Wednesday, October 23, 2013

మీ కోసం కొన్ని చిట్కాలు

దోసకాయ ముక్కల్లో కొద్దిగా పెరుగు కలిపి రుబ్బాలి. గుజ్జు నుంచి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మేనిరంగు తాజాగా మారుతుంది.

ఒక క్యారెట్‌.. ఒక ఆలూ, ఒక ముల్లంగి ఇలా మిగిలిపోతుంటాయి. వీటినేం చెయ్యాలో తెలియక అలాగే ఎండబెట్టేస్తుంటాం. అలాంటప్పుడు అన్నిటినీ పప్పుతో పాటు కలిపి కిచిడి చేయవచ్చు.

బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే, డబ్బాలో ఎండు వేపాకులు కానీ, ఎండు మిరపకాయలు కానీ వేయాలి.

చర్మం టోనింగ్‌కి ఆరంజ్‌ జ్యూస్‌లోని విటమిన్‌ సి అద్భుతమైన టోనర్‌గా పనిచేస్తుంది. దీనిని ముఖంపై మర్దనా చేసినపుడు సబ్బుతో పోని అదనపు మలినాన్ని, మచ్చలను తలొగించవచ్చు. టోనర్‌ తయారీకి సగం ఆరంజ్‌, సంగం టీస్పూన్‌ నిమ్మరసం, ఒక క్వార్టర్‌ కప్పు నీటిని బ్లెండ్‌ చేయండి. ఈ మిశ్రమం మృదువుగా అయ్యే వరకు బ్లెండ్‌ చేయండి. దూదిని దానిలో ముంచి ముఖంపై అప్లై చేయండి.

చర్మం సంరక్షణలో ఇది ఒక మంచి మూలిక. మొటిమలను నివారంచడంలో లావెండర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చర్మ ఛాయను బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టి, లావెండర్‌ హెర్బ్‌ను నూరి పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.

గ్రీన్‌ కలర్‌లో ఉన్న ఈ అవొకాడో పండును మెత్తగా పేస్ట్‌ చేసి కొద్దిగా పాలు చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించడం ద్వారా మంచి కలర్‌ పొందవచ్చు. ఈ ప్యాక్‌ను వారంలో రెండుసార్లు వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరికాయలో కొబ్బరి తీశాం.. ఇక దీంతో పనేంటి..? పారేస్తే పోలా..? అనుకుంటున్నారా?... ఆగండి.. మీలోని సృజనాత్మకతకు పదునెడితే... ఆ కొబ్బరి చిప్ప అందరినీ ఆకట్టుకునే అందాలు, ఆకృతులతో వెలిగిపోతుంది. ఇదిగో... ఇక్కడున్నవి అలాంటివే.... మరి!

గుడ్డలోని తెల్లసొనలో చెంచా బాదం నూనె కలిపి ముఖం, మెడకు బాగా మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటినీళ్ళతో కడిగేసుకుంటే పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది

 ''పరిగెత్తే ముందు నడవడం నేర్చు కోండి'' అనేది ఈ మాటకు ఉన్న సాధారణ అర్థం. ఏదైనా ఒక పనిని తెలిసీ తెలియ కుండా చేయకూడదని, ఒక పనిలోని లోతుపాతులు లేదా ప్రాథమిక సూత్రా లు తెలుసుకున్నాకే అందులో ముందు కు సాగాలని ఈ సామెత అర్థం.  ఉదా: ఒక వ్యాపారాన్నో లేదా రిపేరు వర్కునో చేయడానికి పూను కున్నప్పుడు ముందుగా దానిని 'ఎలా' చేయాలో మనకు తప్పక తెలిసి ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

జ్వరం తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకుల పసరు రెండు చెంచాల తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని వేడి పదార్థాలకు బదులు చలవ పదార్థాలు తింటే మంచిది.

మృదువైన, శుభ్రమైన, మచ్చలు లేని ముఖవర్చస్సు కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చిన్న టీస్పూన్‌ పసుపు (టర్మరిక్‌)తో మూడు చెంచాల పెరుగు కలపండి. గట్టిగా మృదువైన పేస్ట్‌ వచ్చేవరకు కలపండి. ముఖం మొత్తం సమానంగా పూయండి. ఇరవై నిముషాలు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి. మృదువైన, శుభ్రమైన, మచ్చలు లేని ముఖవర్చస్సు కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చిన్న టీస్పూన్‌ పసుపు (టర్మరిక్‌)తో మూడు చెంచాల పెరుగు కలపండి. గట్టిగా మృదువైన పేస్ట్‌ వచ్చేవరకు కలపండి. ముఖం మొత్తం సమానంగా పూయండి. ఇరవై నిముషాలు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి.

రెండు నిండు చెంచాల తాజా తేనెను ఒక చెంచా ఆలివ్‌ నూనెతో కలిపి మృదువైన పేస్ట్‌ తయారు చేయండి. దానిని మీ జుట్టుపై మర్దన చేసి, జుట్టు కుదుళ్లతో ప్రారంభించి, జుట్టు చివర్ల వరకు చేయండి. తరువాత, ఈ మిశ్రమం మీ తలకు పట్టేటట్లు, షవర్‌ క్యాప్‌తో మీ జుట్టును చుట్టి ఉంచండి. 20 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని తొలగించడానికి సున్నితమైన హెర్చల్‌ షాంపూను వాడండి.

బఠాణీలను ఉడికించేటప్పుడు చిటికెడు తినేసొడా వేస్తే త్వరగా ఉడుకుతాయి. రంగు కూడా ఆకర్షణీయంగా మారుతుంది.

జున్ను పైన నీరు పారబోయకుండా పిండిలో కలుపుకోవచ్చు. కూరల్లోనూ వేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది.

కాకరకాయ కూరలో పోపు గింజలు, బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది

చలికాలంలో కానీ, ఫ్రిజ్‌లోంచి అప్పుడే తీసిన పచ్చికొబ్బరి చిప్పను తురిమి మిక్సీలో రుబ్బేటప్పుడు కానీ, కొంచెం గోరు వెచ్చని నీరు అందులో కలపడం వలన కొబ్బరికి అవసరమైనంత వేడి అందడమే కాదు త్వరగా రుబ్బడానికి కూడా కుదురుతుంది. పైన ఫ్యాట్‌ పేరుకుపోకుండా కూడా ఉంటుంది.

వంట చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఆ జాగ్రత్తలలో భాగంగా, వెల్లుల్లిని, యాలకులను డైరక్ట్‌గా నూనెలో వేయడం వలన అవి పగిలి నూనె మీదకి చిందే అవకాశం ఉంది. పొట్టు తీసి వేసుకుంటే మంచిది. లేక, అలా పొట్టుతోనే వేయాలనుకుంటే, కొద్దిగా నలగ్గొట్టి వేస్తే నూనె చిందే ప్రమాదం ఉండదు.

కొత్తిమీర ఆకుల రసం పెదాలపై రాసి, మర్దన చేస్తే అవి గులాబీ రంగుతో, మృదువుగా ఉంటాయి.

టమాటాలను ఏడెనిమిది నిమిషాలపాటు వేడినీళ్లలో ఉంచి తీస్తే తొక్క సులభంగా వస్తుంది.

No comments:

Post a Comment