంది. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. కనుక నూనె ఆహారాలు, జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం అవుతుంది. మన ఆహారం భూమి ద్వారా వస్తుంది. భూమిలో అన్నిరకాల ఎనర్జీలు వుంటాయి.
మనం తినే ఆహారం భూమినుండి నెగెటివ్ మరియు పాజిటివ్ శక్తులు కలిగి వుంటుంది. మనం సంతోషంగా వుంటే, సరైన ఆహారం తింటాం. మన దుఖం లేదా విచారంతో వుంటే మనం తినే ఆహారాలు మారుస్తూ సంతోషం కొరకు ప్రయత్నిస్తాం.
జీర్ణక్రియ సమస్యలు తరచుగా వస్తూవుంటే....మీ జాతకంలోని బలహీన గ్రహాలను బలం చేసేటందుకు ప్రయత్నించాలి. మీ జీవన నాణ్యతను మెరుగుపరచుకుంటూ వేగంగా జీర్ణం కలిగించుకోవాలి కనుక మీ బలహీన గ్రహాలేవో తెలుసుకోండి. బలహీన గ్రహాలను ఎలా బలపరచాలి?
వైద్య సలహాలకు జ్యోతిషం, గ్రహాలు ప్రత్యామ్నాయాలు కావు, కాని, అది మీకు ఆరోగ్య అంశాలలో ఎన్నో వివరాలను అది అందిస్తుంది. జ్యోతిషం ముందస్తుగా మీ వ్యాధుల అవకాశాలను తెలుపటమే కాదు వాటిని నివారించుకోడానికి అవసరమైన చర్యలను కూడా తెలుపుతుంది. 

కరక్కాయ

దీని శాస్త్రీయ నామము " terminalia chebula. సంస్కృతం లో "హరిటకి" అంటారు . కరక్కాయ వాత
తత్వము పై పనిచేస్తుంది . బుద్ధిని వికషింప జేస్తుంది . బలం కలిగిస్తుంది , ఆయుహ్ కాలం పెంచుతుంది
ఉప్పు తప్ప అన్ని రుచులు కలిగి ఉంటుంది .
• కరక్కాయ విరేచానకారి , లుబ్రికేంట్ , మలబద్దకాన్ని నివారిస్తుంది .
•
• ఫైల్స్ కి మంచి మందు ,
•
• ఏస్త్రిన్జేంట్(Astringent) , యాంటి స్పాస్మడిక్(Anti-Spasmodic),యాంటి పైరేతిక్(Anti-pyretic) గా పనిచేస్తుంది .
•
• పొట్ట ఉబ్బరము , ఎక్కిళ్ళు, వాతులు తగ్గిస్తుంది ,
•
• జీర్ణ క్రియకు తోడ్పడుతుంది ,
•
• ఆదుర్దా , నాడీమండల నిస్త్రాణ ను నియంత్రిన్స్తుంది ,
•
• కంటికి మంచి మందు ,
•
• కంట స్వరము చక్కబెడుతుంది ,
•
• కఫా జ్వరాలు నయమవుతాయి ,
ఉపయోగములు :-
1) కరక్కాయ పొడిని మోతాదుకు 3 గ్రా . లు తీసుకొని తేనె తో నిత్యము రెండు పూటల ( ఉదయం , సాయంత్రము ) తీసుకుంటూ , పథ్యము చేస్తు , వుంటే 10 రోజుల్లో పచ్చకామెర్లు ( jaundice) తగ్గిపోతాయి .
2) కరక్కాయ పొడి (ఒక) 1 భాగములో , వేయించిన పిప్పళ్ళ పొడిని ½ (అర) భాగము కలిపి. దాంట్లో నుండి ఒక మోతాదుకు 1 గ్రా పొడిని ని తీసుకొని తేనెతో కలిపి ప్రతి 4 గంటలకి ఒకసారి తీసుకుంటే కోరింత దగ్గు( whooping cough) తగ్గిపోతుంది .
3) భోజనానికి ఒక గంట ముందు కరక్కాయ పొడిని కొచ్చెమ్ బెల్లము తో కలిపి తీసుకుంటే రక్త మొలలు (piles) తగ్గిపోతాయి .
4) కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే విష జ్వరములు తగ్గుతాయి .
5) కరక్కాయ పొడిని ఆముదములో కలిపి ప్రతి రోజు తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి .
6) కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు వీటి చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసుకొని పూటకు అర టీస్పూన్ చొప్పున మూడుపూటలా తేనెతో గాని లేదా నీళ్ళతో గాని కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది.
7) ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున అరకప్పు వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతోగాని కలిపి తీసుకోవాలి.
8) ఆయాసం, ఎక్కిళ్లు సతమతం చేస్తున్నప్పుడు బెల్లం పానకంలో కరక్కాయ ని లేక కరక్కాయ పొడిని వేసి ఉడికించి తీసుకోవాలి.
9) ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసికట్టుగా హింసిస్తున్నప్పుడు వేడిచేసిన పాత నెయ్యిలో కరక్కాయల పెచ్చుల చూర్ణం, ఇంగువ పొడి, బిడాలవణం చేర్చి కలిపి మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండుపూటలా తీసుకోవాలి
10 ) రక్తహీనతతో బాధపడేవారు కరక్కాలను గోమూత్రంలో నానబెట్టి, తరువాత ఎండబెట్టి, పొడిచేసి, పూటకు అర టీస్పూన్ మోతాదులో రెండు పూటలా అర కప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి.
11) కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, బెల్లం వీటి సమాన భాగాలను కలిపి నిల్వచేసుకొని మోతాదుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. మలంతోపాటు జిగురు పడటం ఆగుతుంది. ముఖ్యంగా శరీరంలో నీరు పట్టడం తగ్గుతుంది.
12) కఫదోషంవల్ల శరీరంలో వాపుతయారైనప్పుడు కరక్కాయలను గోమూత్రంలో నానబెట్టి, పొడిచేసి పూటకు 3గ్రాముల మోతాదుగా అర కప్పు వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి
13) కరక్కాయల చూర్ణం, ఇప్ప పువ్వు, పిప్పళ్లు చూర్ణం మూడూ కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా తేనె చేర్చి వేడినీళ్లతో సహా రెండుపూటలా తీసుకుంటే శరీరంలో తయారైన వాపు తగ్గుతుంది.
14) కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, దేవదారు చూర్ణం మూడు సమభాగాలు కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా, వేడినీళ్లతో రెండుపూటలా తీసుకుంటే శరీరంలో చేరిన నీరు వెళ్లిపోయి వాపు తగ్గుతుంది.
15) కరక్కాయ పిందెల చూర్ణాన్ని 3గ్రాముల మోతాదుగా బెల్లంతో కలిపి అర కప్పు నీళ్లతో తీసుకుంటే శరీరంలో చేరిన వాపు తగ్గుతుంది.

భోజనం విషయంలో ఆయుర్వేదం ఏం చెపుతోంది?

 ఆయుర్వేదం ప్రకారం భోజనం మూడువిధాలుగా తీసుకోవాలని నిర్దేశిస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణ సంబంధ బాధలు లేకుండా ఉండాలంటే మూడు ముఖ్యమయిన నియమాలను పాటించాలని ఆయుర్వేదం చెపుతుంది.
వాటిలో మొదటిది హితభుక్త.... శరీరానికి మేలు చేసే ఆహారం సుళువుగా జీర్ణమయ్యేదానిని హితభుక్తగా నిర్దేశించింది.
మితభుక్త... అవసరం మేరకు తినడం, అధికంగా తినకపోవడం, ఎక్కువసార్లు తినకపోవడం, సమయపాలన, ఎక్కువ పదార్థాలు తినకపోవడాన్ని మితభుక్త.
ఋతుభుక్త... ఆయా ఋతువుల్లో లభ్యమయ్యే ఆహారం తప్పనిసరిగా తినడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి ప్రసాదించే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం - ఋతుభుక్తగా నిర్దేశించారు. ఈ ప్రకారంగా భోజనం చేస్తుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.

Friday, June 19, 2015

వంట కోసమే కాదు వంటి కోసం కూడా....ఇంగువ!!!

 సీజన్ మారింది.. ఈ సీజన్ లో చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది… అదీ మైగ్రేన్ అంటే భరించ లేనిది.
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే సరిపోతుందని, ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పి మాత్రమే గాకుండా సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

అలాగే నిమ్మరసం కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి బాగా పనిచేస్తుంది. అజీర్తి మెరుగ్గా పనిచేసే ఇంగువకు కడుపు మంటను తగ్గించే గుణం ఉంది. యాంటిఆక్సిడెంట్ లక్షణాలు ఇంగువలో ఉన్నాయి. చికాకు పెట్టే పేగు వ్యాధి పేగులో వాయువు, అజీర్తి మొదలైన లక్షణాలను తగ్గించడంలో ఇంగువ సహాయం చేస్తుంది.
ఒక అరకప్పు నీటిలో కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఇంగువ శ్వాసకోశ వ్యాధులన్ని తగ్గిస్తుంది. తేనె, అల్లం లో ఇంగువను కలిపి తీసుకుంటే దీర్ఘకాల౦గా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇంగువ నరాలను ఉత్తేజపరచడం ద్వారా మూర్ఛ వంటి నాడీ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

 గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. పండుగలైనా.. ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు.

ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.. కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.. ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది.

ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది .. అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి.

ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న మర్మమేంటో.. మీకు తెలుసా..?

ఆషాఢమాసంతో గ్రీష్మరుతువు పూర్తిగా వెళ్లిపోయి.. వర్షరుతువు ప్రారంభమౌతుంది.

గ్రీష్మంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది.. మన శరీరంలో ఉన్న వేడి.. బయట చల్లబడిన వాతావరణం పరస్పర విరుద్ధం కాబట్టి అనారోగ్యాలు మొదలౌతాయి.
గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అందువల్లే మన ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.
మహిళలు.. ఈ ఆషాడంలో అందంతో పాటు..ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీ
అరచేతుల నిండా నింపుకోండి...........