Showing posts with label పిల్లలు. Show all posts
Showing posts with label పిల్లలు. Show all posts

Friday, June 28, 2013

దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?

పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు.


ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుందట. అలా జరిగినపుడు ఆహారం బాగా వంటబడుతుందని చెపుతున్నారు.


చాలా మంది పిల్లలకు టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు ఆహారం వంటబట్టదని అనేక తాజా సర్వేలు కూడా వెల్లడించాయి. వారి దృష్టి ఆహారం మీద కాకుండా, టీవీపైనే కేంద్రీకృతమై ఉంటుందని అందువల్లే భోజనం చేసే సమయంలో దిక్కులు చూడకుండా తినాలని మన పెద్దలు చెప్పేవారట.

Tuesday, June 18, 2013

ఎటువంటి ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేయాలి...?

పసితనంలో ఎటువంటి ఆహారపు అలవాట్లుచేస్తారో అవే జీవితంలో చాలాకాలం నిలుస్తాయి. అందుకే నడక నేరుస్తున్న రోజుల్లోనే పిల్లలకు అన్నిరుచులూ అందించాలంటారు. మూడేళ్ళ వయసు పిల్లలకు ఆహారం పెట్టే తల్లులు ఒకచోట కూర్చుని అన్నం తినే అలవాటు చేయాలి. అటూఇటూ తిరుగుతూ, ఆడుతూ తినేతిండి వంటపట్టదు. అన్నం 20 నమిషాలలో తినాలి.

ప్రతివారం ఒక కొత్త రుచిని అలవాటుచేయండి. ఆహారం రంగురంగుల్లో ఉండేలా చూడండి. పాలు, పెరుగులు రోజులో కనీసం మూడుసార్లు ఇవ్వడం మంచిది. ఆహారం పంటికి భిన్నంగా తగిలేలా చూడండి. మెత్తగా, బరకగా అప్పుడప్పుడు మారుస్తుండండి. పప్పు రోజులో రెండు సార్లు, ఒకసారి పండ్లు పెట్టాలి. అన్నంతో కూరగాయలు కలిపి పెట్టండి.

తమంత తాముగా తినేలా ప్రోత్సాహించండి. పిల్లలకు రుచులు తెలియాలి. అన్నీ కలిపి మిక్సీలో కొట్టిమిక్సిడ్ రుచులుగా చేయవద్దు. ఇంటి బయటకు తీసుకువెళ్ళి ఆహారం పెట్టే అలవాటు అస్సలు మంచిది కాదు. అన్ని కూరగాయలూ తినపించండి.