Saturday, June 27, 2015

నిండు నూరేళ్లు… పళ్లు గట్టిగా ఉండాలంటే….?

ఇటీవల … నిజంగా జరిగిన ఘటన… ఓ 90 ఏళ్ల ముసలావిడ కన్నుమూశాక యధావిధిగా అంతిమసంస్కారాలు పూర్తిచేశారు. ఆశ్చర్యంగా దహనం తర్వాత బూడిదలో చూస్తే… ఆవిడ 32 పళ్లు అలాగే గట్టిగా ఉన్నాయి. అబ్బురపడ్డ బంధుమిత్రులతో ఆ ఇంటివాళ్లు చెప్పిన వృద్ధురాలి దంత రహస్యం ఏంటో తెలుసా…?
ఆవిడ ఆహార అలవాట్లు పద్ధతిగా పాటించటంతో పాటు.. వారానికోమారు త్రిఫల చూర్ణం రెండు చెంచాలు రాత్రంతా చెంబుడు నీళ్లలో కలిపి ఉంచి… ఉదయాన్నే అవి అయిపోయేదాకా పుక్కిలించేదట. దానివల్ల పళ్ల చిగుళ్లలో క్రిములతో పాటు… లోలోపల దాక్కున్న బాక్టీరియా సైతం పోయి…. అదిగో అలా 90 ఏళ్లు వచ్చినా… అన్ని పళ్లు… అంతే గట్టిగా ఉన్నాయన్న మాట.
అప్పట్లో… వజ్రదంతి యాడ్ వచ్చేది…. ఒక ముసలి వ్యక్తి చలాకీగా వాల్ నట్ కొరికేవాడు… అది ప్రచార ప్రకటన.. మరి నిజంగా జరుగుతున్నదేంటి…? ఇప్పుడు.. వీధికో దంతవైద్యుడు… అది పట్టణాళ్లో… మరి రాజధానిలో… వీధికి పది అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కారణం… జంక్ ఫుడ్ … అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు… అంటే… మరీ వేడిగా… లేదా టూమచ్ చల్లగా …. తినటం..తాగటం… వీటికి తోడు పిజ్జాలు, బర్గర్లు, పఫ్ లు, వివిధ రకాల కేక్స్… హిమక్రీములు… ఇంకా అనేకం. నాటి తరం వాళ్లు దంపుడు బియ్యంతో పాటు… సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే రకరకాల కూరగాయలు, పళ్లు తినేవాళ్లు. ఎప్పుడో పండగలప్పుడు మాత్రమే…. మిఠాయిలు… మరిప్పుడు… తినాలనిపిస్తే చాలు స్వీట్లు.
ఇక పిల్లలకైతే… పుట్టినప్పుడు మొదలుపెడితే… ఎల్కేజీ, యూకేజీ వచ్చేటప్పటికే.. కేజీల లెక్కన చాక్లెట్లు తిని పళ్లు పుచ్చిపోతున్నాయి. సో.. 90 సంగతి పక్కన పెట్టండి… పాతికేళ్లలోపే పండ్లు కట్టించుకోవాల్సిన పరిస్థితి…అందుకే డెంటల్ డాక్టర్లలోనూ రకరకాల స్పెషలైజేషన్లు… మనం కొనుక్కోవటానికి డిఫరెంట్ టారిఫ్ ల్లో … రకరకాల పళ్లు… కాబట్టి … పళ్లు కాపాడుకోవాలా….? కొనుక్కోవాలా…?
ఇది పూర్తిగా మనమీద ఆధారపడి ఉంది. ఎలా..అంటే…మన ఆహార అలవాట్లు కొద్దిగా మార్చుకోవటం మాత్రమేకాదు.. దంత సంరక్షణ కోసం … మరీ రసాయనిక పేస్టుల మీద ఆధారపడకుండా… సహజమైన ఉత్పత్తులు వాడితే మంచిది.

కలలో కనిపించే జంతువులు - వాటి అర్ధాలు

కలలో కనిపించే ఇంకొన్ని జంతువుల ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం.
.
కుందేలు
కలలో కనిపించే జంతువులు - వాటి అర్ధాలు
ఇమేజ్
కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్ధం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న కుందేళ్ళు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి.
.
లేడి
లేడి దయ, సౌమ్యత, మరియు సహజ అందానికి గుర్తు. ఇది మీలోని సున్నిత భావాలకు సూచన. నల్ల లేడి కనిపిస్తే, మీరు మీలోని సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు. లేడిని చంపుతున్నట్లు కల వస్తే మీలోని సున్నిత భావాలను, ఇంకా దయ, సౌమ్యతను అణిచివేయటానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం.
.
ఏనుగు
కలలో ఏనుగు కనిపిస్తే, మీరు ఇతరుల పట్ల ఇంకా. ఎక్కువ అవగాహనతో, సహనంతో ఉండాలని అర్ధం. ఏనుగు శక్తి, బలం, మరియు తెలివికి చిహ్నం. అంతేకాక, ఇది మీలోని అంతర్ముఖ వ్యక్తిత్వానికి సూచన కావచ్చు. ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే, మీరు ఒకప్పుడు భయపడిన, మీలోని దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్ధం.
.
మేక
మేక పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవటాన్ని, అవివేకాన్ని సూచిస్తుంది. మేకపోతు కనిపిస్తే, మీ పోటీదారులు మీవ్యాపారాలను కూల్చివేయటానికి ప్రయత్నిస్తున్నారని అర్ధం.
.
గుర్రం
గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన. నల్ల గుర్రం హింస మరియు క్షుద్ర శక్తులకు, తెల్ల గుర్రం స్వచ్ఛత, శ్రేయస్సు అదృష్టానికి సూచన. చనిపోయిన గుర్రం ఒకప్పుడు మీకు బలం కలిగించింది ఏదో మీ జీవితంలోనుండి పోయిందని, ఇప్పుడు లేదనే దానికి సూచన. అడవి గుర్రాలమంద బాధ్యతా రాహిత్యానికి గుర్తు. గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీనియంత్రణలో ఉంటే, అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారని, నియంత్రణలోలేని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే, మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయవని అర్ధం.
.
పాము
ఎక్కువమందికి కలలో కనిపించే జంతువులలో పాము కూడా ఒకటి. పాము ప్రమాదకరమైన, నిషిద్ధ లైంగికతకు ప్రతీక. కలలో పాము కాటు వేస్తే మీలో దాగబడ్డ భయాలు, ఆందోళనలు ఉన్నాయని, అవి మిమ్మల్ని బాగా భయపెడుతున్నాయని అర్ధం. ఇది మీరు నిజజీవితంలో ఎదుర్కోబోయే ప్రమాదానికి సూచన కావచ్చు. కలలో పాము తరుముతుంటే, మీరు వద్దనుకుంటున్న పరిస్థితిలోనే మీరు చిక్కుకోవాల్సి వచ్చిందని, లేక వస్తుందని అర్ధం.
.
పంది
పంది మురికి, అత్యాశ, స్వార్ధానికి గుర్తు. మీలో ఉన్న స్వార్ధాన్ని లేక అత్యాశను వదిలించుకుంటే కానీ విజయావకాశాలు దరి చేరవని అర్ధం.
.
గొర్రె
గొర్రె ప్రయత్నలేమిని, చొరవలేనితనాన్ని సూచిస్తుంది. సృజనాత్మకతను పెంచుకొని, కొత్త మార్గాల్లో వెళ్ళటానికి మీరు మొగ్గు చూపరని, నలుగురితోపాటు నారాయణా అనటానికే ఇష్టపడతారని అర్ధం.
.
సింహం
సింహం బలానికి, దూకుడుకి, శక్తికి ప్రతీక. మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనిని నియంత్రించవలసిన అవసరం ఉందని అర్ధం. సింహం మీపై దాడి చేసినట్లు కల వస్తే, మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచిస్తుంది.
.
పులి
పులి శక్తికి, వివిధ పరిస్థితులను ఎదుర్కోవటానికి కావలసిన మీ సామర్థ్యానికి, నాయకత్వ లక్షణానికి సూచన. బోనులో ఉంచబడిన పులి అణచివేయ్యబడిన భావోద్వేగాలకు, దాడి చేస్తున్న పులి, ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి గుర్తు.
.
తాబేలు
తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుక్కోవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మీకు ఎదగటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, కానీ దాని కోసం సరి అయిన అడుగు వేయాలని అర్ధం.

Thursday, June 25, 2015

ఆషాఢ మాసం.....

''ఆషాఢ మాసం కాదిది, నవవధూవరుల సరస శృంగారాల, సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల విరహాల, అరూడ మాసం'' అన్నడో కవిమిత్రుడు.
ఆషాడం లో అత్తా అల్లుళ్ళు ఎదురుపడోద్దు అని ఒక ఆచారం ఉంది. దీని వెనక ఒక అర్థం చెబుతారు.
పూర్వం వ్యవసాయమే జీవనాధారం .సంపాదన ఎలా ఉన్నా, తినడానికి కొన్ని గింజలు ఉండాలని, క్రొత్త వలపు మోజులో తినడానికి ఆధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అనీ ఈ నిబంధన పెట్టారు.
మరో అర్థం ఏమిటంటే - ఈ మాసంలోని వాతావరణం చాలా మార్పులు ఉంటాయి. ఇప్పుడు కొన్ని అంటువ్యాధులు బాగా ప్రబలుతాయి. పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉండొద్దని కూడా అంటారు. ( పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యమైనదని - ఆ సమయములోనే అవయవాలు ఏర్పడుతాయనే ఈ మధ్యనే సైంటిస్టులు తెలియచేశారు.) పుట్టింటికి పోయిన వధువు ఇంట్లోనే ఉంటుంది. ఆమెకి తోడుగా ఆమె అమ్మ కూడా ఉంటుంది.
ఇంకో కారణం ఆషాడం తరవాత శ్రావణం లో అన్నీ పూజలూ, పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. అందులో దాదాపుగా అన్నీ మంచి రోజులూ ఉంటాయి. ఆ శుభరోజులలో గర్భధారణ జరిగితే - మంచిది అని ఆలోచన. పైన చెప్పానుగా జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలములో అనుకున్నారు. ఇప్పుడు అలా అయితే చాలా బాగుంటుంది అని వారి ఆలోచన. ఇప్పుడు గర్భము ధరిస్తే తొమ్మిది నెలలకి అంటే (శ్రావణం, భాద్రపదం.. అలా చూస్తే చైత్రం వస్తుంది. అంటే ఉగాది పండగ దగ్గరలో..) నిండు వేసవిలో - ప్రసవం జరుగుతుంది. పుట్టిన పిల్లలకి కాస్త తల్లిపాల వల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. తద్వారా పిల్లలు వానాకాలములో వచ్చే వ్యాధులని తట్టుకుంటారు అని కూడా కావచ్చును.వేసవి కాలంలో ప్రసవం అటు తల్లికీ ... ఇటు బిడ్డకి కూడా అంత మంచిదికాదు కాబట్టి పెద్దలు ఈ ఆచారాన్ని వెలుగులోకి తెచ్చారని చెప్పుకోవచ్చు.
ఇంకోకారణం ఒక నెల వియోగం తరవాత కలుసుకున్నాక వారు ఎంతో అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా.

ఆరోగ్యంగా వుండాలంటే ఏ వారం ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి .

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి.
మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోదుమలతో చేసినవి తినటం మంచిది.రాగులతో చేసినవి తినచ్చు.
సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ గ్రహం. కనుక నీరు అధికంగా వుండే, గుమ్మడి, దోస, పుచ్చ పండు వంటివి తింటే బాగా జీర్ణం అయిపోతాయి.
మంగళవారం కుజుడి ప్రభావం వుంటుంది. కుజుడు వేడి గ్రహం. కనుక వేడిపుట్టించే మామిడిపండు, పైన్ ఆపిల్, ఉల్లిపాయ, మిరియం, వెల్లుల్లి, మొదలైనవి బాగా పీల్చబడి త్వరగా జీర్ణం అవుతాయి.
బుధవారం బుధుడి ప్రభావం వుంటుంది. ఈ గ్రహం రెండు రకాలు కనుక ఏ ఆహారం ఈ రోజు తీసుకున్నా పరవాలేదు. పచ్చ పెసర్లుతో చేసినవి,పచ్చబఠానితో చేసినవి తినచ్చు.
గురువారం, గురుగ్రహ ప్రభావం వుంటుంది. పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహారాలు అంటే ఆరెంజ్, నిమ్మ, అరటిపండు, మొదలైనవి తినండి.
శుక్రవారం శుక్రుడి ప్రభావం వుంటుంది. శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు, సంబంధించిన ఆహారాలు, బాదం, పిస్తా, బాదంపప్పు, జింక్ అధికంగా వుండే ఆహారాలైన డార్క్ చాక్లెట్, వేయించిన గుమ్మడి గింజలు, వంటివి తనటం ప్రయోజనకరం.
శనివారం శని ప్రభావం వుంటుంది. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. కనుక నూనె ఆహారాలు, జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం అవుతుంది. మన ఆహారం భూమి ద్వారా వస్తుంది. భూమిలో అన్నిరకాల ఎనర్జీలు వుంటాయి.
మనం తినే ఆహారం భూమినుండి నెగెటివ్ మరియు పాజిటివ్ శక్తులు కలిగి వుంటుంది. మనం సంతోషంగా వుంటే, సరైన ఆహారం తింటాం. మన దుఖం లేదా విచారంతో వుంటే మనం తినే ఆహారాలు మారుస్తూ సంతోషం కొరకు ప్రయత్నిస్తాం.
జీర్ణక్రియ సమస్యలు తరచుగా వస్తూవుంటే....మీ జాతకంలోని బలహీన గ్రహాలను బలం చేసేటందుకు ప్రయత్నించాలి. మీ జీవన నాణ్యతను మెరుగుపరచుకుంటూ వేగంగా జీర్ణం కలిగించుకోవాలి కనుక మీ బలహీన గ్రహాలేవో తెలుసుకోండి. బలహీన గ్రహాలను ఎలా బలపరచాలి?
వైద్య సలహాలకు జ్యోతిషం, గ్రహాలు ప్రత్యామ్నాయాలు కావు, కాని, అది మీకు ఆరోగ్య అంశాలలో ఎన్నో వివరాలను అది అందిస్తుంది. జ్యోతిషం ముందస్తుగా మీ వ్యాధుల అవకాశాలను తెలుపటమే కాదు వాటిని నివారించుకోడానికి అవసరమైన చర్యలను కూడా తెలుపుతుంది.

ఆహారంలో avoid చేయాల్సినవి.....

విలైనంత వరకు గుర్తుంచుకొని ఇవన్నీ ఆహారములో నిషేదిన్చాల్సినవట ....
1. తేనే (honey) మరియు నెయ్యి (gee) కలిపి తినకూడదు. ఆ రెండిటి కలయిక విషపూరితం అయినది. Don't mix honey and ghee it is poisonous.
2. పెరుగు (curd) లేక చల్ల ను (butter milk) అరటి పండు తో కలిపి తినకూడదు. Done eat banana with curd or buttermilk.
3. అన్నాన్ని (rice) పండ్లతో (fruits) కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని minerals తగ్గిపోతాయి. Don't eat fruits with rice u loose minerals.
4. కూరగాయలతో (vegetables) కలిపి వెన్నె (cheese) కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. Don't eat cheese with vegetables. If so it is dangerous.
5. చేపల కూర (fish curry) తిన్నవెంటనే పాలు (milk) కానీ, పెరుగు (curd) కానీ తినకూడదు. అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. Don't drink milk or curd after fish curry if so u will get leporsy.
6. లావుగా ఉన్నవారు బియ్యం (rice) తో వండివి కాకుండా గోధుములతో (wheat) ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది..
Fat people instead of rice they should have wheat products.
7. ఆస్తమా (asthma) రోగులు టమోటా (tomato), గుమ్మడికాయ (pumpkin), ముల్లంగి (radish) వారు తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదుasthma people shouldn't suppose to eat tomato, radish , pumpkin and their hair should not be wet.
8. మొలలు (piles) ఉన్నవారు గుడ్లు (eggs), మాంసం (meat) తినకూడదు. Piles people - don't eat eggs, meat.
9. నెయ్యిని రాగి (copper) పాత్రలో ఉంచి తినకూడదు. Don't use ghee if it is in copper vessel.
10. పొద్దునే bed coffee తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు . Early in the morning bed coffee is not good instead drink water.
11. అల్సర్ (ulcer) వ్యాదితో భాద పడుతున్నవారు కారాన్ని తినకూడదు. Ulcer people don't eat spicy food.
13. చర్మ వ్యాధులు (skin diseases) ఉన్నవారు పొట్ల కాయ (snake guard), పల్లీలు (pea nuts), ఎండు చేపలు (dry fish), చిక్కుడు కాయలు (Broad beans) తినకూడదు. Skin diseases people- don't eat snake guard, pea nuts, dry fish, broad beans.
14. నువ్వుల నునేతో (sesame oil) తో గోధుమ wheat కి చెందినవి చెయ్యకూడదు. Don't use Wheat and sea same oil together.
15. మోకాళ్ళ నొప్పులతో (arthritis) ఉన్నవారు మాంసం (meat), గుడ్లు( eggs) తో చేసిన వంటలు తినకూడదు. Arthritis people don't eat meat and eggs.
వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి.. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహా భాగ్యం కదా!! Pls Remember the above points and take necessary steps. Health is wealth....
(Ayurveda)

అరిటాకులో భోజనం

- అరిటాకులో భోజనం అనాదిగా వస్తున్న ఆచారం..గౌరవానికి ప్రతీక.
- అరటి ఆకులోని ఔషధ విలువలు… రోగనిరోధక శక్తిని పెంచుతాయి
- వేడి పదార్థాలు వడ్డించగానే…ఆకు మీది పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీనివల్ల అద్భుతమైన రుచితో పాటు, జీర్ణశక్తి కూడా వృద్ధి అవుతుంది.
- అరిటాకు… ఎన్నో విటమిన్లు, పోషకాల నిలయం
- ఎన్నో జబ్బుల్ని హరించే శక్తి అరిటాకులో ఉంది.
- వివిధ కాన్సర్లు (మెదడు, ప్రొస్టేట్, సర్వైకల్, బ్లాడర్)లతో పాటు Hiv, సిక్కా, పార్కిన్సన్ వ్యాధులపై అరిటాకులోని ఔషధ విలువలు ప్రభావం చూపుతాయి.
- అంతేనా… వాడిపారేసిన ఆకులు మట్టిలో సులభంగా కలిసిపోయి, పర్యావరణానికి మేలు చేస్తాయి.
- కొసమెరుపేంటంటే… అరిటాకులో విషపూరితమైన ఆహారాన్ని వడ్డిస్తే... ఆకు వెంటనే నల్లగా మాడిపోతుంది. కాబట్టి శతృవు భోజనానికి పిలిచినా.... వడ్డించేది అరిటాకులో అయితే... నిర్భయంగా, ప్రశాంతంగా భోజనం చేయొచ్చు.
- అరిటాకులో భోంచేయండి… జీవితాన్ని అమృతమయం చేసుకోండి.

గురక తగ్గే మార్గం

ప్రశాంతమైన నిద్ర ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుంది. అంతటి విలువైన నిద్రకు భంగం కలిగించే గురక గురించి తెలుసుకోండి...
గురకకు కారణాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఊపిరితిత్తులలోకి గాలి తీసుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి. ఈ కారణం చేత ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా గురక సమస్య కనబడుతుంది. ఇరుకుగా ఉంటే నోటి ద్వారం, ముక్కుల్లో పెరిగే కొవ్వు కండలు మొదలైన సమస్యలు గురక రావడానికి వంశపార్య కారణాలుగా చెప్పవచ్చు. తరచుగా తుమ్ములు, దగ్గు, జలుబుతో బాధపడే వారిలో ముక్కు రంధ్రాలు శ్లేష్మంతో మూసుకొనిపోయి గాలి పీల్చుకోలేని స్థితిలో గురక మొదలై బాధిస్తుంది. మద్యపానం, పొగతాగడం కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కండరాలు బిగువు కోల్పోయి గురక ఎక్కువ అవుతుంది. చాలా మందిలో స్థూలకాయం కూడా గురకకి ప్రధానమైన కారణంగా మారి ఇబ్బంది పెడుతుంది.
గురకని గుర్తించే కొన్ని మార్గాలు
నోరు మూసుకొని గురకపెడితే మీ నాలుకలోనే సమస్య ఉందని అర్థం.
నోరు తెరచి గురకపెడితే మీ గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి.
వెల్లకిలా పడుకొని గురకపెడితే ప్రధాన సమస్యగా పరిగణించాలి.
ఏ రకంగా నిద్రపోయినా గురక వస్తుంటే దాన్ని తీవ్ర సమస్యగా గుర్తించాలి.
విముక్తికి గృహ వైద్యం..
గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంటు ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి.
కొద్దిగా పిప్పర్‌మెంటు ఆయిల్‌ను చేతి వేళ్లకు రాసుకొని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది.
అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది.
మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు 10 నిమిషాల పాటు ముక్కు ద్వారా ఆవిరి పీల్చాలి.
ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడి చేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో పోసి పీల్చుతుంటే తగ్గుతుంది.
అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది.
2 టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది.