Tuesday, June 23, 2015

తెనాలి రామకృష్ణుడి తెలివి తేటలు

ప్రక్క రాజ్యానికి రాజైన నవాబు మీ రామకృష్ణుడు
చాలా తెలివి గలవాడని విన్నాము.ఆయన తెలివిని
మాకు కొంచెం పంపించ గలరు. అని వ్రాసి తన
దూత తో పంపించాడు.

రాయలు రామకృష్ణుడి వైపు చూశాడు. రామకృష్ణుడు తల వూపి యింటికి
వెళ్ళిపోయాడు. యింటికి వెళ్లి తన పెరట్లో పచారు చేస్తూ ఆలోచిస్తూ వుండగా అతని దృష్టి అక్కడే పాకి వున్న గుమ్మడితీగ పై పడింది.
దానికి ఒక చిన్న పిందె కాసి వుండటం
కనిపించింది.అంటే అతనికి ఒక ఉపాయం
తట్టింది. బజారుకు వెళ్లి చిన్న మూతి గల కుండ నొకదానిని కొనుక్కొచ్చాడు.మెల్లగా అ పిందెను ఆ కుండ లో దించాడు.
మరుదినం సభకు వెళ్లి ఒక నెల తర్వాత నేనే
పంపుతానని చెప్పి ఆ దూతను పంపించి
వేశాడు.
నెల తర్వాత ఆ పిందె పెరిగి ఆ కుండ నిండా
అయింది.రామకృష్ణుడు తొడిమ కత్తిరించి ఆ
కుండను ఒక దూతకు యిచ్చినవాబుకు
పంపుతూ ఈ కుండను పగుల గోట్టకుండా
తెలివిని తీసుకోవలిసిందని వ్రాసి పంపించాడు.
ఆ నవాబుకు కుండను పగుల గోట్టకుండా దాన్ని
ఎలా బయటకు తియ్యాలో తెలియక మాకు దాన్ని బయటకు తియ్యడ మేలాగో
తెలీలేదు.మీ రామకృష్ణుడిని పంపి తీసి
యిమ్మని వ్రాసి పంపించాడు.
రామకృష్ణుడు ఆ నవాబు సభకు వెళ్లి ఆ కుండను తెప్పించి
ఒక పదునైన కత్తిని కూడా తెమ్మన్నాడు.ఆ
కట్టి తీసుకొని మెల్లగా కుండలో పెట్టి
నిదానంగా ఆ గుమ్మడి కాయను ముక్కలుగా
కోశాడు.చెయ్యి పెట్టి మెల్లగా ఒక్కో ముక్కనే
బయటికి తీశాడు.సభలోని వారంతా ఆశ్చర్యంగా
చూస్తూ వుండి పోయారు.
నవాబు
రామకృష్ణుడిని మెచ్చుకొని చాలా
బహుమానాలిచ్చి గౌరవంగా సాగనంపాడు.

No comments:

Post a Comment