ఒక విషపు చుక్క కడివెడు పాలని విషంగా మార్చేస్తాయి. అలాగే కొందరు మాట్లాడే మాటలు సందిగ్ధంలో ఉన్నవారి ఆలోచనలని ప్రభావితం చేస్తాయి. కాబట్టి దయచేసి కొంచం అలోచించి మాట్లాడండి.
కృతయుగంలో ధర్మం 4పాదాలమీద నడిచింది. ఇలాంటి సమయంలో ఎవరు ఎవరికీ ఏమి చెప్పేపని లేదు. స్వతహాగా జ్ఞానులు ఎవరి పనిలో వారు వుండేవారు.
త్రేతాయుగంలో 3పాదాలమీద నడిచింది. ధర్మం కొంచం అదుపు తప్పింది. నిలబెట్టడానికి రాముడు దిగివచ్చాడు.
ద్వాపరయుగంలో 2పాదాలమీద నడిచింది. అధర్మం పాళ్ళు ఎక్కువైనది. సాక్షాత్తు విష్ణువు అంశలో కాకుండా కృష్ణుడిగా పరిపూర్ణ అవతారంగా దిగివచ్చి 73 కోట్లమందికి పైగా సంహరించాడు.
ఇది కలియుగం. దీనికి కలహాయుగం అని కూడా పేరు ఉంది. కలియుగం ప్రారంభానికి ముందు ఋషులు అందరూ భయపడి వశిష్టుడు, విశ్వామిత్రుడు, కౌండిల్యుడు, ఇలాంటి మహామహులైన మునులు కలికి భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి కలి ప్రవెసించబొతున్నాడు. మేము భూమి మీద ఉండలేము, కలి ప్రవేశించని ప్రాంతం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ తన మనోనేత్రం నుండి బండి చక్రం తీసి (ఎడ్లబండి చక్రాలు తెలుసుకదా, అది) భూమి మీదకి దొర్లించి ఇది ఎక్కడ పడి ముక్కలవుతుందో ఆప్రాంతంలోకి కలి ప్రవేశించడు అన్నాడు. అది దొర్లుకుంటూ వచ్చి భూమి మీద పడి ముక్కలయ్యింది. అదే నైమిశారణ్యంలో ఉన్న చక్రతీర్ధం. ఇక్కడ మన కంటికి కనపడకుండా ఎందరో మునులు, ఋషులు యజ్ఞ యాగాదులు చేస్తూ భూమిని సంరక్షిస్తున్నారు.
ఇలాంటి ఋషులే కలికి భయపడితే మనం ఎంత? చెడు వెళ్ళినంత వేగంగా మంచి వెళ్ళలేదు.

No comments:
Post a Comment