Saturday, February 9, 2013

నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే మీరు ఏం చేస్తున్నారు!?

నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే ఇష్టమైన వారి ముఖాన్ని చూడటం చేస్తారు. మరికొందరు దేవుడి పటాలను చూస్తారు. అయితే నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కళ్లు తెరవాలని పండితులు అంటున్నారు. తర్వాత కుడి అరచేతిని చూసుకోవాలి. కరాగ్రంలో లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమునకు వెనకవైపు గోవిందుడు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రభాత వేళలో కరదర్శనం శుభప్రదం.

శ్లో|| కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కర పృష్ఠే చ గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ||
దక్షిణహస్తం పురుషార్థాలను పొందడానికి కారణమవుతుంది. పుస్తకాన్ని పట్టుకూంటుంది. రాతలు రాస్తుంది. జపమాల తిప్పుతుంది.

నా కుడిచేతిలో పురుషార్థముంది. ఎడమచేతిలో విజయముందని
"కృతం మే దక్షిణే హస్తే జయో మే సవ్య ఆహితః " అని వేదాలు చెప్తున్నాయి.

ఆయం మే హస్తో భగవానయం మే భగవత్తరః
ఆయం మే విశ్వభేషజోయం శివాభిమర్శినః ||
నా ఈ హస్తం భగవంతుడు. అంతేకాదు.. భగవంతుడిని మించిది కూడా. ప్రపంచానికే ఔషధం వంటిది. ఇదజి స్పర్శమాత్రంతోనే క్షేమాన్ని కలిగిస్తుంది. ఈ మంత్రంలో కరస్పర్శవల్ల రోగం బాగవుతుందని విశ్వాసం. మనచేతుల్లో ఒక రకమైన విద్యుత్ ప్రవాహముందని దాన్ని విధివిధానంగా ప్రయోగిస్తే ఎంతటి జబ్బైనా బాగైపోతుందని పండితులు చెబుతున్నారు.

No comments:

Post a Comment