Tuesday, August 14, 2012

చుండ్రు నివారాణ చిట్కాలు

ఏ కాలంలో అయినా ఎల్లప్పుడూ అందరినీ వేధించే సమస్య తలలో చుండ్రు, వయసుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం. చుండ్రు రావడానికి కారణాలు అనేకం. చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అధిక వత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి వత్తిడికి గురి కావడం సహజం. అలాగే ఎక్కువ సమయం ఎసి గదుల్లో గడపడం వల్ల, ఫోన్ కింద కూర్చున్నా తల మీది చర్మం పొడిగా అయిపోయి పొట్టులా లేస్తుంది. షాపూతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలపోయినా కూడా చుండ్రు వచ్చే అవకాశం వుంది. తలకు రాసుకునే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగడానికి అవకాశం ఎక్కువ. కలుషిత వాతావరణం కూడా చుండ్రును పెంచుతుంది. ఏ వాతావరణంలో నివసించే వారికైనా చుండ్రు వస్తుంది.సముద్ర తీరప్రాంతాల్లో నివసించినా పర్వత ప్రాంతాల్లో నివసించినా తప్పించుకోలేకపోతున్నారు. కాలాలు మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తలలో చుండ్రును పెంచుతాయి. శరీరానికి కావలసినంత పౌష్ఠికాహారం తీసుకోపోయినా, శరీరంలోని హార్మోన్లు సక్రమంగా లేకపోయినా కూడ చుండ్రు వస్తుంది. దీనివల్ల వచ్చే మానసిక అందోళన నుంచి బయటపడలన్నా, చుండ్రు పోవలన్నా ఎప్పుడూ మందులపై అధారపడకూడదు. ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని పదార్థాలను ఉపయోగించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ బాధ తగ్గించుకోవచ్చు

* ఎక్కువ ఆకుకూరలు, పీచుపదార్థం, విటమిన్ ఎ ఎక్కువుగా వుండే పండ్లు తినాలి. కాయగూరలు,చేపలను ఆహారంలో తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తినకూడదు. ప్రోటీన్లు ఎక్కువగా వుండే ఆహారాన్ని తినాలి.

* తలను ఎప్పుడు కప్పి వుంచకూడదు. తలలో తేమ లేకుండా చూసుకోవాలి. తరుచుగా తలకు షాంపూ పెట్టి, సరైనా కండిషనర్ జాగ్రత్తగా వాడాలి. వాటిని వాడినప్పుడు తలను శ్రద్ధగా శుభ్రపరచాలి. మాయిశ్చరైజింగ్ షాంపూ, హెర్బల్ కండిషనర్ను వాడితే చర్మం పొడిగా అవదు.

* ఆరు చెంచాల నీళ్ళల్లో రెండు చెంచాలు వెనిగర్ కలపాలి. షాంపూతో తలస్నానం చేశాక వెనికర్ నీళ్ళను తలకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున కనీసం మూడునెలలు చేస్తే చుండ్రు తగ్గుతుంది.

* తలస్నానం చేయడానికి అరగంట ముందు పుల్లగా వుండే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేయడం వల్ల తలలో పొట్టు రాదు.

* ఉసిరికాయ జుట్టుకు ఐరన్‌ను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది. నిమ్మరసంలో ఉసిరికాయ రసంకానీ, ఉసిరి పొడి కానీ కలిసి తలకు మర్ధన చేయాలి. ఒక గంట తర్వాత స్నానం చేయాలి.

* వారానికి రెండుసార్లు గోరువెచ్చటి కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్దన చేయాలి. చేతి వేళ్ళతో అరగంట సున్నితంగా రాతాలి. వేడినీటిలో ముంచిన తువ్వాలు తలకు చుట్టి అరగంట వుంచాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ చేకూరుతుంది.

*చుండ్రు ఎక్కువుగా వున్నప్పుడు మెంతులు నానబెట్టి ఫేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చెయాలి.       

No comments:

Post a Comment