ప్రస్తుత కాలంలో మనిషి ఇంద్రియ సుఖాల కోసం తప్ప మరొకదాని కోసం సమయాన్ని వెచ్చించడం లేదు. ఏదైనా అలాగైన సుఖంగా బ్రతకడమే లక్ష్యంగా ప్రస్తుత యువత ఆలోచిస్తుంది. ప్రత్యేకించి పట్టణాల్లో యువత ఈదిశగా ఆలోచనలు చేస్తుంది అని కొన్ని ప్రత్యెక సర్వేలలో తేల్చారు.
కంటికి నచ్చిందని ఏదిపడితే అది చూడటం, చెవికి ఇంపుగా వుంది అని పెద్ద శబ్దాలతో అడ్డమైన సంగీతం వినడం, నాలుక రుచి కోసం పిజ్జాలు, బర్గర్లు, రోడ్డుమీద కనపడే అడ్డమైన చెత్త లోపలవేసి లేనిపోని రోగాలు కొని తెచ్చుకోవడం, పార్టిలు, పబ్బులు, క్లబ్బులు, బార్లు, బీర్లు ఇలా లేనిపోని వ్యసనాలకి లోనుకావడం ఇలా సాగుతుంది నాగరిక ప్రపంచం. ఈ నాగరిక ప్రపంచ మైకంలో మనిషి తయారుచేసిన వినాశనం తెచ్చే వాటివైపు మొగ్గు చూపుతున్నారు.ప్రకృతి ఇస్తున్న సహజ వనరులని కూడా నాశనం చేస్తున్నారు.
ఉదాహరణ : దేవుడు ఒక చేపని సృష్టించాడు. అది బ్రతకాలంటే నీరు కావాలి కనుక మేఘం ఇచ్చాడు. మేఘం కరిగి నీరు రావాలంటే వాయువు కావాలి. వాయువుని సృష్టించాడు. ఈ వాయువు రావాలంటే చెట్టు కావాలి కాబట్టి చెట్టుని సృష్టించాడు.. ఆ చెట్టు నిలవడానికి నేల కావాలి భూమిని సృష్టించాడు. ఇవన్ని సృష్టించి చేపని నీటిలోకి వదిలాడు. మరి దీనికి ఆహారం కావాలి కదా! అందుకని నాచుని కూడా సృష్టించి ఇచ్చాడు. చేప వాటిని ఉపయోగించుకొని బాగా బలంగా పెరిగింది. ఒంటరిగా ఉండలేదు కదా అందుకోసం దీనికి జంటని కూడా పంపించాడు. చాలాకాలం జరిగింది. ఈ చేపల జంటకి పిల్లలు పుట్టుకొచ్చాయి. వాటికి మరిన్ని పిల్లలు పుట్టాయి. చేపలు బాగా పెరిగాయి. సుఖంగా ఉంటున్నాయి. ఇది వీటికి నచ్చలేదు. కొత్తగా ఏదైనా తినాలి తినాలి అనుకుంటూ ఉన్నాయి. ఇంతలో మనిషి ఒక ఎరని గాలానికి గుచ్చి నీటిలో వేశాడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్న చేప ఆ ఎరని చూసింది. వచ్చి లటుక్కున పట్టుకుంది. గాలం కసక్కున దిగింది. ఆ బాధని తట్టుకోలేక తన్నుకుంటున్న చేపని మనిషి గాలం నుండి పీకి (జాగ్రత్తగా ఏమి తీయలేదు. ఒక్క సారిగా లాగేసరికి మూతి ఊడి వచ్చింది.) బుట్టలో వేశాడు. అప్పుడు అనుకుంది. నాకోసం దేవుడు సృష్టించి ఇచ్చిన అన్ని సౌకర్యాలు కాదని కొత్తవాటి మోజులో పడి చివరికి దిక్కులేని చావు చావాల్సివచ్చింది. అనుకుని ప్రాణం వదిలేసింది.
మనసు కోతిలాంటిది. బుద్ది దాని అధీనంలో ఉంటుంది. మనస్సుని అదుపు చేయలేకపోతే బుద్ది నిన్ను అనేక వంకర్లు నిన్ను తిప్పుతుంది. నువ్వు ఒక పనికోసం బయలుదేరితే మద్య దారిలో ఇంకోదాని మీదకి మళ్ళిస్తుంది. నువ్వు చదవాలి అని పుస్తకం పట్టుకుంటే ఇంకో పుస్తకమో లేక ఇంకో వ్యాపకమో గుర్తుచేసి అటువైపు మళ్ళిస్తుంది. కాబట్టి నచ్చింది అని కనపడిన ప్రతిదాని వెనక పడకండి. మీకు నచ్చలేదని ఎవరిని దూషించకండి. ఇదంతా సాధన ద్వారానే సాధ్యం అవుతుంది.

No comments:
Post a Comment