Tuesday, August 14, 2012

ఆరోగ్యానికి చిట్కాలు


  • 10-15 తులసి ఆకులు తీసుకొని దానికి నాలుగు వెల్లుల్లి పాయలు, ఒక టీస్పూను శొంఠి పొడిని జతచేసి మెత్తగా నూరి ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి.
  • అర టీ స్పూను శొంఠి పొడిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి ఒక టీ స్పూను తేనెలో రంగరించి తింటే దగ్గు నుంచి ఉపసమనం లభిస్తుంది.
  • అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
  • అర కప్పు నీటిని మరిగించి ఒక టీస్పూను అల్లం రసం కలిపి వేడిగా తాగాలి. రెండు గంటలకొకసారి తాగుతుంటే అతిసారం పూర్తిగా తగ్గుతుంది.
  • అర టీస్పూను నిమ్మరసం, అర టీ స్పూను అల్లం రసం, పావు టీ స్పూను మిరియాల పొడి కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.
  • ఆర్ధరైటిస్, గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ల సమస్యలను దూరం చేస్తుంది. సోయాబీన్ కొవ్వుకణాల సైజును తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తింటే స్ధూలకాయం రాకుండా శరీరాన్ని అదుపులో ఉంచుతుంది.
  • అరటిపండును చిన్నముక్కలు చేసి చిలికిన పెరుగులో కలిపి రోజుకు రెండు, మూడు సార్లు తింటే డయేరియా అదుపులోనికి వస్తుంది.
  • అజీర్తితో బాధపడుతున్నప్పుడు జీలకర్రను పొడి చేసి చిటికెడు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
  • అనీమియాతో బాధపడుతుంటే ఆహారంలో వీలయినంత ఎక్కువగా మెంతి ఆకు తీసుకోవాలి.
  • అరలీటరు నీటిలో పదిగ్రాముల నల్లతులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని తాగుతూ ఉండాలి.
  • అరకప్పు నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకొని తాగితే దగ్గునుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకి రెండు మూడు సార్లు తాగితే ఫలితం ఉంటుంది.
  • అల్లం ముక్కను నిప్పుల మీద కాల్చి తింటే వికారం తగ్గుతుంది.
  • అయిదారు లవంగాలు, ఒక హరతి కర్పూరాన్ని కాటన్‌ క్లాత్‌లో కట్టి పంటినొప్పి ఉన్నచోట పెట్టి పళ్లతో గట్టిగా నొక్కి పట్టాలి. కాసేపటికి పంటినొప్పి తగ్గిపోతుంది.
  • ఆస్త్మాతో బాధపడుతుంటే ఉప్పునీటి పాత్రను దగ్గర ఉంచుకొని పీలుస్తుంటే ఆ లక్షణాలు దూరమవుతాయి. ముక్కు పట్టేసినట్లుండటం కూడా తగ్గుతుంది. సైనస్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవాళ్ళు మామూలు ఉప్పుకు బదులుగా బేకింగ్‌ సోడా కలుపుకోవాలి.
  • ఆస్త్మాతో బాధపడేవాళ్లు వెల్లుల్లి రేకలు వేసి మరిగించిన పాలు తాగుతుంటే వ్యాధి బాధించదు. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ఒక గ్లాసు పాలలో మరిగేటప్పుడే మూడు లేదా నాలుగు వెల్లుల్లి రేకలను వేసుకుని తాగాలి.
  • ఆరోగ్యంగా ఉండాలంటే తినటం, తాగటంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. శ్వాస తీసుకోవడంలో కూడా ఒక క్రమ పద్దతి పాటించాలంటారు నిపుణులు. దీర్ఘంగా ఉంటే ఊపిరితిత్తుల నిండుగా శ్వాసించాలి.
  • ఇంగువ జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలకు మందుగా పని చేస్తుంది. బోజనానంతరం ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది. దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
  • ఇన్సులిన్ పని తీరును మెరుగుపరచటంలో వేప, నేరేడు, మెంతులు, కాకర బాగా పని చేస్తాయి. కాబట్టి వీటిని ఆయా కాలాలను బట్టి ఏ రకం అందుబాటులో ఉంటే వాటిని వాడాలి. తాజాగా సేకరించటం సాధ్యంకానట్లయితే ఇవన్నీ విడివిడిగా పౌడర్లు దొరుకుతాయి. వాటిని రోజూ ఉదయం ఒక టీ స్పూను, రాత్రి ఒక టీ స్పూను చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి.
  • ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను అదుపు చేస్తాయి. వాటిని చేరకుండా నిరోధిస్తాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని , చర్మం మీద ముడతలు వంటి వార్ధక్య లక్షణాలను నివారిస్తుంది.
  • ఉల్లిపాయల్ని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందుతాం.
  • ఉసిరిక పొడి, శొంఠి, పిప్పిలి, మిరియాల చూర్ణం నెయ్యి బెల్లంలో కలిపి రోజు తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
  • ఉసిరి కాయ రసం, నిమ్మరసం, చెక్కెర కలిపి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి.
  • ఎసిడిటీతో కాని అజీర్తితో కాని బాధపడుతుంటే ఒక గ్లాసు నిమ్మరసంలో ఒక టీ స్పూను అల్లంరసం కలిపి తాగాలి.
  • ఎగ్జిమా వంటి చర్మవ్యాధులుంటే తేనె, దాల్చిన చెక్కపొడి సమపాళ్లలో తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే తగ్గుతుంది.
  • ఎండ పెరిగేకొద్దీ శరీరానికి నీటి అవసరం పెరుగుతుంది. ఎండతాపానికి తాళలేక దాహం తీరడానికి కూల్‌డ్రింక్‌ల వంటి వాటికి దాసోహమవుతుంటాం. కాని వాటి బదులుగా తాజా పండ్లరసాలు, నిమ్మరసం కలిపిన మజ్జిగ తాగితే ఆరోగ్యం మెరుగై చర్మసౌందర్యం ఇనుమడిస్తుంది.
  • ఐదు లేదా పది మిరియాలను మెత్తగా పొడి చేసి చక్కెర లేదా నేతితో కలిపి తీసుకుంటే మామూలు జలుబు, ముక్కు కారడం, గొంతులో దురద, నోరు అతుక్కుపోయినట్టు అవ్వడం, గొంతునొప్పి, దగ్గు, జ్వరం ల నుండి ఉపశమనం లభిస్తుంది.
  • ఒక చిటికెడు మిరియాల పొడిని మజ్జిగలో వేసుకొని ప్రతి రోజు తాగుతుంటే అరుగుదల క్రమబద్దం అవుతుంది.
  • ఒక టేబుల్‌ స్పూను తేనెలో అర టేబుల్‌ స్పూను అల్లం రసం కలిపి తీసుకుంటే జలుబు వదులుతుంది. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి.
  • ఒక గ్లాసు మజ్జిగలో ఒక టేబుల్‌ స్పూను కొత్తిమీరరసాన్ని కలిపి తాగినా కూడా అజీర్తి తగ్గి జీర్ణక్రియ మెరుగవుతుంది.
  • ఒక లీటరు నీటిని మరిగించి అందులో రెండు టేబుల్‌ స్పున్ల చెక్కెర, చిటికెడు ఉప్పు కలిపి కరిగిన తర్వాత చల్లార్చి వడపోయాలి. ఈ ద్రావణాన్ని తరచుగా తీసుకుంటే సమస్య అదుపులోనికి వస్తుంది. శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకుంటుంది.
  • ఒక టీ స్పూను తేనెలో అంతే మోతాదులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని పరగడుపునే తినాలి. ఎప్పటికప్పుడు అల్లం తరిగి కలుపుకోవచ్చు, లేదా ఒకేసారి తేనె సీసాలో అల్లం ముక్కలువేసి రోజు తినవచ్చు.
  • ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కలిపి భోజనం చేసిన తర్వాత తాగితే ఆరోగ్యానికి మంచిది. డయేరియాను నివారిస్తుంది.
  • కప్పు వేడి నీటిలో చిటికెడు పసుపు వేసి రాత్రి పడుకునేముందు తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
  • కండరాల నొప్పులు, కీళ్ళనొప్పులు ఉన్న ప్రాంతంలో ఒక టేబుల్ స్పూను మిరియాల పొడిని ఆవ నూనె వేసి వేడిచేసి గోరువెచ్చగా చేసి రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • కడుపు ఉబ్బరం కారణంగా కడుపునొప్పి ఉన్నప్పుడు కొంచెం వాముని వేడి చేసి ఒక కప్పు నీటిని జోడించి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు లేదా పంచదారని కలిపి తాగాలి. కాస్త వాముని ఉప్పుతో కలిపి నమిలినా అజీర్తి ఉపశమనంగా పనిచేస్తుంది.
  • కడుపు నొప్పిగా ఉండి, నొప్పి ఎందుకు వస్తుందో అర్ధం కానపుడు కొంచెం జీలకర్రని తీసుకుని వేడి చేయండి. ఇఫ్ఫుడు వాటికి ఒక కప్పు నీటిని చేర్చి నీరు సగం అయ్యే వరకు మరిగించండి. ఈ నీటిలో రెండు మూడు చుక్కలు నెయ్యిని వేసి తాగండి. అది గ్యాస్ వల్ల వచ్చిన కడుపు నొప్పి అయితే తగ్గుతుంది. నొప్పి ఇంకా ఉంటే మాత్రం డాక్టరుని సంప్రదించాలి.


  • కడుపునొప్పిగా ఉన్నప్పుడు ఇంగువని నీటిలో కలిపి బొడ్డుమీద ఉంచాలి.
  • కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు పదిగ్రాముల ఏలకులను పొడినీటిలో కలిపి కాని, నీటీలో నానబెట్టిన ఏలకులను గ్రైండ్‌ చేసి కాని తీసుకోవాలి.
  • కనీసం వారానికి ఒకసారయినా కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే మంచిది(చేదు కోల్పోకుండా జాగ్రత్త తీసుకోవాలి).
  • కనీసం ఏడు-ఎనిమిది వారాలకు ఒక సారైనా ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే అన్‌వాంటెడ్ హెయిర్‌ రాలిపోతుంది. ఈ కాలంలో అయితే నువ్వుల నూనెలో పసుపు కలిపి ఒంటికి పట్టించాలి.
  • కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది.
  • కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని కంటి మీద రాసి చూడండి.
  • కాలిన మచ్చలకు తేనె రాస్తే కాలిన మచ్చలు పోతాయి.
  • కాళ్ళు చేతులు బెణికి నట్లయితే ఉప్పుతో కాపడం పెడితే తగ్గుతుంది.
  • కాస్త చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్‌ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి.
  • కాస్త దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె, కొంచెం మిరియాల పొడి, రెండు చుక్కల నిమ్మరసం ఇవన్నీ కలిపి తీసుకుంటే సాధారణ జలుబు తగ్గుతుంది.
  • కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తెగటం దాదాపుగా అందరికీ జరుగుతుంది. తెగిన వెంటనే గాయానికి పసుపు అద్దితే గాయం త్వరగా మానుతుంది. సెప్టిక్ కాదు.
  • కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు మాయమవుతాయి.
  • కొందరికి కళ్ల చుట్టూ ముడతలు వస్తుంటాయి. బహుశా కళ్ల సమస్య ఉండి కూడా డాక్టరు సూచించిన మేరకు రీడింగ్‌ గ్లాసు వాడకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. డాక్టరు సలహాను అనుసరించి కళ్లను అధిక శ్రమకు గురిచేయకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  • క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది.
  • క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగించి వేస్తుంది.
  • గర్భిణీలకు ఉదయాన్నే కాని, మరికొందరిలో ఏం తిన్నా కూడా వెంటనే వాంతులవడాన్ని చూస్తుంటాం. పరగడుపున ఒక టేబుల్‌ స్పూను తేనెలో అంతే మోతాదు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. తిన్నది కడుపులో ఇముడుతుంది.
  • గాయాలు రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి.
  • గజ్జి, తామర వంటివి బాధిస్తుంటే ఒక టీ స్పూను మిరియాల పొడిలో ఒక టీ స్పూను నెయ్యి కలిపి రోజుకి మూడు సార్లు చొప్పున తీసుకుంటే తగ్గిపోతుంది.
  • గర్భిణికి డయేరియా వస్తే డాక్టరు పర్యవేక్షణలో చికిత్స చేయటం అవసరం. ఎందుకంటే... అప్పటివరకు గర్భిణుల ఆరోగ్యస్ధితిని బట్టి డాక్టర్లు సూచించిన చాలా మందులను వాళ్లు వాడుతుంటారు. కాబట్టి వాటికి అనుగుణంగా తదుపరి చికిత్సను డాక్టర్లే సూచిస్తారు.
  • గ్లాసు వేడినీటిలో టీస్పూన్‌ ఉప్పు, చిటికెడు పసుపు కలిపి రోజుకు మూడుసార్లు గార్గిలింగ్‌ చేస్తూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది.
  • గుండె గదుల్లో అడ్డంకులు ఏర్పడకుండా నిరోధిస్తుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
  • గొంతు బొంగురు పోతే బెల్లం, మిరియాలు కలిపి ఉండచేసి బుగ్గన ఉంచుకుని మెల్లమెల్లగా రసాన్ని మింగితే తగ్గిపోతుంది.

  • చంటి పిల్లలకు జలుబు చేసినప్పుడు ముద్ద కర్పూరం పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి గుండె, గొంతు, వీపు, ముక్కు - వీటి మీద పట్టించి సన్నని వస్త్రం మీద కప్పాలి. దీని వలన లోపల ఉన్న నెమ్ముని చాలా వరకు తీసివేయవచ్చు.
  • చిన్న పిల్లలకు నిమ్మగడ్డి నూనెను చాతిమీద, మెడల మీద రాసి, వెచ్చటి కాపడం పెడితే కఫం కరిగిపోతుంది.
  • చిగుళ్ళ నుండి రక్తం కారుతుంటే ప్రతిరోజూ బ్రష్‌ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీటిలో పటిక కలిపి పుక్కిలించాలి.
  • చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే దానిమ్మపూలను మెత్తగా నూరి పండ్లకు, చిగుళ్లకు రాసి బాగా పట్టేటట్లు రుద్దాలి. ఇలా రోజుకు రెండుసార్లు చొప్పున వారం రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • చిగుళ్లు, పళ్లకు సంబంధించిన అనారోగ్యం ఉంటే నువ్వులనూనెలో లవంగా నూనె కలిపి వేలితో చిగుళ్ల మీద రుద్దాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తుంటే చిగుళ్లు గట్టిపడతాయి.
  • చెవిలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది నూనె వంటివి చెవిలో పోస్తుంటారు. ఎట్టి పరిస్ధితిల్లో నూనె వంటి పదార్ధాలను చెవిలో వేయకూడదు. ఇవి ఇన్‌ఫెక్షన్‌ ను మరింత పెంచే అవకాశం ఉంది.
  • చెవినొప్పితో బాధపడుతుంటే వందగ్రాముల నువ్వుల నూనె లేదా ఆముదంలో రెండుమూడు వెల్లుల్లి రేకులను చిదిమి వేసి వేడిచేయాలి. చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చెవిలో రెండు చుక్కల నూనె వేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే నొప్పి తగ్గుతుంది.
  • చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి రుగ్మతలకు తేనె, పసుపు చక్కటి విరుగుడు. రోజుకు రెండుసార్లు ఒక టీస్పూను తేనెలో చిటికెడు పసుపు కలిపి తీసుకోవాలి. తేనె లేనట్లయితే ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.
  • చారులో మిరియాల పొడి నెయ్యి పోపు పెట్టి... దాంతో భోంచేస్తే కఫం తగ్గుతుంది. ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కోలుకుంటారు.
  • చేమంతి పూలలోని ఔషదగుణాలు అనేక రకాల గర్భకోశ సమస్యలను నివారిస్తాయి. ఒక కప్పు నీటిని మరిగించి రెండు టీస్పూన్ల చేమంతి రెక్కలనువేసి మూతపెట్టి మంట మీదనుండి దించేయాలి. ఐదు నిమిషాల తరవాత వడపోసి తాగాలి. ఈ చేమంతి టీలో రుచికోసం కొంచెం తేనె కాని, చెక్కెర కాని కలుపుకోవచ్చు. నెలసరి మొదలు కావడానికి రెండు లేదా మూడు రోజుల ముందు నుంచి రోజుకో కప్పు తీసుకోవాలి. అలాగే మొదలైన తర్వాత రోజుకు రెండు కప్పులు తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లీడింగ్ సమయంలో కండరాలు పట్టేసినట్లయి నొప్పి రావాటాన్ని నివారించవచ్చు. ఏడాది పొడవునా తాజా చేమంతిపూలు దొరకడం కష్టం కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టి నిల్వచేసుకుని వాడుకోవచ్చు.
  • జలుబుతో బాధపడుతుంటే తేనె కలిపిన నిమ్మరసం తీసుకోవాలి.
  • జలుబుతో బాధపడుతూ ముక్కు పట్టేసినట్టుంటే మరిగే నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకుంటే జలుబు తగ్గుముఖం పట్టడమే కాకుండా యాంటిబయాటిక్‌గా కూడా ఉపయోగపడుతుంది.
  • జలుబు, దగ్గు తగ్గాలంటే టీ స్పూను శొంఠి, టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని ఒక్కో కప్పు చొప్పున రోజుకు మూడు, నాలుగు సార్లు తాగాలి.
  • జలుబు ఎక్కువై గాలి పీల్చుతున్నప్పుడు ఛాతీలో నుండి శబ్దం వస్తున్నట్లయితే ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో రెండు వెల్లుల్లిరేకులను చిదిమి వేసుకొని తాగాలి. ఇలా మూడు రోజులు చేస్తే ఫలితం ఉంటుంది.
  • జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రోజూ ఒక స్పూను త్రిఫలచూర్ణాన్ని తీసుకుంటే తిన్న ఆహారంలోని పోషకాలు వ్యర్ధం కాకుండా ఒంటబట్టేలా చేస్తుంది.
  • తలపోటు రావడానికి ఒక్కోసారి కళ్ళ కండరాలు ఎక్కువ శ్రమకు గురికావడం కూడా కారణం కావచ్చు. టెలివిజన్‌కి కంటికి కనీసం 15 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. పుస్తకం కంటికి రెండు అడుగుల దూరం లో ఉంచి చూడాలి. కంప్యూటర్‌ మానిటర్‌కి, కంటికి వీలైనంత దూరం ఉండాలి. ఇలా చేయడం వల్ల కళ్లకి శ్రమ ఎక్కువుగా ఉండదు. ప్రశంతంగా ఉండి తలనొప్పి రావడం తగ్గుతుంది.
  • తలనొప్పికి, కీటకాలు కుట్టిన చోట గాయం వల్ల కలిగే నొప్పికి ఆముదం రాస్తే త్వరగా ఉపశమనం ఉంటుంది.
  • తరచూ తలనొప్పితో బాధపడేవారికి ఐస్ మంచి మందని వైద్యులు చెపుతున్నారు. ప్లాస్టిక్ కవర్‌లో ఐస్ ముక్కల్ని వేసి దానిని తల, నుదురుల మీద పెట్టుకోవాలి.
  • తాగే నీటిలో సాజీరాను వేసి పది నిముషాల పాటు వేడి చేసి తాగితే పొట్టలో నులి పురుగులు, చెడు శ్వాస సమస్యలు తగ్గుతాయి.
  • డయాబెటిస్ పేషెంట్లు తాగే నీటిలో జామ ఆకులను వేసుకుంటే మంచిది. ఒక రోజుకు అవసరమైనన్ని నీటిలో పది జామఆకులను వేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నుంచి ఆ నీటిని తాగాలి.
  • డయేరియా లక్షణాలు పూర్తిగా తగ్గేవరకు గంటకు కనీసం పావులీటరుకు తగ్గకుండా ద్రవాలను తీసుకోవాలి.
  • డయేరియా అదుపులోకి వచ్చిన మర్నాటి నుంచి మామూలుగా ఆహారం తీసుకోవచ్చు. అయితే మసాలాలు, నూనెలతో వండిన వాటిని పూర్తిగా మినహాయించాలి.
  • డయేరియా వచ్చినప్పుడు పాలు, పాల ఉత్పత్తులు తీసుకోకపోవడమే మంచిది. ఇవి త్వరగా జీర్ణం కావు.
  • తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం లేదా గ్యాస్‌ వల్ల కడుపు ఉబ్బరంగా ఉండడంలాంటి ఉదరసంబంధ సమస్యలకు పావు టీస్పూను మిరియాలపొడిని మజ్జిగలో వేసుకొని తాగి చూడండి.
  • తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున వేసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
  • తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది.
  • తులసి ఆకులను నమిలితే జీర్ణశక్తి మెరుగవుతుంది. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే వాంతులు ఆగుతాయి.
  • తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
  • తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
  • తులసి ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. దీని ముదురు ఆకులను పొడి చేసి అందుబాటులో ఉంచుకోవాలి. ఆకుల రసం కూడా శ్రేష్టమైనదే.

  • తులసి కషాయాన్ని తాగితే కాలేయానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. ఆకలి మందగించిన వారు తులసి ఆకుల రసం తీసి దానితో తమలపాకు రసమును, పంచదారతో చేర్చి కొద్ది మోతాదులో ప్రతినిత్యం సేవించిన జీర్ణక్రియ సరిగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.
  • తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.
  • తులసి రసమును తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
  • తులసి రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి శ్లేష్మ, కఫ, వాతములను హరిస్తుంది.
  • తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
  • తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది.
  • తేనెతో కలిపి నిమ్మకాయ రసం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
  • దగ్గునుంచి ఉపశమనానికి తులసి ఆకులను తేనెతో కలిపి పరగడుపున తీసుకోవాలి. వెన్నునొప్పితో బాధపడుతుంటే అల్లం పేస్టుతో మర్ధన చేస్తే తగ్గుతుంది.
  • దగ్గు నుంచి తక్షణ ఉపశమనానికి పరగడుపున నాలుగైదు తులసి ఆకులను అర టీ స్పూను తేనెతో కలిపి తీసుకోవాలి.
  • దగ్గు ఎక్కువై దగ్గినప్పుడు చాతీనొప్పి వస్తుంటుంది. ఇది తగ్గాలంటే మూడు కప్పుల నీళ్ళలో రెండు తమలపాకులు నాలుగు మిరియాలు వేసి సగం అయ్యే వరకు నీటిని కాచాలి. ఈ నీటిని ప్రతీరోజు ఉదయం ఒక టీ స్పూన్‌ తేనెతో కలుపుకొని తాగాలి.
  • దగ్గు, ఛాతినొప్పితో బాధపడుతున్నప్పుడు... ప్రతిరోజు ఉదయం మూడు కప్పుల నీటిలో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి సగం అయ్యే వరకు నీటిని మరిగించి అందులో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.
  • దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గొంతు గరగర తగ్గాలంటే లవంగాన్ని చప్పరించాలి.
  • దానిమ్మ తొక్కలను పొడిచేసి, ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ పొడి కలిపి తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుంది.
  • దానిమ్మ గింజలను మెత్తగా పేస్టు చేసి ఉలవల సూప్‌తో కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరుగుతాయి. ఒక కప్పు సూప్‌కు రెండు స్పూన్ల ఉలవలు తీసుకోవాలి. దీనిలో కలపడానికి ఒక టేబుల్ స్పూన్ దానిమ్మ గింజలు తీసుకోవాలి. దానిమ్మ తీపి, వగరు ఎలా ఉన్నా అందులోని ఔషధ గుణాలు మారవు. కాబట్టి దేనినైనా వాడవచ్చు.
  • దాల్చిన చెక్కని వేసి కాచిన నీటిని తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
  • దేహంలో కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత రాకుండా నియంత్రిస్తుంది.
  • దోమకాటు వల్ల ఏర్పడిన దద్దుర్లు పోవాలంటే వాటి మీద ఉల్లిపాయ ముక్కతో రుద్దాలి.

  • ధనియాలను నీళ్ళలో నానవేసి ఆ నీటిని తరచుగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
  • నందివర్ధనం పూలను కాని రేకులను కాని కళ్ల మీద పెట్టుకుంటే అలసిన కళ్లకు సాంత్వన కలుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌తో పనిచేసే వాళ్లకూ, ఎండకు వెళ్లే వాళ్లకూ ఇది చక్కటి చికిత్స. ఈ కాలంలో ఎండ సమయంలో బయటకు వెళ్లే వాళ్లు తరచుగా ఎదుర్కొనే సమస్య కళ్లు స్టకీగా మారటం, అంటే కళ్లు మూసుకుని తెరిచినప్పుడు రెప్పలు తేలిగ్గా విచ్చుకోకుండా, ఏదో అడ్డుపడుతున్నట్లు, అతుక్కున్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు కూడా నందివర్ధనం పూలు బాగా పని చేస్తాయి.
  • నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మెదడు వికాసం పొందుతుంది.
  • నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
  • నిద్రలేమితో బాధపడుతుంటే ఒక గ్లాసు వేడిపాలలో మూడు టీస్పూన్ల తేనె కలిపి తాగాలి.
  • నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాలసేపు పాదాలను, అరిపాదాలను నెయ్యి లేదా ఆముదంతో మర్ధన చేయాలి.
  • నిద్రలేమి శరీరంలో హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది. హార్మోన్ల స్ధాయుల్లో హెచ్చుతగ్గులతో పాటు మెటబాలిజమ్‌ వేగం తగ్గుతుంది. మంచి నిద్ర కణాల పుననిర్మాణాన్ని, బాడీ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.
  • నిమ్మరసంలో జీలకర్ర నానేసి వరుసగా ఏడు రోజులపాటు, రోజూ ఉదయం కొంచెం తింటుంటే పైత్యం తగ్గుతుంది.
  • నీటిలో మెంతులు వేసి చేసిన టీ తాగితే కడుపులో మంట తగ్గుతుంది.
  • నీళ్ళలో తులసి ఆకులు వేసి రాత్రంతా అలా ఉంచి ఉదయాన్నే పరగడుపున తాగితే జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు సమసిపోతాయి.
  • నువ్వుల నూనె లేదా ఆముదంలో వెల్లుల్లి రేకలు వేసి ఐదు నిమిషాల సేపు సన్నని మంటమీద మరిగించాలి. ఈ నూనెతో వెన్నుకు మర్దనా చేయాలి. వీటికి బదులుగా ఏదైనా వంటనూనెను కూడా వాడవచ్చు.
  • నులిపురుగుల సమస్య నుంచి విముక్తి పొందాలంటే టీస్పూను వాము, టీ స్పూను ఆముదం కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి.
  • నోటిపూత బాధిస్తుంటే మాచికాయను నూరి నీటిలో కలిపి ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తుంటే రెండు రోజులకు పూత పూర్తిగా తగ్గుతుంది.
  • నోటికి సంబందించిన అనేక సమస్యలకు వేప మంచి ఔషదం. ఒక గ్లాసు నీటిలో టీస్పును వేపనూనె కలిపి ఆ నీటితో నోటిని బాగా పుక్కిలించినట్లయితే చిగుళ్ల నుండి రక్తం కారడం, మౌత్‌ అల్సర్‌, చిగుళ్ల నొప్పులు వంటివి పూర్తిగా నయమవుతాయి. రోజూ ఉదయాన్నే పది తాజా వేపాకులను నములుతుంటే నోటికి సంబందించిన సమస్యలు రావు.
  • డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేయడానికి సోయాబీన్‌ బాగా పని చేస్తుంది. పోషకాలు మెండుగా ఉండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంగా సోయాబీన్‌ను ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషనిష్టులు గుర్తించారు.
  • డయేరియాతో బాధపడుతున్నప్పుడు పది నిమిషాలకొకసారి (కొద్దిమోతాదులోనైనాసరే) నీటిని కాని, రీహైడ్రేషన్‌ డ్రింకులనుకాని తీసుకోవాలి. కొద్దిమోతాదులో ఏదో ఒకరకమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. బిస్కెట్‌, బ్రెడ్‌ లేదా పండ్ల వంటి తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని తింటుండాలి.
  • డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్లరసం, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింక్‌లు మాత్రం తీసుకోకూడదు.
  • పచ్చి కాయ కూరలు, పళ్ళు చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అవసరం.
  • పంటినొప్పి వచ్చినప్పుడు నొప్పి ఉన్నచోట లవంగ నూనె రాయాలి. దాంతో నొప్పి చాలావరకు ఉపశమిస్తుంది.
  • పది బాదాములను నానబెట్టాలి. పైన పొట్టు తీసి వీటికి పది మిరియాలను చేర్చి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కప్పు వేడి నీటిలో కలపాలి. రుచికోసం కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. రోజుకు రెండు మూడు సార్లు ఈ ద్రవాన్ని తాగుతూ ఉండాలి.
  • పసుపు కొమ్మును కాల్చి దాని పొగ పీల్చాలి. రాత్రి భోజనం తర్వాత ఆరు గ్రాముల వెల్లుల్లి రసం బెల్లంతో కలిపి తినాలి.
  • పసుపులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గాయాలను మాన్పే గుణాన్ని, రుగ్మతలను నివారించే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి పసుపు పైకి కనిపించే గాయాలను మాత్రమే కాకుండా కడుపులో అల్సర్లను కూడా తగ్గిస్తుంది. గ్లాసు నీటిలో చిటికెడు పసుపు వేసి మరిగించి తాగితే మంచిది.
  • పలుచగా తయారుచేసిన చింతపండు రసంలో చిటికెడు ఉప్పు వేసి మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
  • పళ్ళు పసుపుగా గారపట్టినట్లు ఉంటే బ్రష్‌ చేయటం పూర్తయ్యాక ఉప్పునీటితో పుక్కిలించాలి
  • పళ్ళు స్వచ్ఛంగాను, పటిష్టంగాను ఉండాలంటే ఉప్పు పొడిలో నాలుగైదు చుక్కలు ఆవ నూనెను కలిపి ప్రతిరోజూ పేస్టులాగా వాడాలి. నోటి దుర్వాసన పోవటానికి కుడా ఇది ఉపయోగపడుతుంది.
  • పసుపు జీర్ణవ్యస్థలో సమస్యలను తగ్గించగలుగుతుంది. అరుగుదలకు మందుగా పని చేస్తుంది.
  • ప్రతీరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక టీస్పూను తేనె, ఒక టీ స్పూను నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇది జీర్ణకోశాన్ని శుభ్రపరచడంతోపాటు శరీరంలోని మలినాలు తొలగిస్తుంది. దీంతో చర్మం కాంతివంతమవుతుంది. క్రమం తప్పకుండా నెలరోజులు చేస్తే ఫలితం ఉంటుంది.
  • ప్రతి భోజనంలోనూ తప్పనిసరిగా పచ్చి కూరగాయల సలాడ్లు ఉండేలా చూడాలి. ఇవి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి, చర్మం కాంతివంతంగా ఉండటానికి దోహదం చేస్తాయి.
  • పాలల్లో కాస్త పసుపు కలిపి కాచుకొని తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. జలుబుతో ముక్కు కారుతున్నప్పుడు పసుపు కొమ్ముని కాల్చి ఆ వాసనని పీల్చాలి.

  • పిల్లల్లో చెవినొప్పి తరచుగా వస్తున్నట్లయితే అందుకు ప్రధాన కారణం చెవిలోపల శుభ్రం చేయకపోవడమే కావచ్చు. గులిమి గట్టిపడి శుభ్రం చేయడానికి సాధ్యం కాకుంటే వేడినీటిలో ఉప్పు కరిగించి డ్రాపర్‌తో చెవిలో నాలుగు చుక్కలు వేసి అప్పుడు దూదితో శుభ్రం చేయాలి.
  • పులిహొర తింటే కడుపు బరువుగా ఉన్నట్లు ఉంటుంది. ఆ బరువు తగ్గాలంటే ఒక చిట్కా ఉంది పులిహొర తిన్న వెంటనే - గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగేస్తే - తొందరగా జీర్ణం అవుతుంది. వేడి కూడ చేయదు.
  • పిండి పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. బాగా ఉడికిన అన్నం, పప్పు అన్నిటికంటే మంచిది.
  • పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలో ఫ్యాట్‌ ఎక్కువుగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో పుదీనా తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు.
  • పుదీనారసం ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. ఎండకాలం లో రోజుకో గ్లాసు పుదీనారసం తాగితే శరీర ఉష్ణోగ్రత వాతావరణానికి అనుకూలంగా సమన్వయమవుతుంది. ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకు పుదీనా రసాన్ని ఇస్తుంటే వడదెబ్బ తగలదు.
  • పైత్యం, ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా గ్రైండ్‌ చేసి ఆ పేస్ట్‌ను నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి.
  • పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందు, ఒకటి రెండు రెబ్బల వెల్లుల్లిని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగాలి. దీని వల్ల అరుగుదల, పొట్టలో పురుగులు నశించటం, శరీరంలోని విష పదార్ధాలు నశించటం, కొలెస్ట్రాల్ నియంత్రణ, తక్కువ స్థాయిలో ఉన్న విరేచనాలు తగ్గుతాయి.
  • పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే తలనొప్పి సమస్య తొందరగా తలెత్తదు.
  • ప్రతీరోజూ రెండుసార్లు తప్పనిసరిగా బ్రష్‌ చేసుకోవాలి. ఏదైనా తిన్న ప్రతీసారీ ఆహారం తాలుకా అవశేషాలు నోట్లో మిగలకుండా మంచి నీటితో పుక్కిలించాలి.
  • ప్రతీరోజు ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక్కొక్కటి నాలుగైదు చొప్పున తులసి, వేపఆకులను, ఐదారు మిరియాలను వేసి మరిగించి తాగాలి. (హై బిపితో బాధపడుతన్న వాళ్లు మినహాయించాలి).
  • ప్రతీరోజు ఉదయం సాయంత్రం ముప్పావుగంట నడక డయాబెటిస్‌ను అదుపులోకి తెస్తుంది.
  • ప్రతి రోజు అల్లంతో చేసిన టీని తాగుతుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట మొదలైన పొట్టకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
  • ప్రతిరోజు గోధుమ జావ తాగితే బీపీ ఉన్నవారికి మంచిది.
  • ఫేషియల్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల ముడతలను సమర్ధంగా నివారించవచ్చు. హాయిగా నవ్వేవాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగానే కాక అందంగాకూడా కనిపిస్తారు. వార్ధక్యం వీరిదరి చేరదా? అనిపించేలా ఉంటారు. నవ్వడం వల్ల ముఖములోని కండరాలకు ఎక్సర్‌సైజ్‌ అంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం పటుత్వంతో ఉంటుంది. కాబట్టి ముడతలు పడవు.
  • పెరిగే పిల్లలకు సోయాబీన్ మంచి పోషణని ఇస్తుంది. దేహదారుఢ్యానికి, పెరుగుదలకు దోహదం చేస్తుంది. శరీరం పెరుగుదలతో పాటు మెదడును వికసింపచేస్తుంది.
  • బరువు తగ్గాలనుకునేవాళ్లు అనుకున్నదే తడవుగా ఆహారనియమాలు, వ్యాయామాలు మొదలు పెట్టటం జరుగుతుంది. సాధారణంగా ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఎన్ని కిలోలు ఉన్నారు? అంటే ఎంత బరువు తగ్గితే సరిపోతుంది? ఎంత సమయం తీసుకోవాలి అన్న విషయంపై స్పష్టత వచ్చాక నియమాలను పాటించటం మొదలు పెట్టాలి. ఇందుకోసం అవసరమైతే నిపుణుల సలహ తీసుకోవటం మంచిది.
  • బరువు తగ్గాలనుకున్న వాళ్లు రోజువారీ ఆహారంలో కనీసం ఐదుసార్లు పచ్చికూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ సమృద్ధిగానూ కేలరీలు తక్కువుగా వుంటాయి.
  • భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు సార్లు తినాలి.
  • బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్దియగును.
  • బాగా నమిలి తినాల్సిన ఆహారాన్ని తీసుకునే వారిలో కూడా చర్మం త్వరగా ముడతలు పడకపోవడాన్ని చూస్తుంటాం. ఎక్కువ సేపు నమలడం ద్వారా ముఖంలోని కండరాలు శ్రమిస్తాయి. చర్మపు మెటబాలిజమ్‌ మెరుగవుతుంది. కాబట్టి ముడతలు పడవు.
  • బెల్లం లో మిరియాల పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది.
  • బొప్పాకాయను కానీ, ఆకుని కానీ మెత్తగా కాటుకలా నూరి ఆ ముద్దని అరికాళ్ళ ఆనెల మీద పెట్టి, కట్టుకడితే అవి మెత్తబడతాయి.
  • మజ్జిగలో కాస్త అల్లం పొడిని, ఉప్పుని కలిపి తీసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.
  • మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.
  • మల్బరీ ఆకుని వేడిచేసి వాసన పీలిస్తే దగ్గు తగ్గుతుంది.
  • మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వులనూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటిమీద మర్ధన చేయాలి. రాత్రిపూట మర్ధన చేసి, ఉదయాన్నే తలస్నానం చేయాలి.
  • మామిడి గింజల పొడిని నీటిలో కలిపి తాగితే డయేరియా తగ్గుతుంది.
  • మిరియాలతో దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే మందుని తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానె తాగండి. దీనిని సేవించడం వల్ల పైన చెప్పిన చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • మూడు టీ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, రెండు టీ స్పూన్ల యూకలిప్టస్‌ ఆయిల్‌ను షాంపూలో కలుపుకొని తలస్నానం చేస్తే పేలు పోతాయి.
  • మొటిమలు కాని ఒంటిమీద మరెక్కడైనా ఇన్‌ఫెక్షన్ కాని ఉన్నట్లయితే ఒక గుప్పెడు లేత వేపాకులలో చిటికెడు పసుపు కలిపి గ్రైండ్ చేసి సమస్య ఉన్నచోట రాయాలి. కనీసం వారానికి ఒకసారయినా ఇదే మిశ్రమాన్ని ఐదు గ్రాముల చొప్పున కడుపులోకి తీసుకుంటే జీర్ణవ్యవస్ధలో ఇన్‌ఫెక్షన్‌ను అరికడుతుంది.
  • మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్‌తో మర్థనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పులు, మామూలు నొప్పులు, గాయాలనుండి రసికారడాన్ని అరికట్టడంలో ఎంతో ప్రతిభావంతంగా పని చేస్తుంది.

  • యాలుకలు వేసిన టీ సువాసన భరితంగా రుచిగా ఉంటుంది. నోటి దుర్వాసనని తగ్గిస్తాయి.
  • ఉన్నట్లుండి ముక్కు నుండి రక్తం కారడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని చిట్కాలు పాటించి రక్తం కారడాన్ని ఆపవచ్చు. రక్తం కారుతున్న సమయం లో ముక్కు రంద్రాలను చేతి బొటన వేలు, చూపుడు వేళ్ళతో నాలుగు నిమిషాల పాటు పట్టుకుని ఉంచాలి. రక్తం కారడం మొదలైనప్పుడు వేడినీటిని తాగకూడదు. ఐస్‌క్యూబ్స్ ని ముక్కుదగ్గర పెట్టడం వల్ల రక్తం కారడం తగ్గుతుంది. ఇంకా బ్లీడింగ్‌ అవుతుంటే డాక్టర్‌ని కలవాల్సిందే...
  • రుతుక్రమం సమయంలో కడుపునొప్పి బాధిస్తుంటే కిందపొట్ట మీద, నడుము మీద వేడి కాపడం పెట్టాలి. చిన్నటవల్‌ను వేడినీటిలో ముంచి కాపడం పెట్టవచ్చు. లేదా మార్కెట్‌ లో దొరికే హాట్‌ప్యాక్‌ బ్యాగ్‌ వాడవచ్చు.
  • రోజంతా అలసిపోయినా కూడా కొందరికి సరిగా నిద్రపట్టదు. అలాంటప్పుడు పడుకునే ముందు కొత్తీమీర గ్రైండ్‌ చేసి ఆ రసాన్ని వేడినీటిలో కలిపి తాగినట్లయితే ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా నిద్రపడుతుంది.
  • రోజూ ఒక టేబుల్‌ స్పూను తేనె తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. తేనెలో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది. రక్తవృద్ధి అవుతుంది. చర్మానికి మెరుపు వస్తుంది.
  • రోజుకు కనీసం 6 గ్లాసులు నీళ్ళు త్రాగి మలబద్ధకం రాకుండా చూసుకుని చర్మాన్ని అందంగా ఉంచుకోవచ్చు.
  • రోజుకు ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి తీసుకుంటే క్రమంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది.
  • రోజుకి మూడు, నాలుగు సార్లు తులసి ఆకులను నములుతూ రసాన్ని మింగటం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది.
  • రెండు మూడు లవంగాలను రెండు వెల్లుల్లి రెబ్బలతో కలిపి పేస్టులా చేయాలి. దీనిని కప్పు తేనెలో కలపాలి. రోజుకు మూడు, నాలుగుసార్లు టీ స్పూన్‌ చొప్పున తీసుకుంటూ ఉంటే నొప్పి తగ్గుతుంది.
  • రెండు చిన్న ఉల్లి గడ్డలను చక్రాలుగా కోయాలి. ఉల్లిపాయ ముక్కలను తేనెలో అద్దుకుంటూ ప్రతి పదిహేను, ఇరవై నిమిషాలకొకసారి తింటూ ఉండాలి.
  • లవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది.
  • లవంగాల పొడికి కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూను తేనెని కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
  • లవంగాల్ని మెత్తగా పొడి చేసి అందులో దాసించెక్క ఆయిల్ కలిపి తలపై ఎక్కడయితే నొప్పిగా అనిపిస్తుందో అక్కడ పూయాలి.
  • లావు కావాలనుకున్నవారు మధ్యహ్నం భోజనంలో గంజి వేసుకొని తింటుంటే ఫలితం ఉంటుంది.
  • లావుగా ఉన్నవారు సన్నబడాలంటే ప్రతి నిత్యం లేతములగాకు (ములగచిగుళ్ళు) రసం తాగుతూ ఉండాలి.
  • వయసు పెరిగే కొద్దీ ఆయాసం, నీరసం, బడలిక వంటి సమస్యలు వస్తుంటాయి. అవి తగ్గాలంటే రోజూ ఉదయాన్నే పరగడుపున ఒకసారి, మధ్యాహ్నం మూడు గంటల సమయం లో ఒకసారి ఒక గ్లాసు నీటి లో అర టేబుల్‌ స్పూను తేనె, చిటికెడు దాల్చినచెక్క పొడి కలిపి తీసుకుంటే ఒక వారం రొజుల్లోనే ఫలితం ఉంటుంది.
  • విరేచనాలు అవుతున్నప్పుడు మెంతిపొడిని ఒక అరకప్పు నీటితో కలిపి పొద్దున్నే తాగాలి. ఈ పొడిని మజ్జిగతో కలిపి తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది.
  • వెన్ను నొప్పితో బాధపడుతుంటే అల్లం పేస్టుతో మర్ధన చేస్తే తగ్గుతుంది. లేదా గోరువెచ్చని యూకలిప్టస్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి.
  • వెనిగర్‌, బాడీ ఆయిల్‌ సమపాళ్లలో కలిపి తలకు పట్టించి క్యాప్‌ పెట్టాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. షాంపూ చేయడం పూర్తయ్యాక నీళ్ళు పిండేసి, చివరగా కొద్దిగా వెనిగర్‌ చేతిలోకి తీసుకొని తలకు పట్టించాలి.
  • వేగించిన వాముని ఉండలా చేసి పలుచని గుడ్డలో పెట్టి దానిని తలనొప్పి తీవ్రత తగ్గేదాక ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తుండాలి.
  • వేడి నీటిలో కొద్దిగా తేనె వేసుకొని తాగితే జలుబు భారం తగ్గుతుంది.
  • వేడి వేడిగా ఉన్న ద్రవపదార్ధాలను వీలయినన్ని ఎక్కువసార్లు తాగుతూ ఉండాలి. లెమన్‌ టీ గొంతునొప్పిని నివారిస్తుంది.

  • శరీరం లోని అన్ని ఆర్గాన్ల కంటే కాళ్లు ఎక్కువుగా పనిచేస్తాయి. అలాగే ఎక్కువుగా పట్టించుకోని ఆర్గాన్‌ కూడా అదే. ప్రతిరోజూ కాళ్ళను ఒకసారి పరీక్షించుకోవాలి. పగుళ్ళు, దెబ్బలు లేకుండా చూసుకోవాలి. నేల తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉత్తికాళ్ళతో నేలపై నడవకూడదు. తడిగా ఉండే చెప్పులు వేసుకోకపోవడం వల్ల కాళ్లకి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది.
  • శరీరం నుంచి దుర్గంధం వస్తుంటే స్నానం చేసే నీటిలో ఒక కప్పు టొమాటో రసం కలిపి అరగంట తరువాత స్నానం చేయాలి.
  • శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉండాలంటే ఎక్కువుగా నీరు, అల్లం రసం, చల్లని పానియాలను తీసుకోవాలి.
  • శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చర్మ కాంతి పెరగాలని కోరుకునే వాళ్లు జంక్‌ఫుడ్‌, రోస్టెడ్‌ ఫుడ్‌ను పూర్తిగా మర్చిపోవాలి.
  • శొంఠి, మిరియాలు, వాము, సైంధవలవణం అన్నీ కలిపి మెత్తగా నూరి తేనెతో తీసుకుంటే అతిగా వచ్చే ఆవలింతలు తగ్గుతాయి.
  • శొంఠిని మెత్తగా నూరి ఆ పొడిని నీటిలో కలిపిన తలకు రాసుకోవాలి. ఇలా రాసుకున్నప్పుడు కాస్తంత మంటగా అనిపిస్తుంది. కాని నొప్పి తీసేసినట్టు పోతుంది. శొంఠి పేస్టుని చెవుల వెనుక రాసుకుంటే కూడా మంచిది.
  • సగంకప్పు నీటిలో కొద్దిగా మిరియాల పొడి వేసి చిన్నమంటపై మరిగించాలి. ఈ నీరు గోరువెచ్చగా అయ్యాక కాసిన్ని నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి ఇలా చేస్తే పంటినొప్పి తగ్గుతుంది.
  • స్వీట్స్, చాక్‌లెట్స్, మరీ వేడిగా ఉన్న పదార్ధాలు, అతిశీతల పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పంటి సమస్యలు వస్తాయి. సమతుల ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే శరీర ఆరోగ్యంతో పాటు పళ్లు, చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
  • సోపు కూడా అజీర్తి సమస్యలకు, గ్యాస్‌కి చక్కగా పనిచేస్తుంది. అన్నం తినగానే ఒక టీస్పూను సోపుని తినవచ్చు. లేదా మీరు మంచినీరు కాచి తాగేవారైతే ఆ నీటిలోనే సోపుని వేసుకోవచ్చు.
  • స్నానం చేయించిన పిదప పిల్లలకు చిటికెడు పసుపు మాడున రుద్దటం వలన కూడా కొంతవరకు జలుబు అరికట్టవచ్చును.
  • స్వచ్చమైన తెల్లని గుడ్డ తీసుకొని దానిని వైట్ వెనిగర్‌లో ముంచి తలచుట్టూ చుట్టుకోవాలి. ఇలా తలనొప్పి పోయిందనిపించేంత వరకు కొన్ని నిముషాల వ్యవధితో చేస్తుండాలి.
తేనె వాడకం వల్ల ఉపయోగాలు, ఆరోగ్య సూచనలు
  • అతి మూత్రవ్యాధి ఉన్నవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
  • ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది.
  • ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది.
  • ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు.
  • క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం కలిగి త్వరగా అలసట కలుగదు. ఆటలు ఆడిన తర్వాత తీసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.
  • తేనె పుచ్చుకుంటే కళ్ళకు చలువ చేసి దృష్టి మెరుగుపడేలా చేస్తుంది.
  • తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి.
  • తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలను గర్భిణీలు రోజూ ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు తింటే పుట్టబోయే బిడ్డకు బలవర్ధకం.
  • తేనెలో కొద్దిగా ఆముదం చేరిస్తే మంచి విరేచనకారిగా పనిచేస్తుంది.
  • పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది.

  • ప్రకృతిలో సహజసిద్దంగా లభించే ఆహారపదార్ధాలలో తేనె ఉత్తమమైనది, పుష్టికరమైనది.
  • భోజనానంతరం తీసుకుంటే పైత్యహారిగా పనిచేస్తుంది. శరీరంలోని అధిక వేడిని తొలగిస్తుంది.
  • మనం తీసుకొనే ఆహారపదార్ధాలు, పానీయాలు మొదలైనవి జీర్ణక్రియలో భాగంగా గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌లుగా మారిన తరువాత క్రమంగా జీర్ణం అవుతాయి. కానీ తేనె ఇలా ఏ మార్పులూ లేకుండా సులభంగా జీర్ణం అవుతుంది.
  • రెండు తులాల తేనెలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని రోజూ తాగితే పులితేపులు తగ్గుతాయి.
  • రెండు గ్లాసుల నీటిలో నాలుగు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి తాగాలి. ఇది డయేరియా తగ్గడానికి సులభమైన మార్గం.
  • అజీర్తితో బాధ పడుతుంటే మూడు వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా నూరి పాల లో కలుపుకుని తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది.
  • కొత్తీమీర రసాన్ని మజ్జిగలో కలుపుకొని తాగితే అజీర్తి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది.
  • గ్లాసుడు నీళ్ళలో టీ స్పున్ అల్లరసం, టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి బాధ వెంటనే తగ్గుముకం పడుతుంది.
  • నిద్రలేమితో బాధపడుతున్నవారు కొన్ని కొత్తిమీర ఆకుల్ని మెత్తగా నూరి ఆ రసాన్ని వేడి నీళ్ళ లో కలిపి గోరు వెచ్చగా అయ్యాక తాగితే మంచి ఫలితం వుంటుంది.
  • వెల్లుల్లి రెబ్బలను పాలలో మరగబెట్టి తీసుకుంటే ఆస్తమా నుండి ఉపశమనం లభిస్తుంది.
  • అరటి పండు లో చెక్కెర...సుక్రోజ్ ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపం లో ఉంటాయి. పీచు పదార్ధాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవటానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతీరోజూ అరటిపండు తింటే శక్తితో పాటు జీర్ణవ్యవస్ధ పని తీరు మెరుగవుతుంది.
  • దగ్గు నివారణకు గొంతు మంటకు మందుగా పనిచేస్తుంది.
  • డయేరియా నుంచి విముక్తి లభిస్తుంది.
  • తేనె రక్తాన్ని శుద్ధి చేసి, బ్లడ్‌ సర్క్యులేషన్‌ని క్రమబద్దీకరిస్తుంది.
  • కాలిన గాయాలను త్వరగా తగ్గిస్తుంది. అల్సర్‌ను నివారిస్తుంది.
  • తేనెలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటివల్ల సులభంగా జీర్ణమవుతుంది.
  • ప్రతిరోజూ ఒక టేబుల్‌స్పూన్‌ తేనె నీటిలో కలిపి పరగడుపునే తీసుకుంటే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  • పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి క్రమం తప్పకుండా తేనె ఏదో ఒక రకంగా ఇవ్వాలి.
  • నోటి పూత, నోటిలో గుల్లలు వంటి సమస్యల నివారణకు తేనె వాడొచ్చు.
  • చక్కెరతో పోల్చితే తేనెలో క్యాలరీలు తక్కువ. తేనెలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ.
  • అధిక బరువును తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే స్థూలకాయాన్ని నివారించవచ్చు. కడుపు నొప్పికి ఇది మంచి మందు.
  • ఎనీమియా, ఆస్తమా, బట్టతల, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, బిపి, ఒత్తిడి, పక్షవాతం వంటి అనేక వ్యాధులను దూరంగా ఉంచుతుంది.

No comments:

Post a Comment