భోజనం చేసిన తరువాత
చాలామార్లు పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఆచమనం చేయాలి. నీటితో కళ్ళు
తుడుచుకోవాలి. అగస్త్యుడు మొదలైన వారిని తలుచుకోవాలి. "అన్నం విష్ణు
స్వరూపం, ఆత్మ పరిణామ రూపం అనే భావనలతో నేను తిన్న అన్నం బాగా కావాలి.
అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, అశ్వని దేవతలు-అను ఈ ఐదుగురిని అన్నం తిన్న
తరువాత స్మరిస్తే అన్నం బాగా జీర్ణం అవుతుంది". అనే అర్థం ఇచ్చే శ్లోకం
చదవాలి.
ఇదీ శ్లోకం
విష్ణురాత్మా తథైవాన్నం
పరిణామశ్చ వై యథా
సత్యేన తేన మద్భుక్తం
జీర్యతు అన్నమిదం తథా
అగస్తిరగ్నిర్బడబానలశ్చ
భుక్తం మమాన్నం జరయంత్వ శేషం
సుఖంచమే తత్పరిణామ సంభవం
యచ్ఛంత్వరోగం మమచాస్తు దేహం
అంగారక మగస్తించ పావకం సూర్యమశ్వినౌ
పంచైతాన్ సంస్మరేన్నిత్యం భుక్తం తస్యాశు జీర్యతి.
ఇలా చెబుతూ తన చేతితో పొట్టను రాసుకోవాలి. శర్యాతిని, సుకన్య, చ్యవన, ఇంద్ర, అశ్వినీ దేవతల్ని అన్నం తిన్న తరువాత స్మరిస్తే కంటికి మంచిదని ఈ క్రింది శ్లోకం చెబుతోంది.
దీన్ని కూడా చదవాలి.
శర్యాతించ సుకన్యాంచ చ్యవనం శక్రమశ్వినౌ
భోజనాంతే స్మరేన్నిత్యం తస్య చక్షుర్నహీయతే
తిన్న తరువాత వేంటనే నిద్ర పోకూడదు. కఫం, పిత్త ప్రకోపం కలిగి జఠరాగ్ని మందమవుతుంది. తిన్న తరువాత నూరడుగులైనా వేయాలని వైద్య శాస్త్రం చెబుతోంది.

No comments:
Post a Comment