షడ్రుచులు అంటే ఆరు రుచులు. అవి తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు
రుచులు. ఈ రుచులతో కూడినపదార్ధములు తినిననచో మన శరీరములో షడ్రసములు
ఉత్పత్తి అవుతాయి. యివి 1) మధురరసం (తీపి), 2) ఆమ్లరసం (పులుపు), 3)లవణరసం
(ఉప్పు), 4) కటురసం (కారం), 5) తిక్తరసం (చేదు), 6) కషాయరసం (వగరు). ఈ
షడ్రసములు సమపాళ్ళలో వున్నట్లయితేమన ఆరోగ్యం బాగు ఉంటుంది. ఎక్కువ తక్కువ
లయినట్లయితే దానికి సంబంధించిన అనారోగ్యము వస్తుంది. ఉదా||
మధురరసంపెరిగినచో చక్కెరవ్యాధి, ప్రకృతిలో ప్రతి ఆహారపదార్ధములో ఏదో ఒక
చుచి ఉంటుంది. కానీ నవనీతంలో ఒక విశుద్ధ గుణమున్నది. షడ్రచులలో ఏ రుచికి చెందని మాధుర్యమైన సాత్వికమైన మధురరసం (ఇది మామూలు తీపి రుచి కాదు) నవనీతములో ఉన్నదవి.
నవనీతము విశుద్ధ వర్ణము కలది, సత్వగుణము కలది, శాంత రసము కలది, కనిపించే సూర్య కాంతికి, స్పటికమునకు నీటికి రంగులేదు.అలాగే రుచి చూసే వస్తువులలో వెన్నకు రుచిలేదు. వెన్నలో వున్న శాంతరసమందు మనస్సు, సత్వగుణమును శాంతిని, తన్మయత్వమును,ససమాధిని పొందుతుంది. అందుకే శ్రీకృష్ణు మనకు తెలియచేయుటకు నవనీతమును నోటినిండ తినేవాడు. నవనీత చోరుడు ఆయన.యిటువంటి నవనీతమును మనకు ప్రసాదించుచున్న గోవునకు జయమగు గాక.
సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వెన్న, నెయ్యి తరచూ వాడుతుంటారు. మేధాశక్తిని, చురుకుదనాన్ని పెంచే శక్తిగల వెన్న వలన అనేక ప్రయోజనాలు, మరెన్నో సద్గుణాలు ఉన్నాయి.* మజ్జిగను చిలికి తీసిన వెన్న మధురంగా ఉండటమేగాక శరీరంలో ధాతువులను సమస్థితికి తీసుకువచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంటే మెటబాలిజం అనే జీవన ప్రక్రియను శరీరం సక్రమంగా నిర్వర్తించుకునేలా చేస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. జఠర రసాన్ని పెంచి, జీర్ణకోశాన్ని క్రమబద్ధీకరిస్తుంది. పొడి దగ్గును అరికడుతుంది. వెన్న కొంచెం ఆలస్యంగా అరుగుతుంది. కానీ, బలవర్థకమయినది. కాలేయాన్ని బలంగా ఉంచుతుంది. చర్మరోగాలను దరిచేరనీయదు. పిల్లల చేత వెన్న తినిపిస్తే మేధాశక్తి పెరుగుతుంది.
* తాజా వెన్నలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎ, బి, సి, డి విటమిన్లు ఉన్నందున ఎదిగే పిల్లలకు వెన్న చక్కని పౌష్టికాహారం. వెన్నలో లభించే కొవ్వు పదార్థం సులభంగా జీర్ణమై, బలాన్ని వృద్ధిపరుస్తుంది. ప్రతిరోజూ పెరుగును చిలికి వెన్న తీసి పిల్లలకు పెడితే మేధావంతులుగా, ఆరోగ్యంగా పెరుగుతారు. వెన్నను శరీరానికి మర్దనా చేసినట్లయితే చర్మానికి వర్ఛస్సును, మృదుత్వాన్ని ప్రసాదిస్తుంది. నీరసించే పిల్లలకు, బలహీనులకు, గుండె బలం తక్కువగా ఉన్నవారికి వెన్న అత్యుత్తమమయినది.
* ఆవు వెన్నకు, గేదె వెన్నకు చాలా తేడా ఉంటుంది. శరీరానికి అవసరమైన చమురు గుణాన్ని కలుగజేసి, చలువను, దృఢత్వాన్ని కలిగించడంలో ఆవు వెన్న అత్యుత్తమమయినది. గేదెవెన్న కంటే ఆవు వెన్న సులభంగా జీర్ణమవుతుంది. వాతము, పిత్తమును క్రమబద్ధీకరించి, రక్తదోషము, క్షయ, మూలవ్యాధులను నివారించడంలో ఆవు నెయ్యి విశిష్టమైనది. అంతేగాక, ఈ రెండు రకాల వెన్న బలాన్ని, వీర్యవృద్ధిని, వర్ఛస్సును కలుగజేస్తాయి.
* వెన్నలో పంచదార కలిపి తీసుకుంటే కడుపులో మంట, పోట్లు సమసిపోతాయి. తేనె, చెరకురసం, ఉప్పు వెన్నకు విరుగుడు.

No comments:
Post a Comment