Monday, May 19, 2014

పంచభూతాలు

చాలామంది నేను చేసిన తప్పు ఎవరూ చూడరు, చూడలేదు అనుకుంటూ ఉంటారు మనం చేసే ప్రతిపని కనురెప్ప వేయడంతో సహా అనుక్షణం గమనించడానికి బ్రహ్మ కొందరిని సృష్టించాడు. అవే పంచభూతాలు. గాలి, నీరు, నింగి, నిప్పు, భూమి.. ఈ 5 మనం చేసే ప్రతి చిన్న పని గమనిస్తుంటాయి. ఇంకా వీటికి కింద కొన్ని పనిచేస్తుంటాయి పగలు, రాత్రి, సాయంసంధ్యా కాలాలు. ఇవి మనం నిదురించిన తరువాత వెళ్లి మనం చేసిన పనులు యముడి దగ్గర చిట్టాలో వ్రాస్తాయి. కాని మనం మాత్రం ఇవన్ని నమ్మకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మనం చేస్తున్న కొన్ని పనులకి అన్ని శిక్షలు యమలోకంలో వేయలేరు కనుక కొన్ని మన పిల్లలకి, ఇంకొన్ని మనకి భూమి మీద జీవించే సమయంలో కష్టాల రూపంలో శిక్షలు వేస్తాడు. కష్టం వచ్చేసరికి చాలామంది తను చేసిన తప్పు గుర్తించకుండా ఎదుటివాడు అలా చేయబట్టి నేను ఇలా అయిపోయాను అని అందరికి ఇంకొకరి మీద చెప్పి చేసిన పాపాలకి తోడు ఇంకో పాపం మూట కట్టుకుంటున్నారు. ఇలా నిత్యం తప్పు మీద తప్పు చేస్తూనే మనిషి మనుగడ కొనసాగిస్తున్నారు. కాబట్టి మనం చేస్తున్న తప్పులు, పాపాలు ఎవరూ చూడటంలేదు అనుకోకండి.. జాగ్రత్త..

No comments:

Post a Comment