మనలో చాలామందికి పొట్ట పెరిగినట్లు కనిపిస్తూ ఉంటే అసహ్యంగా అనిపించడం సహజమే. జారిపోయినట్లుగా ఉన్న పొట్ట తగ్గించుకోడానికి సులభమైన మార్గం టమ్మీ టక్. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ.
మహిళల్లో
పొట్ట జారినట్లుగా పెరగడానికి గర్భధారణ, స్థూలకాయం, మేజర్ సర్జరీలు, వయసు
పెరగడం వంటి అనేక అంశాలు కారణమవుతాయి. కొందరిలో జన్యుపరంగా పొట్ట
జారినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పొట్ట కండరాల్లో
పటుత్వం తగ్గిపోవడం వల్ల ఇలా జరగడం సహజమే. ఇలాంటి వాళ్లు అబ్డామినోప్లాస్టీ
అని పిలిచే టమ్మీ టక్ చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే
కొందరికి మాత్రం టమ్మీటక్‌ను మేం వెంటనే సిఫార్సు చేయం. బరువు మరింతగా
తగ్గాలని చికిత్స తీసుకునేవారు, మరో బిడ్డను కోరుకునేవారు వెంటనే టమ్మీ టక్
చేయించుకోకపోవడం మంచిది. ఎందుకంటే... ఇలా సర్జరీ చేయించాక వాళ్లు
పొందాల్సిన గరిష్ట ప్రయోజనం పొందలేరు కాబట్టి. అయితే ఇలాంటి వారికి టమ్మీ
టక్ కంటే మినీ టమ్మీ టక్ మంచిది.
No comments:
Post a Comment