Tuesday, August 14, 2012

ఇంటికి సంబంధించిన చిట్కాలు


  • అరటిపండు తొక్కలని ఓవెన్ లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీల్లోని మట్టితో కలిపితే, కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి.
  • ఆకుకూరల కాడలు, కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని మొక్కల మొదళ్ళలో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడతాయి.
  • ఇంట్లో కుర్చీల వంటి ఫర్నిచర్‌కు రంగు వేసేటపుడు నాలుగు కోళ్ళకింద సీసామూతలు ఉంచితే రంగు కారినా గచ్చుకు అంటుకోవు.
  • ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంటే, ఉల్లిపాయలు తరగడానికి ముందు కడిగిన నీటిని వాడండి.
  • ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపితే దోమలు, ఈగలు రావు.
  • ఇల్లు తుడిచే స్పాంజి (ఫ్లోర్ మాప్స్) లను నీళ్ళలో విదిలించి ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి పెడితే ఎండిపోయి త్వరగా పాడవకుండా ఉంటాయి.
  • ఇల్లు రెండు వారాల పాటు తాళం పెట్టి ఉంటే తలుపులు తెరవగానే ఒకలాంటి వాసన వస్తుంది. అలా రాకుండా ఎండాలంటే తలుపులు తెరచి ఒక పెద్ద ప్లేటులో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచండి.
  • ఈగలను పారద్రోలడంలో మిరియాలు మంచి కీటకనాశినిగా పనిచేస్తుంది.
  • ఎలక కొరికి ఉపయోగపడని కొత్త బెడ్ షీట్లను బాగున్నంత మేర తీసి గలీబులు, సంచులు కుట్టుకోవచ్చు.
  • ఎలుకలు విసిగిస్తుంటే వాటి కలుగుల వద్ద పుదీనా రసంలో ముంచిన దూది ఉండను పెట్టండి.

  • కిటికీల గుండా తలుపు సందుల గుండా చీమలు బారులు తీరి వేంచేస్తున్నాయా? చిన్న దాల్చినచెక్క ముక్కను ఆ దారిలో ఉంచితే చాలు చీమలు ఆ దారిలోంచి పరుగోపరుగు.
  • కోడిగ్రుడ్డు డొల్లను మెత్తగా పొడిచేసి పాదులకు గానీ, మొక్కలకు గాని వేస్తే మంచి ఎరువులా పని చేస్తుంది.
  • కత్తెరలు గానీ, చాకులు గానీ, పదును పెట్టించుకోవాలన్నప్పుడు, ఒక గరుకు(ఉప్పు)కాగితంతో గట్టిగా రుద్దితే పదునెక్కుతుంది. ఇది ఇంట్లో మనమే చేసుకోవచ్చు.
  • కొద్దిగా సబ్బునీటిలో పాత వార్తాపత్రిక ముక్కలు వేయాలి. ఈ నీటిని ఫ్లాస్క్ లో పోసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత బాగా కదిపి ఆ నీటిని పారబోసి మంచి నీటితో శుభ్రపరచాలి. ఫ్లాస్క్ పరిశుభ్రంగా ఉంటుంది.
  • కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్ధన చేసుకొని గంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రుపోతుంది.
  • కొబ్బరినూనె గడ్డకట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని చుక్కలు ఆవనూనె కలపాలి.
  • కర్పూరం డబ్బాలో వేసి ఎంత మూతపెట్టినా, కొంత కాలానికి కొంతైనా హరిస్తుంది. నాలుగు మిరియపు గింజలు, నాలుగు బియ్యం గింజలు ఆ డబ్బాలో కర్పూరంతో పాటు వేసి ఉంచితే, కర్పూరం అంత తొందరగా హరించుకుపోదు.
  • కర్ర సామానుల మీద, నేలపై మంచు కురిసినట్లు చెమ్మపడుతూ ఉంటుంది. లీటరు నీటిలో చెంచాడు కడిగే సోడా కలిపి కడగండి. తరువాత శుభ్రమైన నీటితో మరోసారి కడిగి ఆ నేలని ఆరబెడితే మంచిది.
  • కొవ్వొత్తి పత్తికి కాస్త ఉప్పురాస్తే ఎక్కువసేపు కాలుతుంది.
  • కొవ్వొత్తుల వత్తుల అంచుల్ని సగం వరకు కత్తిరిస్తే ఎక్కువసేపు స్థిరంగా, కాంతిగా వెలుగుతాయి.

  • క్షార పదార్థాలవల్ల అగ్ని ప్రమాదాలు జరిగితే వెన్న నిమ్మరసం, పాలు వంటివి గాయాలకు పూయాలి.
  • ఖరీదైన గాజుసామాగ్రి శుభ్రం చేస్తున్నప్పుడు చేతిలో నుంచి జారి పగిలిపోకుండా ఉండకుండా వాటిని తుండుగుడ్డలో చుట్టి శుభ్రం చేయాలి.
  • గంధపు చెక్కను పుస్తకాల మధ్య ఉంచితే పుస్తకాలు తినేసే పురుగులు, చిమటలు ఆదరికిరావు.
  • గచ్చు నేల కడిగేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే, ఆరిన తరువాత ఈగలు వాలవు.
  • గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్‌పేస్ట్ తో రుద్దితే సరి.
  • గులాబీ పువ్వుల రేకులు ఊడి పోకుండా ఉండాలంటే పూలు తేగానే ప్రతీ పువ్వు మధ్యన ఒక చుక్క కొబ్బరి నూనె వేయాలి.
  • చింతపండుతో పాటు కొంచెం ఉప్పు కూడా కలిపి రాగి పాత్రలను తోమినట్లైతే తళ తళా మెరుస్తాయి.
  • చేతికి రానంత చిన్నవై పోయిన టాయిలెట్ సోపు ముక్కలు ఎండ బెట్టి తురిమి సర్ఫ్ వంటి పౌడర్‌లలో కలిపి బట్టలు ఉతికితే కమ్మని సువాసనను అందిస్తాయి.
  • చెప్పులు, బూట్లు కరుస్తూ ఉంటే ఆ భాగానికి పెరుగుపూసి ఒక రాత్రంతా ఉంచండి. తెల్లవారి ఎండిన పెరుగు దులిపి పాదరక్షలు ధరించండి.
  • జార్ లేదా బాటిల్ మూత తీయడం కష్టంగా ఉందా? వేడి నీటి పంపు క్రింద కొంచెం సేపు ఉంచండి చాలు.
  • జలుబు నుంచి ఉపశమనం వదలాలంటే గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రిళ్ళు తాగాలి.

  • నల్లుల మందులు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి విషం కనుక గదిలో నల్లుల మందు కొడితే, కొట్టిన నాలుగు గంటల తరువాతనే పిల్లల్ని ఆ గదిలోనికి పోనివ్వాలి.
  • టర్పెన్ టైన్ ఆయిల్ లో తడిపిన పత్తిని ఇంటి మూలల్లో, బీరువాల కిందా ఉంచితే ఎలుకలు రావు.
  • డర్టీగా, మాసిపోయిన ఎలక్ట్రిక్ స్విచ్చులను కిరోసిన్లో ముంచిన కాటన్ తో తుడవండి.
  • తుప్పుపట్టిన తాళాన్ని కిరోసిన్‌లో ముంచిన బట్టతో తుడిస్తే కొత్తదానిలా తయారవుతుంది.
  • తుప్పుపట్టిన స్క్రూలకు కాస్త వెనిగర్ రాయండి. కొద్దిసేపటితర్వాత సులువుగా ఊడదీయవచ్చు.
  • తులసి మొక్కను పురుగు తినకుండా ఉండాలంటే మొక్కల అడుగున ఒక ఉల్లి గడ్డను పాతి ఉంచాలి.
  • దంత సామాగ్రి బొమ్మల వంటివి పసుపు రంగులోకి మారితే నిమ్మ తొక్కలతో రుద్దాలి.
  • నిమ్మనూనెలో రెండుచుక్కలు వేపనూనె వేసి రాత్రిపూట దీపం వెలిగిస్తే చక్కటి సువాసన ఇల్లంతా పరచుకోవడమే కాక దోమలూ రావు.
  • నిలువ చేసిన బియ్యంలో పురుగులు చేరకుండా ఉండాలంటే ఎండిన కాకరకాయను పలచని వస్త్రంలో కట్టి ఆ డబ్బాలో వేస్తే సరి.
  • పాత గిఫ్ట్ పేపర్లను నోట్‌బుక్‌లకు అట్టలు వేసేందుకు వాడుకోవచ్చు.

  • పాత గ్రీటింగ్ కార్డుల్లో ఖాళీగా ఉన్న భాగాన్ని పిల్లలకు బొమ్మలు వేసుకునేందుకు ఇవ్వవచ్చు.
  • పాత చెప్పులను కానీ, కొత్తవి కానీ, ఎప్పుడూ బట్టతో తుడవకూడదు.తుడవడం వలన షైనింగ్,  పైన పొట్టు పోతుంది. స్పాంజీ ముక్కతోనే తుడవాలి. మంచి షైనింగ్ వస్తుంది. పైన పొట్టులా లేచిపోదు.
  • పాత టర్కిష్ టవల్స్ వంటింట్లో చేయి తుడుచు కోవటానికి, చిన్న హ్యాండ్ టవల్స్‌గా కట్‌చేసి ఉపయోగించవచ్చు. చేనేత టవల్స్ అయితే గాజు సాసర్ల సైజులో రౌండ్‌గా కత్తిరించి సాసర్ల మధ్య వుంచితే గీతలు, దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంటాయి.
  • పాత టాల్కం పౌడర్‌కు సువాసన తగ్గితే ఆ డబ్బాని కాసేపు ఎండలో ఉంచితే సువాసన తిరిగి పొందవచ్చు.
  • పాత పేపర్లలో మిగిలిన పెద్దపెద్ద ముక్కలను షెల్ఫ్‌లలో పరిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి.
  • పాత బనియన్లు పారేయకుండా కడిగిన గాజు వస్తువులు తుడవడానికి ఉపయోగించవచ్చు. ఇవి తేమను బాగా పీల్చుకుంటాయి. అలాగే రేడియో, టివి వంటి సున్నితమైన పరికరాలు తుడవడానికి ఉపయోగపడతాయి.
  • పనిచేసే కాలం దాటిపోయిన టానిక్‌లను మొక్కలకు ఎరువుగా వాడవచ్చు.
  • పెన్సిల్ బ్యాటరీలు అయిపోవచ్చినట్లు అనిపిస్తే వాటి నెగిటివ్‌వైపు కొవ్వొత్తి మంటమీద అయిదు నిముషాలు ఉంచితే మరికొన్ని రోజులు పనిచేస్తాయి.
  • ప్లవర్ వాజ్ లో సాల్ట్ కల్పిన నీరు పోస్తే ప్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
  • ప్లాస్టిక్ కంటైనర్‌కి పసుపు మరకలు అయితే సున్నిపిండి లేదా శనగ పిండితో రుద్దితే అవి మాయమవుతాయి.


  • పసి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీటిలో ఉప్పు, డెటాల్ కలిపితే చర్మ వ్యాధి నిరోధకంగా ఉపయోగపడుతుంది.
  • పురుగు(చీడ)పట్టిన మొక్కలకు, పాదులకు ఇంగువ నీళ్ళు పోస్తే పురుగులు(చీడ)పోయి చక్కని కాపు కాస్తాయి.
  • పువ్వులు వాడిపోయినట్లుగా ఉంటే వాటిని ఒక పాత న్యూస్ పేపరులో చుట్టి రాత్రంతా నీళ్ళ బకెట్‌లో వేస్తే తెల్లవారేసరికి తాజాగా ఉంటాయి.
  • ఫోటోలను పోస్టులో పంపించదల్చుకున్నప్పుడు వాటి మధ్య కొంచెం టాల్కం పౌడర్ చల్లితే అవి అతుక్కోకుండా ఉంటాయి.
  • ఫ్లవర్ వాజ్ లో  పూలు తాజాగా ఉండడానికి వాజ్ లో నీరు పోయడంతో పాటు పూల రెక్కలపైన, ఆకులపైన కూడా నీళ్లు చిలకరించాలి.
  • ఫ్లవర్ వాజ్ లో పువ్వులు అమర్చేటప్పుడు ఒక్కోసారి వాటి కాడలు వంగిపోయి ఉంటాయి. అలాంటప్పుడు కాడల్ని సన్నగా చేసి స్ట్రాలో అమర్చి వాజ్ లో పెట్టుకుంటే సరి! రంగురంగుల స్ట్రాలైతే వాజ్ అందం మరింత ఇనుమడిస్తుంది.
  • బేకింగ్ సోడాను కొద్దిగా ప్లేటులో వేసి బాత్ రూం లో పెడితే వాసన రాకుండా ఉంటుంది.
  • బోరింగ్ నీటి వల్ల గాజు సామాగ్రి, టైల్స్ పై ఏర్పడే తెల్లని తెట్టులాంటి మరకలు పోవాలంటే దానిపై కొంచెం నిమ్మనూనె రాసి పొడి వస్త్రంతో తుడవాలి.
  • బెలూన్లను కొన్ని నిముషాల పాటు వేడినీళ్ళలో ఉంచితే గాలి నింపడం తేలికవుతుంది.
  • మీ చిన్నారులు తమ అలమరలు, పుస్తకాలు, బొమ్మలు, బూట్లు వగైరాలు శుభ్రం చేసేందుకు వీటిని ఇవ్వవచ్చు.

  • మీ బెడ్ రూంలో ఉన్న ఏదో ఒక బల్బ్ మీద పెర్ ఫ్యూం స్ప్రే చేయండి. ఆ లైట్ వేసినప్పుడు. మీబెడ్ రూం అంతా సువాసనతో నిండిపోతుంది.
  • మంచి మంచి సీనరీలు, పెయింటింగ్స్ ఉన్న క్యాలెండర్లు సంవత్సరాంతరంలో పడేయకుండా గ్రీటింగుల్లా కత్తిరించుకుంటే వాటిని ఫ్రేం కట్టించుకొని గోడకు అలంకరించుకోవచ్చు.
  • మనం ఎన్ని సార్లు తోలినా బల్లులు ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. అలా రాకుండా చేయాలంటే ఒక చిట్కా ఉంది. ప్రయోగించి చూడండి. బల్లులు ఎటునుంచి లోపలికి వస్తుంటాయో ఆదార్లో కోడి గుడ్డు డొల్లను (షేల్) ఒకటో, రెండో పెట్టి చూడండి. బల్లులు రావు.
  • మనం రంగు వెలసిన గలీబులు అలుకు గుడ్డలుగా వాడేబదులు దిండ్లకు ఎక్కించి పైన మంచి గలీబులు తొడిగితే, నూనె మరకలు దిండు వరకూ ఇంకకుండా శుభ్రంగా ఉంటాయి.
  • మార్బుల్ ఫ్లోరింగ్ రంగు మారకుండా తెల్లగా మెరుస్తూ ఉండాలంటే ఒక బకెట్ నీళ్ళలో సగం ప్యాకెట్ షాంపూ వేసి మార్బుల్ బండలు తుడిస్తే తెల్లగా ఉంటాయి. షాంపూల్లో గాఢమైన యాసిడ్స్ ఉండవు కాబట్టి బండలు దెబ్బతినవు. టాయ్‌లెట్స్ కూడా మార్బుల్స్ వేసినప్పుడు యాసిడ్స్ వంటివి వాడకుండా ఉంటే మంచిది.
  • యాపిల్సు కొనేటప్పుడు నలుపలకలుగా వున్నవి ఎన్నుకోవాలి.
  • యిస్త్రీ పెట్టె మరకలను తినే సోడాలో ముంచిన గుడ్డతో తుడిస్తే మరకలు పోతాయి.
  • రూం ఫ్రెషర్ తో అద్దాలు కూడ క్లీన్ చేయవచ్చు కూడా.
  • లెదర్ తో తయారైన బ్యాగులు, ఇతర వస్తువులు నీటిలో తడిస్తే వెంటనే గదిలో ధారాళంగా గాలివచ్చే చోట ఉంచి నీడపట్టునే ఆరనివ్వాలి. అంతేకానీ వాటిని ఎండలో పెడితే సహజకాంతిని కోల్పోతాయి. మృదుత్వాన్ని కోల్పోయి పెళుసుగా అనిపిస్తాయి.
  • లెదర్ పర్సుకు కొద్దిగా ఆలివ్ నూనె రాయాలి. అర గంట తర్వాత మృదువైన వస్త్రంతో తుడిస్తే కొత్త దానిలా మెరుస్తుంది.

  • లిప్ స్టిక్ విరిగిపోతే రెండు ముక్కల కొనలని నిప్పుమీద కొన్ని సెకన్లు వేడిచేసి దగ్గరికి నొక్కి, ఫిజ్ లో పెడితే గట్టిపడుతుంది.
  • వంటి సబ్బు ముక్కలతో చేతి రుమాళ్ళను ఉతికితే సబ్బు ఆదా అవుతుంది. చేతి రుమాళ్ళు మంచి సువాసన కూడా వస్తాయి.
  • వంటింటి సింకులో నుంచి వాసన వస్తోంటే రెండు కప్పుల బ్లీచింగ్ పౌడర్ నీటిలో కలిపి రాత్రి పూట సింకులో పోసి వదిలేయాలి.పొద్దున్నే బాగా నీరు పోస్తే శుభ్రమవుతుంది.
  • వాడేసిన ఇయర్ బడ్స్  దూదిని తీసి ఆ స్థానంలో కాటన్ ఊలు చుడితే ఆడియో టేప్ లాంటివి  శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడతాయి.
  • వాడేసిన టీపొడిని కాల్చితే వచ్చే పొగ దోమలను తరిమి కొడుతుంది.
  • వెనిగర్ కలిపిన నీటితో వంట గదిలో గట్టును తుడిస్తే చీమలు రావు.
  • వార్డ్ రోబ్ లో  ఒక మూల ఎండుమిరపకాయలు పెడితే తోకపురుగులు రాకుండా ఉంటాయి.
  • వాష్ బేసిన్ రంధ్రాలు మూసుకుపోతే ఉప్పు కలిపిన వేడినీళ్ల ని పోస్తే శుభ్రపడతాయి.
  • షూ పాలిష్ గడ్డకడితే అందులో నాలుగు ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి కలిపితే మామూలుగా తయారవుతుంది.
  • సంవత్సరం పూర్తయిన తరువాత క్యాలెండర్ పడేయకుండా వాటిని సైజుల వారీగా కత్తిరించుకొని నోట్‌బుక్స్ కుట్టుకుంటే రఫ్‌వర్క్స్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి.

  • స్వెటర్లు భద్రపరిచే ముందు వాటి మధ్యలో ఓ వేపపుల్ల పెట్టండి. పురుగులు చేరవు.
  • పూరీలు, పకోడీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే వేయించేటప్పుడు నూనెలో అరటీ స్పూన్ ఉప్పు వేయాలి.
  • పుట్టగొడుగులను ఎప్పుడు అల్యూమినియం పాత్రల లో ఉడకబెట్టకూడదు. అలా చేస్తే అవి నల్లగా మారిపోతాయి.
  • చిక్కుడు, పచ్చి బఠాణీ, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు వాటిలో ఒక టీ స్పూన్ షుగర్ కలిపితే వాటి సహజమైన రంగుని కోల్పోవు.
  • పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా తరిగినప్పుడు చేతివేళ్ళు మంటగా అనిపిస్తే వాటిని చల్లని పాల లో కొద్దిసేపు ఉంచితే మంట తగ్గుతుంది. పాలలో కొంచెం చక్కెర కూడా కలపవచ్చు.
  • ఇడ్లి, దోసెల కోసం బియ్యం, మినప్పప్పు నానబెట్టేటప్పుడు ముందే కడగాలి. నానిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కడగటం వల్ల విటమిన్లు నీటి లో పోతాయి. అంతే కాకుడా దుకాణాల లో వాటికి పురుగు పట్టకుండా నిల్వ చేయడానికి కీటకనాశినులను గనుక వాడి ఉంటే కడగకుండా నానబెట్టినప్పుడు ఆ అవశేషాలతో కూడిన నీటినే బియ్యం, మినప్పప్పు పీల్చుకుంటాయి. కాబట్టి అవన్నీ శరీరం లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది.
  • కూరల్లో ఉప్పు తక్కువైనప్పుడు అందులో బంగాళదుంప ముక్కలను వేయాలి. అదికంగా ఉన్న ఉప్పును పొటాటో పది నిమిషాల లో పీల్చుకుంటుంది.
  • గారెల కోసం తయారు చేసుకున్న పిండిలో నీరు ఎక్కువై నూనెలో వేయగానే అంచులదగ్గర సన్న పలుకులుగా విడిపోతున్నట్లయితే, పిండిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి కలపాలి.
  • కూరలు, పులుసులు, సూప్ లు మరీ పలుచగా ఉన్నట్లనిపిస్తే అందులో ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ కలపాలి. కార్న్ ఫ్లోర్ ను అలాగే వేస్తే ఉండలవుతుంది. ముందుగా ఒక కప్పులో వేసి చన్నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని కూరల్లో వేస్తే సమంగా కలుస్తుంది.
  • ఉదయాన్నే అల్పాహారంగా ఓట్ మీల్ తీసుకుంటుంటే కొన్ని రోజుల్లోనే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.


  • బుక్షెల్ఫ్స్ లో చిన్న చిన్న పురుగులు చేరుతుంటాయి. వాటినలాగే వదిలేస్తే పుస్తకాలను తినేస్తాయి. అరల్లో అక్కడక్కడా చిన్న చందనం బిళ్ళలు వేస్తే పురుగులు పట్టవు.
  • గ్లూ స్టిక్స్ ఎండిపోయినట్లయితే అందులో కొద్దిగా గ్లిజరిన్ వేసి గోరువెచ్చగా చేయాలి. గ్లూ మెత్తబడి వాడుకోవడానికి వీలుగా మారుతుంది.
  • తెల్లటి షూ మీద ఏమైనా మరకలు పడి ఉతికినా పోకపోతే, దూదిని నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచి రుద్దాలి.
  • షూ మీద పడిన మరకలు వదలకపోతే ఆఫ్టెర్ షేవ్ లోషన్తో తుడిస్తే ఫలితం ఉంటుంది.
  • మిక్సీలో మసాలాలు గ్రైండ్ చేసిన తర్వాత కడిగినా కూడా మసాలా వాసన వదలదు. అలాంటప్పుడు ఎండిపోయిన బ్రెడ్ ముక్కలను వేసి ఒకసారి తిప్పితే చాలు.
  • మెత్తటి క్లాత్‌ను వేడినీటిలో ముంచి అద్దాన్ని తుడిస్తే చక్కగా శుభ్రపడుతుంది. తడి అద్దం అంచుల నుంచి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
  • అమ్మోనియా, వెనిగర్‌ వంటి వాటిని నీటిలో కలిపి ఆ మిశ్రమంలో ముంచి పిండివేసిన క్లాత్‌తో తుడవవచ్చు.
  • అద్దాన్ని శుభ్రం చేయడానికి క్లీనింగ్‌ ఎలిమెంట్స్‌ వాడేటప్పుడు వాటిని నేరుగా అద్దం మీద స్ప్రే చేయకూడదు. మెత్తటి క్లాత్‌ తీసుకుని దాని మీద స్ప్రే చేసి తుడవాలి.
  • తుడవడానికి వాడే క్లాత్‌కు ఎటువంటి గట్టి వస్తువులు లేకుండా చూసుకోవాలి. పాత కాటన్‌ షర్టు లేదా బనియన్‌లు వాడుతుంటారు. వాటికి బటన్లు ఉంటే ముందుగానే తీసేయాలి.
  • ఇడ్లి, దోసెల పిండి పులిసి పోకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే పిండిలో తమలపాకు వేసి ఉంచాలి.

  • దోసెలు వేసి తీసేప్పుడు దోసె పాన్‌కు అంటకుండా రావాలంటే ముందు రోజు రాత్రి పాన్‌కి నూనె రాసి ఉంచుకోవాలి.
  • బంగాళదుంపల చిప్స్‌ తయారు చేసేముందు నూనెతో చిఒటికెడు ఉప్పు వేసి ముక్కలు వేపుకుంటే చిప్స్‌ కరకరలాడతాయి.
  • పిల్లలు స్కూల్‌కి పెట్టిన లంచ్‌ మొత్తం తిని ఖాళీ బాక్సు తెచ్చిన రోజు వాళ్ల రూంలో ఉన్న క్యాలెండర్‌లో స్టార్‌ ఇవ్వండి. ఇలా చేస్తే క్యాలెండర్‌లో ఎక్కువ స్టార్లు తెచ్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
  • మధ్యాహ్న భోజనం తర్వాత స్వీట్‌ తినే అలవాటుంటే స్వీట్ల స్ధానంలో బాదం మొదలైన డ్రైఫ్రూట్స్‌ చేరిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది.
  • పిల్లల లంచ్‌ బాక్సుతోపాటు వారానికి ఒకటి రెండు సార్లు మంచినీళ్ల బాటిల్‌లో నిమ్మరసం పెట్టారనుకోండి. తాగినప్పటి నుంచి ఇంటికి వచ్చి 'ఎందుకిలా సర్‌ప్రైజ్‌ చేశావంటూ' అమ్మనడగడంలోనూ ధ్రిల్‌ ఫీలవుతారు.
  • పిల్లల లంచ్‌ బాక్సులో వెల్లుల్లి వంటి వంట పదార్ధాల వాసన పట్టిస్తే రసం పిండేసిన నిమ్మ చెక్క వేసి రాత్రంతా ఉంచితే తాజాగా మారుతుంది.
  • వంట చేస్తూనే పిల్లలచేత వాళ్లు చెయగలిగిన సాయం చేయించుకుంటూ వారికి కొత్త విషయాలు చెబుతుంటే ఆసక్తిగా వింటూ చెప్పిన పని చేస్తారు. ఇంటి పనులేంటో తెలుసుకుంటారు. నిజానికి పిల్లల సహాయం కోసం ఎదురు చూస్తూ వంట చేయడం ఆలస్యమవుతున్నా తల్లులు భరించాలి.
  • ఫర్నిచర్ మీద పడిన మచ్చలు, గీతలను తొలిగించాలంటే సిగరెట్‌ బూడిదలో వెనిగర్‌ కలపి ఆపేస్టుతో రుద్దాలి.
  • నీటిలో టీ పొడి వేసి మరిగించి చిక్కటి ద్రావణంలో క్లాత్‌ను ముంచి తుడిస్తే ఏరకమైనా ఫర్నిచర్‌ అయినా శుభ్రపడుతుంది.
  • టేబుల్‌ డ్రాలు కాని వార్డ్రోడ్‌ తలుపులు కాని తీసేటప్పుడు, వేసేటప్పుడు పట్టేస్తుంటే చక్రాలకు మైనం కాని సబ్బుకాని రాయాలి.

  • ఆలీవ్‌ ఆయిల్‌లో అంతే మోతాదులో వెనిగర్‌ కలిపి తుడిస్తే ఫర్నీచర్‌ కొత్తవాటిలా మెరుస్తుంది.
  • ఫర్నీచర్ మీదపడిన మరకలను షూ పాలిష్‌తో తుడిస్తే పోతాయి.
  • షూస్‌ వాసన వస్తుంటే చిటికెడు ఉప్పును లోపల చల్లి ఒక రోజంతా గాలికి ఆరనివ్వాలి. రోజూ వాడకుండా అరుదుగా వాడే షూస్‌ లోపల చిన్న ఉప్పు మూట వేయాలి.
  • అక్వేరియంలో గోల్డ్‌ఫిష్‌ ఉన్నట్లయితే దానిని అప్పుడప్పుడూ ఉప్పు నీటిలో వదలాలి. ఒక పాత్రలో శుబ్రమైన నీటిని తీసుకుని ఒక టీ స్పూన్‌ ఉప్పు కలిపి అందులో పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత అక్వేరియంలో వదలాలి. ఉప్పు నీటిలో ఈదినట్లైయితే చేప ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఫ్లవర్‌ వేజ్‌ లోపల క్లీన్‌ చేయాలంటే కష్టం.నీరు నిలువ ఉండడం వల్ల గార జిగటగా పట్టేస్తుంది. అలాంటప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్‌ ఉప్పు వేసి సబ్బు నీటిని పోసి బాగా షేక్‌ చేయాలి. ఇలా రెండు మూడు సార్లు నీటిని మారుస్తూ మరలా ఉప్పు వేస్తూ శుభ్రం చేయాలి.
  • ఉల్లిపాయ ముక్కలను వేయించేటప్పుడు ఒక స్పూను పాలు కలిపితే ముక్కలు నల్లగా మాడిపోకుండా వేగుతాయి.
  • పన్నీరు ముక్కలను నీటితో ఉడకబెట్టకుండా, వాటిని వేడి నీటిలో వేసి, కొద్దిసేపు ఉంచి నీటిని వార్చేస్తే అవి మెత్తగా దూదిముక్కల్లా ఉంటాయి.
  • నూడుల్స్‌ని ఉడకబెట్టిన తరువాత వేడినీటిని వార్చి వాటిని చల్లని నీటిలో వేస్తే ఒకదానికొకటి అతుక్కుపోకుండా విడివిడిగా అవుతాయి.
  • పచ్చిగా ఉన్న అరటిపళ్ళను ఆపిల్స్‌తో కలిపి పెడితే త్వరగా పండుతాయి.
  • వర్క్‌ ఏరియా, పిల్లలు ఆడుకునే ప్లేస్‌, చదువుకునే స్థలం ఏదైనా ఒకే గదిలో రకరకాల మూడ్స్‌ని క్రియేట్‌ చేయాలంటే మంచి చాయిస్‌ వాల్‌పేపర్స్‌.

  • గోడకు వేసిన రంగును మార్చేయడం వీలుకావట్లేదు అనుకుంటే సింపుల్‌గా నచ్చిన వాల్‌పేపర్‌ని తెచ్చి అతికిస్తే సరి.
  • లివింగ్‌ రూమ్‌, డైనింగ్‌ హాల్‌, బెడ్‌రూమ్‌...ప్రతి గదీ ఓ కొత్తగా కనిపించాలంటే డిజైన్‌లో, ప్యాట్రన్‌లో, రంగులో విభిన్న తరహాలలో ఉన్న వాల్‌ పేపర్స్‌ని ఎంచుకోవాలి. సీజన్‌కు తగ్గ వాల్‌పేపర్స్‌ కంటికి, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి.
  • ఇద్దరు పిల్లలున్న ఇంట్లో చెరో గదిని కేటాయించడం వీలు కాకపోతే పార్టిషన్‌ చేసి వారికి నచ్చిన వాల్‌పేపర్‌తో కవర్‌ చేయడం సులువైన కిటుకు.
  • కిచెన్‌, బాత్రూమ్స్‌ నీరు, చెమ్మ ఎక్కువగా తగిలే చోట్లు, అందుకని ఈ గదులలో వాల్‌ పేపర్స్‌ని వాడకపోవడమే మంచిది.
  • ఫ్రెష్‌ బ్రెడ్‌ మరీ మెత్తగా ఉంటుంది కాబట్టి కట్‌ చేసి వాడాల్సి వస్తే పెద్ద ఎక్సర్‌సైజ్‌గా ఉంటుంది కాని కట్‌ కాదు. అలాంటప్పుడు చాకును మంటకు దగ్గరగా పెట్టి కొద్దిగా వేడి చేసిన తర్వాత కట్‌ చేస్తే బ్రెడ్‌ కరెక్ట్‌గా ముక్కలవుతుంది.
  • పట్టుదుస్తులను ఉతికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కలిపినట్లయితే రంగు పోకుండా ఉంటాయి. మెరుపు కూడా వస్తుంది.
  • పప్పు త్వరగా ఉడకడంతోపాటు మరింత రుచిగా ఉండాలమంటే ఉడికేటప్పుడు అందులో ఒక టీ స్పూన్‌ నువ్వుల నూనె వేయాలి.
  • చపాతీలు రుచిగా రావాలంటే గోదుమ పిండి, బార్లీపౌడర్‌ సమపాళ్ళలో కలుపుకోవాలి.
  • దంతంతో తయారు చేసిన డెకరేటివ్ వస్తువులు దుమ్ము పట్టి కొన్ని రోజులకు రంగుని కోల్పోతాయి. వాటికి తిరిగి మెరుపును తీసుకురావాలంటే ఆర్టికల్‌ను చల్లటి నీరు ఉన్నపాత్రలో 24 గంటలు పాటు ఉంచాలి. ఆ తర్వాత నీటిలో నుండి తీసి పొడి టవల్‌పై ఉంచాలి. క్లాత్‌తో తుడవకూడదు. అలా చేస్తే రంగు మారిపోతుంది. గాలికి ఆరనివ్వాలి.
  • తుప్పు పట్టేసిన తాళంచెవిని కిరోసిన్‌లో ముంచి తుడిస్తే కొత్తదానిలా తయారవుతుంది.

  • బియ్యం పురుగుపట్టకుండా ఉండాలంటే... వాటిలో ఎండిన కాకరకాయ వేయాలి.
  • చెప్పులను క్లాత్‌తో తుడిస్తే పై లేయర్ రాలి పోతుంది. షైనింగ్ తగ్గుతాయి. స్పాంజితో తుడిస్తే మంచి షైనింగ్‌తో ఎక్కువ కాలం మన్నుతాయి.
  • టాల్కమ్‌ పౌడర్ పెద్ద టిన్‌ కొన్నప్పుడు పూర్తయ్యేలోపుగా వాసన తగ్గుతుంది. అలాంటప్పుడు టిన్‌ను కొద్దిసేపు ఎండలో పెడితే తిరిగి సువాసనలు వెదజల్లుతుంది.
  • మార్కెట్‌లోకి కొత్త బియ్యం వచ్చేశాయి. వీటిని వండినప్పు డు అన్నం పొడిగా రాకుండా ఒక దానికొకటి అతుక్కుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే బియ్యం కడిగిన తర్వాత పది నిమిషాల సేపు నాననిచ్చి వండాలి. అలాగే వండేటప్పుడు ఒక టి స్పూను నూనె వేస్తే అన్నం విడివిడిగా ఉంటుంది.
  • గారెలు వంటివి చేయడానికి బాణలో నూనె పోసి మరగించినప్పుడు ఒక్కొక్కసారి ఆ నూనె పొంగుతూ నురగ వస్తుంది. అలాంటప్పుడు చిన్న గోళీ అంత చింత పండును నూనెలో వేస్తే రెండు నిమిషాల్లో నూనె మామూలుగా మారుతుంది.
  • దోసెలు ఎర్రగా కరకరలాడాలంటే మినప్పప్పు రుబ్బేటప్పుడు ఒక టీ స్పూన్‌ మెంతులు వేయాలి.
  • ఇత్తడి డెకరేటివ్ ఆర్టికల్స్ మీద తరుచుగా మరకలు పడటం, మసకబారడం జరుగుతుంటుంది. ప్రతిసారీ వాటిని తీసి శుభ్రం చేయడం సాధ్యం కాదు కాబట్టి తుడిస్తే సరిపోతుంది.
  • పింగాణీ పాత్రలు లేదా ఫ్లవర్‌వేజ్‌ల మీద మొండి మరకలు పట్టేసి ఉంటే వాటిని నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచిన దూదితో తుడిస్తే పోతాయి.
  • అల్యూమినియం లేదా హిండాలియం చైర్స్ లేదా టీ పాయ్ వంటి ఫర్నిచర్ పాతబడినట్లు అనిపిస్తే తడిక్లాత్‌ను బేకింగ్‌సోడాలో ముంచి తుడవాలి.
  • డ్రై ఫ్రూట్స్‌ను కట్ చేయాలంటే ముందుగా వాటిని ఒక గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. అలాగే తరిగే చాకును వేడి నీటిలోముంచి తీయాలి. అప్పుడే సమంగా, నీట్‌గా ముక్కలు చేయడం సాధ్యమవుతుంది.

  • ఉల్లిపాయలను తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే పొట్టు ఒలిచిన తర్వాత మధ్యలోకి కట్ చేసి నీటిలో వేసి పదినిమిషాల తర్వాత తరగాలి.
  • బాదం పప్పును మరిగేనీటిలో పదినిమిషాలపాటు ఉంచి ఒలిస్తే పొట్టు సులభంగా వస్తుంది.
  • మార్బుల్ రాతి మీద కురగాయలను తరుగుతుంటే కత్తి పదును పోయి త్వరగా మొద్దు బారుతుంది. కాబట్టి చాపింగ్ బోర్డు వాడడం మంచిది. మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు అండుబాటులో ఉంటున్నాయి కాని ఉడెన్‌ చాపింగ్ బోర్డు వాడితే ఆరోగ్యానికి మంచిది.
  • ఫ్లవర్‌వేజ్‌లో పెట్టిన పూలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పోసే నీటిలో ఉప్పు వేయాలి.
  • వాతావరణంలో మార్పుల కారణంగా దంతపు వస్తువుల తెల్లదనం పోయి పసుపుగా మారతాయి. వాటిని నిమ్మచెక్కతో రుద్దితే తిరిగి తెల్లబడతాయి.
  • కుర్చీలు, బీరువాలు, సోఫాల వంటి ఫర్నిచర్‌కు రంగులు వేసినప్పుడు అది ఆరే లోపుగా కిందకు కారి వాటి కాళ్ల దగ్గర నేల మీద రంగు అంటుతుంటుంది. పెయింట్ వేసేటప్పుడు కాళ్ల కింద పాత పేపర్‌లు కాని వెడల్పాటి సీసా మూతలు కాని పెడితే ఆ సమస్య ఉండదు.
  • నిమ్మనూనెలో రెండు చుక్కల వేపనూనె వేసి రాత్రి పూట దీపం వెలిగిస్తే గదంతా సువాసన పరుచుకోవడంతో. పాటు దోమలు పోతాయి. ఇది పూర్తిగా సహజసిద్ధమైనది కావడంతో మస్కిటో రిపెలెంట్లు, కాయల్స్‌తో వచ్చే సైడ్ఎఫెక్ట్స్ ఉండవు.
  • షూ పాలిష్‌తో మెరిసేది షూస్‌ మాత్రమే కాదు ఫర్నీచర్‌ కూడా. ఫర్నీచర్‌కు పట్టేసిన మరకలు పోవాలంటే షూ పాలిష్‌తో తుడవాలి.
  • సిగరేట్‌ నుసికాని సాంబ్రాణి కడ్డీల నుసిలో కాని వెనిగర్‌ కలిపి ఆ పేస్టుతో తుడిస్తే ఫర్నీచర్‌ మీద గీతలు పోతాయి.
  • ఫర్నీచర్‌ కొత్త వాటిలా మెరవాలంటే ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను టీ పౌడర్‌ కలిపి అందులో ముంచిన క్లాతుతో తుడవాలి.

  • ఒక టేబుల్‌ స్పూను వెనిగర్‌లో అంతే మోతాదు ఆలివ్‌ ఆయిల్‌ కలిపి తుడిస్తే ఫర్నీచర్‌ కొత్త వాటిలా మెరుస్తాయి.
  • వెండి వస్తువులు తెల్లగా మెరవాలంటే బూడిదతో కాని బూడిదలో ఉప్పు కలిపి కాని రుద్దాలి.
  • వజ్రాల ఆభరణాలను శుభ్రం చేయాలంటే, కొద్దిగా వాషింగ్‌ పౌడర్‌ కలిపి మరిగించిన నీటిలో పదిహేను నిమిషాల సేపు నానబెట్టాలి. సబ్బు నీటిలో నుంచి తీసినతర్వాత నీటి ధార కింద జాగ్రత్తగా కడగాలి.
  • వజ్రాల ఆభరణాలను ధరించేముందు మెత్తటి పొడి వస్త్రంతో తుడవాలి. ఎక్కువ రోజులు దాచి ఉంచినప్పుడు కాస్త డిమ్‌ అవుతుంటాయి. ఇలా తుడిస్తే ప్రకాశవంతంగా ఉంటాయి.
  • ముత్యాల నగలను గాలి తగిలే విధంగా జాగ్రత్త చేయాలి. ఎక్కువ రోజులు గాలి చొరని బీరువాలలో ఉంచినట్లైతే రంగు మారతాయి. వాటిని ధరించే ముందు మెత్తటి క్లాత్‌తో మెరుగుపెట్టినట్లు సున్నితంగా తుడవాలి.
  • వంట పాత్రలు మాడి లేదా పదార్థాల అవశేషాలు పట్టేసి మరకలైతే వాటిని శుభ్రపరిచే ముందు ఒక టబ్‌లో నీరు పోసి అందులో కొద్దిగా బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి పాత్రలను ముంచి తీయాలి.
  • మస్కిటో మ్యాట్‌లకు పీల్చుకునే గుణం ఎక్కువ. దుస్తుల మీద పదార్థాలు ఒలికినప్పుడు వాడేసిన మస్కిటో మ్యాట్‌లతో అద్దినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
  • ఫ్లాస్క్‌లను కొద్ది రోజులు వాడిన తరవాత వాసన వస్తుంటాయి. ఎంత కడిగినా ఆ వాసన వదలదు. అలాంటప్పుడు ఫ్లాస్క్‌లో వెనిగర్‌ కలిపిన వేడినీటితో నింపి అందులో కోడిగుడ్డు డొల్ల ఒకటి వేసి నాలుగైదు గంటల సేపు మూత పెట్టి ఉంచాలి.
  • పోస్టల్‌ స్టాంపులు కాని స్టిక్కర్లు కాని ఒకదానికొకటి అతుక్కుంటే అప్పుడు విడదీసే ప్రయత్నం చేయకుండా వాటిని అలాగే పదినిమిషాలసేపు ఫ్రీజర్‌లో పెట్టి తీయాలి.
  • గాజు వస్తువులను వెనిగర్‌ కలిపిన నీటితో కడిగితే బాగా శుభ్రపడతాయి.
  • పప్పులకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని నిల్వ చేసే డబ్బాలలో అడుగున నాలుగైదు వెల్లుల్లి రేకలు వేయాలి.

  • కూరలలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వేయించిన వరిపిండిని కలపాలి.
  • పప్పులో ఒక స్పూను రిఫైన్‌డ్‌ ఆయిల్‌ లేదా రెండు వెల్లుల్లి రేకలు వేసి వండినట్లయితే గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గుతుంది.
  • కూరగాయలను ఉడికించేటప్పుడు ముందుగా నీటిని వేడిచేసి అప్పుడు ముక్కలను వేయాలి. ఎక్కువ సేపు నీటిలో ఉండేకొద్దీ పోషకాలు నశిస్తుంటాయి. కాబట్టి నీటిలో ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇదొక పద్ధతి.
  • పనీర్‌ను బ్లాటింగ్‌ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. పదిహేను రోజుల వరకు వాడవచ్చు. రెడీమేడ్‌ పనీర్‌ను ప్యాక్‌ ఓపెన్‌ చేసిన తరువాత వారం రోజుల్లో వాడేస్తే మంచిది.
  • ఫ్రిజ్‌లో నుంచి తీసిన పనీర్‌ను వండే ముందు కొద్దిసేపు వేడినీటిలో వేస్తే మృదువుగా మారుతుంది.
  • పనీర్‌ను ఇంట్లో చేసుకోవాలంటే... పెద్ద పాత్రలో పాలను పోసి అరగంట సేపు మరిగిన తరువాత నిమ్మరసం వేయాలి. పాలు విరుగుతాయి. ఒక లీటరు పాలకు రెండు నిమ్మకాయల రసం పడుతుంది. నీటిని ఒంపేసి మళ్లీ స్టవ్‌ మీద పెట్టి మరింత నిమ్మరసం వేసి మరిగించాలి. నీరు పోయే వరకు అడుగుకు అంటకుండా జాగ్రత్తగా కాచి క్లాత్‌లో కట్టి నీటిని పోయేటట్లు చేయాలి. పాల విరుగు గట్టిగా అవుతుంది. దీనిని రౌండ్‌గా బాల్స్‌లా కాని ప్లేట్‌మీద పెట్టి క్యూబ్‌ ఆకారంలో లేదా మనకు కావలసిన అకారంలో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పనీర్‌ను వండేటప్పుడు చిదమాల్సిన, తురమాల్సిన పనిలేదు. టిక్కాలు, స్టిక్స్‌ కోసమైతే ఆ ఆకారంలో వచ్చేటట్లు చేసుకోవాలి. అంత టైం లేకుంటే మార్కెట్‌లో దొరికే రెడీమేడ్‌ పనీర్‌ వాడుకోవచ్చు.
  • డైనింగ్‌ టేబుల్‌ మీద అందంగా ఫ్లవర్‌వాజ్‌ పెట్టుకుంటారు. అందులోనే నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా పెడితే ఈగలు ఆ పరిసరాలకు రావు.
  • ఇంట్లో ఇండోర్‌ ప్లాంట్‌లు పెడితే చూడడానికి అందంగా ఉంటాయి. కాని వాటిలో నీరు నిలవవుంటే అక్కడ దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ సమస్య ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ. తరిమినా పోవు సరికదా! ఇల్లంతా చుట్టుకుంటాయి. అలాంటప్పుడు పచ్చి బంగాళాదుంపను చక్రాలుగా కోసి కుండీలో పెడితే దోమలన్నీ ఆ ముక్కల మీదకు చేరతాయి. అప్పుడు ఆ ముక్కలను జాగ్రత్తగా తీసి పారేయాలి.
  • పెద్ద ట్రేలో మట్టిపోసి కొత్తిమీర, మెంతుల వంటివి చల్లుకుని ఆ ట్రేని వంటగది కిటికీలో కాని బాల్కనీలో కాని పెట్టుకుంటే పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిస్తూ చూడడానికి అందంగానూ ఉంటుంది. తాజా కొత్తిమీర, మెంతికూర మీకెప్పుడు అవసరం వస్తుందా! అని ఎదురు చూస్తుంటాయి.
  • వార్డ్‌రోబ్‌లో కాని పెట్టెల్లోకాని దుస్తులను ఎక్కువ రోజులు నిలవ ఉంచినప్పుడు వాటికి సిల్వర్‌ఫిష్‌ అనే సన్నని పురుగులు పడతాయి. ఇవి రాకుండా ఉండాలంటే లవంగాలు, దాల్చిన చెక్క పొడి చేసి దానిని సన్నని క్లాత్‌లో కట్టి రోజూ వాడని దుస్తుల మధ్య ఉంచాలి. వీటి బదులుగా పొగాకు కాడలు, ఎండిన వేపాకులను కూడా వేయవచ్చు.

  • దుస్తుల మీద లిప్‌స్టిక్‌ మరకలు పడితే వాటిని పోగొట్టడానికి వేజలిన్‌ రాసి కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత మామూలుగా సబ్బుతో ఉతకాలి.
  • టీ తయారు చేసే పాత్రలకు కొద్దిరోజులకు గార పట్టేస్తుంది. అలాంటప్పుడు వాటిలో గార మునిగేటట్లు నీటిని పోసి అందులో రెండు టీ స్పూన్ల సోడియం బై కార్బనేట్‌ వేసి మరిగించి కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత మామూలుగా డిటర్జెంట్‌తో శుభ్రం చేయాలి. కప్పుల మీద టీ, కాఫీ మరకలు పట్టేసినా కూడా ఇదే పద్థతి. మరిగించిన సోడియం బై కార్బనేట్‌ నీటిలో వేసి తర్వాత కడగాలి.
  • వంట త్వరగా పూర్తవడానికి కూరగాయలను చిన్న ముక్కలుగా తరుగుతుంటాం. ఇలాంటప్పుడు వాటిలోని విటమిన్లు ఆవిరై పోతుంటాయి. అందుకే పెద్ద ముక్కలు తరగాలి.
  • సమయాన్ని ఆదా చేయడం కోసం కూరగాయలను వంట మొదలుపెట్టడానికి గంట రెండు గంటల ముందుగా తరగడం మంచిదికాదు. తరిగిన తర్వాత వీలయినంత త్వరగా వండినట్లయితే పోషకాలు వృథా కాకుండా ఉంటాయి.
  • ఇప్పుడు సూపర్‌ మార్కెట్లలో తరిగిన కూరగాయల ముక్కలు దొరుకుతున్నాయి. వంటకు ఎక్కువ టైం కేటాయించడానికి వీలులేని వాళ్లు వీటిపై ఆధారపడడం సహజమే కాని, ముక్కలు చేసిన తర్వాత వండడానికి కనీసం పది గంటల సమయం పడుతుంది. ఇందులోని పోషకాల శాతం ఏ మేరకు ఉంటాయనేది సందేహమే.
  • ముక్కలు తరిగిన తర్వాత కడిగే అలవాటుంటే మాత్రం వెంటనే మానుకోవాలి. ఇలా చేయడం వల్ల విటమిన్లను నష్టపోతాం.
  • పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా తరిగినప్పుడు చేతివేళ్ల మంటతగ్గాలంటే చల్లని పాలలో కొద్దిసేపు ఉంచాలి.
  • పూరీలను, పకోడీలను వేయించేటప్పుడు నూనెలో అర టీ స్పూను ఉప్పు వేస్తే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
  • చిక్కుళ్లు, పచ్చి బఠాణీలు, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీ స్పూను పంచదార కలిపితే సహజమైన రంగుని కోల్పోవు.
  • యాపిల్‌ తొక్కలను కొద్దిసేపు పాన్‌లో వేసి ఉడకబెడితే అల్యూమినియం పాన్‌లు కొత్తగా మెరుస్తాయి.

  • కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు ఆ నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ వెనిగర్‌ కలిపితే గుడ్డు కొద్దిగా పగిలినా వాటి లోపల ఉండే పదార్ధం బయటికి రాదు.
  • కాలీఫ్లవర్‌ ఉడికిన తరువాత కూడా తెల్లగా ఉండాలంటే, ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళలో రెండు టీ స్పూన్ల పాలు కలపాలి.

No comments:

Post a Comment