Monday, May 19, 2014

కోపం ఇలా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసి చూడండి

మీరు చూసేది, చేసేది ఏది నిజంకాదు. అనవసరపు కోపతాపాల వలన అనారోగ్యం పాలౌతారు. ఇక్కడ ఎవరికీ జవాబు చెప్పే పని లేకపోయినా పంచభూతాలు నిన్ను గమనిస్తూ ఉంటాయని గుర్తుంచుకో, జరిగిన క్షణాన్ని వదిలేయండి. మీరు ఎంత ఏడ్చి మొత్తుకున్నా క్షణకాలం వెనక్కి రాదు. జరిగిపోయిన దాన్నే తలచుకుంటూ కూర్చుంటే కాలం జరిగిపోతుంది గాని సంఘటన వెనక్కి రాదు.
      చాలామంది ఏదైనా జరిగిన తరువాత అరరె ఇలా కాకుండా ఇంకోల చేసి వుంటే బాగుండేది. అలా చేయకుండా ఉండాల్సిందే.! అనుకుంటూ ఉంటారు. కాని జరగాల్సింది నువ్వెంత కాదన్నా ఈరూపంలో కాకపోయినా ఏదో ఒకరూపంలో పోయేది పోతూనే ఉంటుంది. దీన్ని ఆపడం నీతరం కాదు.

      ఒకడు ఒక పందెంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరివరకు తనదే గెలుపు. చివర్లో మాత్రం చిన్న పొరబాటు వలన మొత్తం డబ్బు పోయింది. అప్పుడు అరరె ఇంకొంచం జాగ్రత్తగా ఉండాల్సిందే అనుకుంటాడు. కాని ఉండలేడు. ఎందుకంటే మొదటి తప్పు. ఉన్న డబ్బుని సద్వినియోగం చేయకపోగా దురాశతో పందెంలో పెట్టాడు. రెండు: ఆసమయంలో మంచి చెడు ఆలోచించే విచక్షణ కోల్పోయాడు చివరివరకు గెలుపు తనవైపు ఉన్నా దాన్ని గమనించకుండా ఇంకా ఇంకా అనుకున్నాడు. మొత్తం పోగొట్టుకున్నాడు.

      నువ్వు ఎవ్వరిని పట్టించుకోకపోయినా నిన్ను అనుసరించే కొన్ని శక్తులు ఉంటాయి. నువ్వు దైవానికి ఋణపడి ఉన్నావని గ్రహించు. నువ్వు తినే తిండి బ్రహ్మం సృష్టించింది.ఈ భూమి పండించిది. భూమి తనలో విత్తనాలు దాచి ఉంచుతుంది. లేదంటే నువ్వు బ్రతకలేవు. నీరు, నేల, నింగి, అగ్ని, వాయువు, ఆకాశం వీటిలో ఏ ఒక్కటి తనపని మానుకున్నా, లేక నీశరీరంలో దేవుడు సృష్టించిన స్వచ్చమైన సహజసిద్దమైన ''ఏ సి'' (ఎండాకాలంలో నీ శరీరాన్ని తడుముకొని చూడు, చల్లగా ఉంటుంది. చలికాలంలో దుప్పటి ముసుగేసుకుంటే వెచ్చగా ఉంటుంది.) పనిచేయకపోయినా నువ్వు అనేవాడివి మిగలవు.

నువ్వు ఇంకేమి  చేయగలవని నీకు అంత కోపం. కోపంతో నిన్ను భాధించుకుని ఎదుటివారిని బాధపెట్టడం ఎంతవరకు సమంజసం. ఆలోచించండి. వచ్చేటప్పుడు ఏమి తీసుకోచ్చావ్. పోయేటప్పుడు ఏమి తీసుకేళతావ్. ఈక్షణంలో నీదగ్గర ఉన్న సంపద మరుక్షణంలో నీదగ్గర ఎందుకు ఉండటంలేదు? నువ్వు ఏమి సృష్టించావని మరొక వస్తువుని నాశనం చేస్తున్నావ్. నాది నాది అనుకున్నదంతా రేపో మాపో ఇంకొకడి సొత్తు అవుతుంది. నువ్వు ఎంత ప్రేమగా తెచ్చుకున్న వస్తువైనా, ప్రేమించిన మనిషైనా కలకాలం ఉండదు. ఏదో క్షణంలో ఆ వస్తువు పాడవ్వడమో, ఆమనిషి పోవడమో జరుగుతుంది. దీన్ని నువ్వు ఆపగలవా? లేదు. లేదు. ఏదీ నీచేతిలో లేదు. అలాగని ఏదైతే అదవుతుందని కూర్చుంటే కుదరదు. నీప్రయత్నం నువ్వు చెయ్యి. మంచైనా చెడైన సమంగా స్వీకరించు.

ఈవిషయాన్ని గుర్తెరిగితే! కోపం, అసూయ, అశాంతి అన్ని మాయమయ్యి మానవుడే మాధవుడు అవుతాడు. సృష్టి ఇక్కడివరకు సాగిందంటే దానికి కారణం ఎందఱో రాజర్షులు ఇలాంటి సదాచారాలు, శాస్త్ర విధి విధానాలు పాటించారు కనుక. మనం ఆలోచించినట్టు ఆలోచిస్తే సృష్టి ఎప్పుడో సర్వ నాశనం అయ్యేది.. గుర్తుంచుకోండి. మనస్సు ఏమి చెప్పిందో వినడంకాదు. శాస్త్రాలు ఏమిచెప్పాయో అవి తెలుసుకుని పాటించండి. పాటించాల్సిందే..

మనస్సు - బుద్ది

మనిషికి దేవుడు ఇచ్చిన వరం బుద్ది. ఈ బుద్దికి అన్నీ తెలుసు. ఏది మంచి! ఏది చెడు! ఏ పని ఎలా చేస్తే బావుంటుంది! ఇలా ప్రతి ఒక్క విషయం మీద పూర్తి అవగాహన ఉంటుంది.

కాని మనస్సు బుద్ధి ని తప్పుదోవ పట్టిస్తుంది. మనస్సుకి ''మాయ'' ఆవరించి ఉంటుంది. గట్టి పట్టి కుర్చోబెడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రభావం ఎక్కువ అని చెప్పొచ్చు. చెప్పే చదువులో ''నీతి'' ''ధర్మం'' ఇలా ఏమి లేకుండా కేవలం అర్ధ సంపాదనే ద్యేయంగా కనపడుతుంది ప్రస్తుత విద్యావ్యవస్థ. దీనికి తోడు ప్రతిఒక్కరికి అశ్రద్ద ఎక్కువైంది. ఇంట్లో తల్లితండ్రులకి కూడా ఏమి తెలియదు. ఎందుకంటే వీరికి కూడా చెప్పేవారు లేరు. ఒకవేళ చెప్పినా వినరు. దీనితో సంప్రదాయాలు తుంగలో తొక్కేశారు. నీతి న్యాయం గాలికి వదిలేశారు. సమయానికి ఏది తోస్తే అదే మంచి. వీడికి ఏది ఆ సమయంలో ఉపయోగపడుతుందో అదే ధర్మం. ఇలా అయ్యింది న్యాయం, ధర్మం పరిస్థితి.

దీనివల్ల కలి పురుషుడు మనస్సుని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకొని మానవుడిని నానా తిప్పలు పెడుతున్నారు. ఈ విషయాన్నీ మాత్రం ఎవ్వరూ గమనించడంలేదు. ఇది ఎలా ఉంటుందంటే! ఎవరైనా ఏదైనా మంచి చెప్తే వాడిని పిచ్చోడిలా చూడటం, నువ్వు నాకు చెప్పేదేంటి? అనడం, వీడు చెప్తే తెలుసుకోవాలా? మాకు తెలిదా? అనే స్థితిలో నిలబెడుతుంది. ఉదాహరణకి నువ్వు ఒక పని చేస్తున్నావ్ అనుకో.

అది ఎలాంటి పనో ముందుగా బుద్ధి చెప్తుంది. ఇది చెడు పని చేయకు. ఇది మంచిపని మధ్యలో ఆపకు. అని.
కాని మాయ ప్రభావం ఇంకోలా ఉంటుంది. ఉదయాన్నే 5గంటలకి లేచి వ్యాయామం చేయాలి అనుకుంటుంది బుద్ది. కాని మాయ ఆ సమయానికి ఆ ఎం చేద్దాం కొంచంసేపు పడుకుని లేద్దాం లే అనిపిస్తుంది. ఒక వేళ దీని మాట వినకుండా నువ్వు చేసినా రెండు మూడు రోజులకి మించి చేయవు. మనస్సు నిన్ను మంచం మీద నుండి లెవనివ్వదు.

అలాగే పూజ చెయ్యాలని ఒకరోజు బుద్ది పుడుతుంది. కొన్నాళ్లు చేస్తాడు. ఒక వరం, లేకపోతె ఒక నెల క్రమం తప్పకుండ 5కి లేచి పూజ చేస్తారు. తరువాత మనసు మారిపోతుంది. ఒక గంట ఆలస్యంగా చేస్తారు. ఇంకొన్నాళ్ళకి ఇంకో గంట. ఇంకొన్నాళ్ళకి ఆ గంట పోయి వారంలో 3రోజులు అంటారు. ఇంకొన్నాళ్ళకి వారంలో ఒకసారి. ఇలా కొన్నాలు చేసిన తరువాత ఇన్ని పూజలు చేస్తున్నాను. ఇన్నాళ్ళ నుండి చేస్తున్నాను. కాని ఫలితం ఏముంది? ఏమి లేదు నేనెందుకు చేయాలి అని బలవంతం మీద చేస్తారు. ఇక లేనిపోని ఆలోచనలు చేసి పూజ చేయడం ఆపేస్తారు. ఈ ఒక్కటే కాదు మీ తలపెట్టిన ఎలాంటి పని అయినా ఇలా మధ్యలోనే ఆపుచేయిస్తుంది మనస్సు. ఎవరికో సాయం చేయాలని బయలుదేరారు అనుకుందాం! మధ్యలో మనస్సులో అనేక ఆలోచనలు పుట్టుకొస్తాయి. వీడికి చేస్తే నాకేంటి లాభం. ఈ డబ్బులతో సాయంత్రం చక్కగా బిర్యానీ తిని బీర్ తాగొచ్చు. లేదంటే ఇంకో అవసరానికి వాడుకోవచ్చు. లేదంటే వీడు నాకు ఒకప్పుడు ఏదో సాయం చేయమంటే చేయలేదు లాంటి ఆలోచనలు చేయించి మధ్యలో ఆపేస్తుంది.

ఇది ఎవరి తప్పు కాదు. మాయ ప్రభావం వల్ల మనస్సు ఇలా చేయిస్తుంది. కాని బుద్ది మాత్రం హెచ్చరిస్తూనే ఉంటుంది. కాకపోతే మనస్సు ముందు బుద్ది బలం నిలబడదు. ఈవిషయం గ్రహిస్తే బుద్దిని నిలబెట్టి మనస్సుని అదుపులో పెట్టొచ్చు.

ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకడు ఒకడిని చూపించి ఒరేయ్ వాడిని కొట్టు, లేదంటే తిట్టు అంటే వీడికి తెలుసు అనవసరంగా కొట్టకూడదు, తిట్టకూడదు అని సహజంగా తెలుస్తుంది. ఇదే బుద్ది. పిల్లలకి అన్ని మాటలు మనం ప్రతి అక్షరం చెప్పి, నేర్పించడం లేదు కదా! అలాగే ఏది మంచో, ఏది చెడో తెలుసుకోగలుగుతున్నాం అంటే అది బుద్ది వల్ల మాత్రమే. కాబట్టి మనస్సు చెప్పింది కాబట్టి చేశాను అనకుండా బుద్ది ఏమి చెపుతుందో తెలుసుకొని మసలుకోండి.

విధి బలీయం

సత్యం, ధర్మం ఎప్పుడూ వాటి పని అవి చేసుకేళ్ళిపోతాయి. వాటిలో ఉన్న అంతః సూత్రాలు అర్ధం అయితే సమస్య అనేది రాదు. ఒకవేళ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడగలుగుతారు.

ప్రతి ఒక్కరూ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య మీద పోరాటం చేస్తున్నారు కానీ సమస్య మూలాన్ని వదిలేస్తున్నారు. ఇది ఇంకో సమస్యల వలయంలోకి తోసేస్తుంది.

మహాభారతంలో ధర్మరాజు జూదంలో పంచ పాండవులతో సహా రాజ్యాన్ని పోగొట్టుకుని చివరికి భార్య అయిన ద్రౌపతిని కూడా జూదంలో ఒడ్డి ఓడిపోతాడు. ప్రస్తుత కాలమాన పరిస్థితులని బట్టి ధర్మరాజు తప్పుచేశాడు అని ముఖ్త కన్టంతో చెప్పేస్తారు. ఇలా ఆలోచించడం వల్ల కర్ణుడు, దుర్యోధనుడు మంచివారుగా కనిపిస్తున్నారు. అంటే మన ఆలోచనలు ఎంతగా కుదించుకుపోయాయో అర్ధం చేసుకోండి.
కాని ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మ లోతుల్ని అవగాహనా చేసుకోలేక విదురుడు, భీష్ముడు లాంటి వారు ఏమి చెప్పలేకపోయారు. ఇది ఒక కోణం.
ఇంకో విషయం ఇక్కడ ప్రస్తావించాలి. కలి పురుషుడి అంశలో దుర్యోధనుడు, దృతరాష్ట్రుడు, కర్ణుడు, ఇంకా 98 మంది కౌరవులు, ఇంకొంతమంది రాజులు, పుట్టారు. (100 మంది కౌరవులలో వికర్ణుడు ఒకడు.) జూదం ఆడే సమయంలో భీష్ముడిని, విదురుడిని కలి పురుషుడు (అధర్మం) వారి మనసు చుట్టూ ఆవరించి ఏమి మాట్లాడలేని స్థితిలో కూర్చోబెట్టాడు. వికర్ణుడు లేచి ద్రౌపతి అధర్మవిజిత అని చెప్తాడు. కాని కర్ణుడు ఒప్పుకోడు. ఇది ఒక కోణం.

ఇదిఒక కోణం.. ధర్మం నిలబడాలంటే అధర్మం పడిపోయాలి. ధర్మం అధర్మాన్ని ద్రౌపతి వస్త్రాపహరణం చేసేలా ప్రేరేపించి దుర్యోదన, దుశ్యాసనులని రెచ్చగొట్టేలా చేసింది. దాని ఫలితం నిండు సభలో భీముడు దుశ్యాసనుడిని అనిలో(యుద్ధంలో) రొమ్ము చీల్చి రక్తం తాగుతానని, దుర్యోధనుడు తొడలు విరిచి నేలకూలుస్తానని భీకర శశపధాలు చేశాడు. అంతటితో ధర్మం శాంతించలేదు. ఇలా ఐతే శాత్ర నిర్మూలనం పూర్తికాదని మళ్లి జూదానికి పిలిపించి 12ఏళ్ళు అరణ్యవాసం, 1ఏడు అజ్ఞాతవాసం చేసేలా చేసింది. ఎందుకంటే పాండవులకి ధర్మం మాత్రమే రక్షగా ఉంది. ఆయుధ సంపత్తిలేదు. దీంతో అడవులపాలైన పాండవులకి అన్నీ సమకూరాయి. కాని కౌరవులు కొత్తగా ఏమి సంపాదిన్చుకోక పోగా అనవసర ఆవేశకావేశాలకి పోయి పాండవులని చంపడానికి కుట్రలు పన్ని అవమానముల పాలయ్యారు. చివరికి తీసుకున్న గోతిలో పడి చచ్చిపోయారు.

ఇక అసలు కోణం: కృష్ణుడు ఆడిన జగన్నాటకంలో పాత్రలే వీరంతా! భూమిమీద అధర్మం పెరిగిందని భూదేవి విష్ణువుకి మొరపెట్టుకుంటే సాక్షాత్తు విష్ణువే శ్రీకృష్ణావతారం ధరించి భూభారం తగ్గించడం కోసం భూమిపై జన్మించాడు. మహాభారత కథకి మూలం ఇది.
కాని మూలాన్ని ఆలోచించకుండా పైపైన చుస్తే మొదట చెప్పిన విధంగా ఉంటుంది, కొంచం లోతుకి వెళ్తే రెండో విధానం, ఇంకొంచం లోతుకి వెళ్తే కొంత స్పష్టత వస్తుంది. అసలు మూలాన్ని పరిశీలిస్తే విషయం మొత్తం అర్ధమయి సమస్యలు తొలగిపోతాయి.. కాబట్టి సమస్య ఏదైనా మూలాన్ని శోదించండి. కాలం ఎం చేసినా ఒక కారణం అనేది ఉంటుంది.

ఋణానుబంధం

మనం పోయేలోపు మనం చేసిన, చేయించుకున్న ఋణాలు తీర్చేసుకోవాలి.
పుట్టినప్పుడు మనిషికి 3 ఋణాలు ఉంటాయి.
ఒకటి ఋషి ఋణం, రెండు దైవరుణం, మూడు మనిషి ఋణం..
మొదటిది : గ్రంధాలు చదివి అర్ధం చేసుకొని అందులో ఉన్న ధర్మాల్ని అనుసరిస్తూ బ్రతకడం ద్వార ఋషి ఋణం తీర్చుకోవచ్చు.
రెండోది : దైవరుణం : నిత్యాగ్ని హోత్రం, దీపారాధన చేయడం, నిత్యం అయన ఉన్నాడనే తలంపుతో ధ్యానిస్తూ జీవితాన్ని గొప్పగా బ్రతకడం (10 మందికి ఉపయోగపడేలా, ఆదర్శవంతంగా బ్రతకడం) ద్వార తీర్చుకోవచ్చు.
మూడవది మనిషిరుణం: తల్లితండ్రులకి సంస్కారాలు చేయడం ద్వారా, గురువుకి విద్యని అభ్యసించి పేరు తీసుకురావడం ద్వారా ఋణం తీర్చుకోవచ్చు. ఇంతటితో వీరి ఋణం తీరుతుంది.
కాని మనం చేసే అప్పులు, మనల్ని కొన్ని ఆపదల సమయంలో కొందరు ఆదుకున్న ఋణం, కొందరు మనకి తెలియకుండా చేసే మార్గదర్శక ఋణం, స్నేహితుడు ఒకరోజు డబ్బులు లేవని 10/- ఇచ్చాడు అనుకుందాం. దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు కాని దానితో సహా తీర్చివేయవలసిందే. అశ్రద్ద చేశామంటే వచ్చే జన్మ వచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఎవరి ఋణం వారు తీర్చేసుకోండి.

ఈ దేశంలో పుట్టి దేశాన్ని దూషించడం, జాతిని మార్చి(మతమార్పిడులు) వర్ణ సంకరం చేయడం, స్త్రీలని(మంచివారిని మాత్రమే. కొందరు ఉంటారు ఇంతింత నోర్లు వేసుకొని పడతారు ఎదుటివారిమీద. అత్తామమల్ని ఏడిపించేవారు, మొగుడిని నిందించేవారు. వీరికి దండనీతి ప్రయోగించవచ్చు అని శాస్త్రం) మాట ద్వారా కానీ చేత ద్వారా కాని హింసించడం, అప్పులు తీసుకుని ఐ పి లు పెట్టడం, అనవసరపు నిందలు వేసి ఎదుటివారిని నాశనం చేయాలనీ ప్రయత్నించేవారికి, ఇతరుల గురించి, వారు చేసే తప్పులు గురించి ఆత్రంగా ఎదురుచూసే వారు, పెళ్ళాం మాట విని తల్లితండ్రులని నిర్లక్ష్యం చేసేవారు, తల్లితండ్రులని అనాధలుగా వృద్ధాశ్రమాల్లో చేర్పించే నీచ్యులు, సంపదకోసం అడ్డమైన గడ్డి కరిచేవారు, ప్రజలని పీడించేవారు, దుర్మార్గ పాలకులని, అవినీతి నాయకులని ఎదగడానికి సాయంచేసే ప్రజలు, దుర్వ్యసనలకి లోనైనవారు, పర స్త్రీ వ్యామోహం, భర్తని కాకుండా పరపురుషుడినికోరుకునేవారు, తాగుడు, జూదరి, ఇంటికి పెద్దవాడైన కొడుకు ఇంటిని నిర్లక్ష్యంచేసేవారు, పండితులని, బ్రాహ్మణులని దూషించేవారు, పెళ్ళికి ముందే (అర్ధంచేసుకోగలరు), గోవుని అదలించడం, కొట్టడం, గో మూత్రం, గోమయం చూసి అసహ్యించుకోవడం కూడా పాపమే ఇంకా.. ఉన్నాయి.. ఇహ (భూమి మీద), పర (పరలోకాల్లో) ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తారు. వీరు వేల జన్మలు ఎత్తి నానా పాట్లు పడతారు అని శాస్త్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి.

పంచభూతాలు

చాలామంది నేను చేసిన తప్పు ఎవరూ చూడరు, చూడలేదు అనుకుంటూ ఉంటారు మనం చేసే ప్రతిపని కనురెప్ప వేయడంతో సహా అనుక్షణం గమనించడానికి బ్రహ్మ కొందరిని సృష్టించాడు. అవే పంచభూతాలు. గాలి, నీరు, నింగి, నిప్పు, భూమి.. ఈ 5 మనం చేసే ప్రతి చిన్న పని గమనిస్తుంటాయి. ఇంకా వీటికి కింద కొన్ని పనిచేస్తుంటాయి పగలు, రాత్రి, సాయంసంధ్యా కాలాలు. ఇవి మనం నిదురించిన తరువాత వెళ్లి మనం చేసిన పనులు యముడి దగ్గర చిట్టాలో వ్రాస్తాయి. కాని మనం మాత్రం ఇవన్ని నమ్మకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మనం చేస్తున్న కొన్ని పనులకి అన్ని శిక్షలు యమలోకంలో వేయలేరు కనుక కొన్ని మన పిల్లలకి, ఇంకొన్ని మనకి భూమి మీద జీవించే సమయంలో కష్టాల రూపంలో శిక్షలు వేస్తాడు. కష్టం వచ్చేసరికి చాలామంది తను చేసిన తప్పు గుర్తించకుండా ఎదుటివాడు అలా చేయబట్టి నేను ఇలా అయిపోయాను అని అందరికి ఇంకొకరి మీద చెప్పి చేసిన పాపాలకి తోడు ఇంకో పాపం మూట కట్టుకుంటున్నారు. ఇలా నిత్యం తప్పు మీద తప్పు చేస్తూనే మనిషి మనుగడ కొనసాగిస్తున్నారు. కాబట్టి మనం చేస్తున్న తప్పులు, పాపాలు ఎవరూ చూడటంలేదు అనుకోకండి.. జాగ్రత్త..

ధర్మశాస్త్రం

కలికాలం లో చేస్తున్న మనకి తెలియని, ఇంకొన్ని తెలిసిన తప్పులు.. ఇవి ఎంత ఘోరంగా ఆపదలు తీసుకోస్తాయో మీరే చుడండి...

ఇది శాస్త్రం..

ఇల్లు, భర్త, పిల్లలు తప్ప వేరే లోకం తెలియని ఆడవాళ్ళని దూషించినా, అకారణంగా ఆడవారిని దూషించినా, అభ్యుదయం పేరుతొ ఆడపిల్లలని విచ్చలవిడి తనం అలవాటు కావడానికి కారణం అయినవారు, కొడుకులని అదుపులో పెట్టలేని తండ్రి, ఏ విషయం అయినా మాపిల్లలు సరైన నిర్ణయాలే తీసుకుంటారు అని విపరీత స్వేచ్చ ఇచ్చినా(కొన్ని విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోవచ్చేమో కాని జీవితాన్ని అదః పాతాళంలోకి నేట్టేసుకుంటారు), భార్య మాటలు విని తల్లితండ్రులని నిరాదరించినా, కోడలు అత్తామామలని నిరదరించినా, అత్తామామలు కోడలిని హింసపెట్టినా, నీచ్యుడు అయిన కొడుకుని అదుపులో పెట్టలేని జనకులు.. ఇటు భూమి మీద అటు నరకంలో అధోగతి పాలు అవుతారని ధర్మశాస్త్రం..

అభ్యుదయవాదం అంటే ఇదేనా?

ఈ కలికాలంలో మనం చెప్పే మాట అభ్యుదయం.. ఈ మాటని అడ్డుపెట్టుకొని ఎంత మంది ఎన్ని రకాలుగా పాడైపోతున్నారో కొన్ని చిన్న ఉదాహరణలు.. దయచేసి నన్ను అనకండి..
ఒక 2రోజుల క్రితం 85ఏళ్ళ వయస్సు ఉన్న పెద్దాయన వచ్చారు. చాల రోజులనుండి తెలుసు. అయన పేరు పూర్తిగా తెలిదు కాని రెడ్డి గారు అని పిలుస్తాను..
ఏదో మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నిర్భయ విషయం ప్రస్థావనకి వచ్చింది. దోషులకి ఉరి వేయడం అందరు సమ్మతించారు. కాని ఆ వకీలు మాట్లాడిన మాట ''ఇలా అర్ధరాత్రి వరకు తిరిగే కూతురు నాకు ఉంటే ఉరి తీసి చంపుతాను'' అని అన్నాడు. ఈ మాటని జర్జీ గారు వెంటనే ఖండించారు. జనాలు కూడా కొందరు ఖండించారు. కొందరు మాత్రం కొందరేంటి చాలా మంది ఆ వఖీలు కి మద్దతు పలికారు. నేను కూడా.. ఇక్కడే ఒక సన్నివేశం వచ్చింది.
ఆ లాయరు అలా అనడం తప్పు. ఆ అమ్మాయి ఏమి చిన్న పిల్ల కాదు కదా. మేజర్ కనుక బాయ్ ఫ్రెండ్ తో తిరిగితే తప్పేంటి అన్నాడు. నేనేమో! అదేంటి అలా అంటారు. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి వరకు రోడ్లమీద తిరగడం తప్పుకాదా? మీలాంటి వారు ఉండబట్టే అలా స్వేచ్చ పేరుతొ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇదెక్కడి న్యాయం..
రెడ్డిగారు: నేను అభ్యుదయ భావాలు కలవాడిని. అభ్యుదయవాదిని. తప్పేముంది ఇందులో.
నేను : తప్పు లేదా?
రెడ్డిగారు: లేదు! కాలం మారింది. కాలంతో పాటు మనం మారాల్సిందే.
నేను : ఈ మాట నేను ఒప్పుకోను. కాలం కాదు మారింది. మనిషి ఆలోచన మారింది. స్వేచ్చ, అభ్యుదయం అనే ముసుగు వేసుకొని విచ్చలవిడి తనం ప్రదర్శిస్తున్నారు.
రెడ్డిగారు : నువ్వు ఇంకా 1940ల్లో ఉన్నట్టు ఉన్నావ్.
నేను : హహ్హహహ్హ, నేనా? 1940నా? సరే ఒక్క మాట చెప్పండి. మీకు ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు. వారు కూడా అభ్యుదయభావం పేరుతొ బాయ్ ఫ్రెండ్ తో అర్ధరాత్రి వరకు తిరిగితే మీరు ఎం చేస్తారు? నాకు చెప్పనవసరం లేదు. ఆలోచించుకోండి.
రెడ్డిగారు: అదెలా కుదురుతుంది..
నేను : అంటే మీ కూతురు మేజర్ అయిన కాకపోయినా మీరు మాత్రం తిరగడానికి ఒప్పుకోరా? ఇదేనా అభ్యుదయం!
పేరు బాగుంది కదా అని అభ్యుదయం, స్వేచ్చ అనే పేర్లు వాడకండి రెడ్డిగారు. ఏ ఆడపిల్ల అయిన ఆడపిల్లే. ఎవ్వరి కూతురు అయినా కూతురే! ఆ అమ్మాయి మన అమ్మాయి కాదు ఎలా పొతే నాకేంటి అంటే వాళ్ళని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు.
అభ్యుదయం, స్వేచ్చ అనే పేర్లకి అర్ధం కూడా తెలియకుండా వాడేయకండి. వీటికి లోతు ఎక్కువ. మునిగిపోతారు.
రెడ్డిగారు : ????????
నేను : ఇబ్బంది గా మాట్లాడితే క్షమించండి.. 10 మందికి చెప్పే వయస్సులో ఉన్నారు. చెప్పించుకునే వయస్సు కాదు.

ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అభ్యుదయవాదం అంటే ఇదేనా?