మానవుని జీవితం మీద పవిత్ర గ్రంధాల ప్రభావం ఎంతైనా ఉంది. సామాజిక వ్యవస్థను తీర్చిదిద్ది, క్రమబద్ధం చేసేవి పవిత్ర గ్రంధాలు. కాబట్టి ప్రతి మతంలోనూ ఈ గ్రంధాలకు పవిత్రత, గౌరవం ఉంది.
నిత్య సత్యాలను ప్రకటించేవి వేదాలు. ప్రజల యొక్క ధార్మిక తత్వాన్నీ, సాంస్కృతిక సంపదను వెల్లడి చేసేవి వేదాలు. ప్రతి మతానికీ ఆ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంధాలు ఉన్నాయి. ఆయా పవిత్ర గ్రంధాలను అనుసరించే ఆయా మతాలు నిరూపించబడుతున్నాయి. మన ప్రాచీన ఋషులు ఎంతో శ్రద్ధగా వేద రచన చేశారు. వేద రహస్యాలు దేవతలు చెప్పగా ఋషులు విని పఠించినవి. కాబట్టే వీటిని శృతులు అన్నారు. ఈ శృతులను క్రమబద్ధం చేసి ప్రచారం చేసిన ఘనకీర్తి వేదవ్యాసుల వారికే దక్కుతుంది. వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, స్దామవేదం, అధర్వణవేదం అని నాలుగు విభాగాఉగా ఉనాయి. మన సంస్కృతి అంత వేదాల మీదే ఆధారపడి ఉంది. ప్రపంచంలో అతి ప్రాచీనమైనది ఋగ్వేదం. దీనిలో మొత్తం 10,500 ఋక్కులున్నాయి. కొన్ని ఋక్కులను కలిపి సూక్తం అంటారు. ఋగ్వేదంలో 1017 సూక్తులున్నాయి. ఈ సూక్త్లు తిరిగి మండలాలుగా విభజించబడ్డాయి. ఋక్కులలో స్తోత్రాలు, ప్రార్ధనలు, మంత్రాలు, సాధారణ పాటలు ఉన్నాయి.
మతాలన్నిటికంటే హిందు మతంలో పవిత్ర గ్రంధాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక తత్వం మనవుని మనుగడకు సంజీవినివంటిది. ఇట్టి ఆధ్యాత్మిక తత్వం నిజ స్వరూపమే ఈ పైత్రమైన మత గ్రంధాలలో విశదీకరింపబడింది. భారతీయ తత్వశాస్త్రం ముఖ్య విషయాలన్నీ వేదాలలో, ఉపనిషత్తులలో, గీతలో విపులీకరింపబడ్డాయి.
అత్యంత ప్రామాణికమైన హిందూ తత్వ గ్రంధాలు వేదాలు. ఇవి నిత్య చైతన్యవంతమైనవి, అతి విశ్వసనీయమైనవి. మన ప్రాచీన ఋషులు తమ తపో నిష్ఠలో గ్రహించినవే వేద రహస్యాలు. ప్రతీ వేదం రెండు ముఖ్య భాగాలుగా విభజించబడింది. మొదటిది కర్మకాండ. ఇందులో యజ్ఞ యాగాదిఉలు, క్రతువులు చేయడానికి అనుసరించవలసిన క్రమాలు, సలహాలు ఉంటాయి. రెండవ భాగంలో ఉపనిషత్తులు అని చెప్పబడే దివ్య జ్ఞాన విషయం వివరించబడింది.
భారతీయ తత్వ శాస్త్రానికి పునాదులు ఈ ఉపనిషత్తులు. పవిత్ర యోగులు, ఋషులు అతీంద్రియ దృష్టితో, అంతర్‌దృష్టితో క్రోడీకరించిన ఆధ్యాత్మికానుభవాలు ఇవి. 7వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరులు వీటిని "పరోక్ష జ్ఞానము" అన్నారు. 108 ఉపనిషత్తులలో ముఖ్యమైనవి 10. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అను మూడు ముఖ్య ధర్మాలు ఈ ఉపనిషత్తులలో వివరించబడ్డాయి.
ఉపనిషత్తుల ముఖ్య సారాంశమే భగవద్గీత. భారతదేశపు పవిత్ర గ్రంధమైన ఈ భగవద్గీత 18 అధ్యాయాలుగా 700 శ్లోకాలు రచించబడ్డాయి.శ్రీ కృష్ణుడు అర్జునునికి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం బోధించిన సారాంశమే భగవద్గీత. ఇక భారతీయ తత్వశాస్త్రంలో ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి బ్రహ్మసూత్రములు. ఇందు వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క ఉపదేశాలు సూత్రాల రూపంలో పొందుపరచబడ్డాయి. నీతినియమాలు, ధర్మ పరిపాలన మొదలగు విషయాలు పురాణములగు రామాయణ మహాభారతాలు కథల రూపాన వ్రాయబడ్డాయి.
బౌద్ధం :
బుద్ధుని ఉపదేశాలను త్రిపీటకాలు అంటారు. త్రిపీటకము అంటే మూడు బుట్టలు. వీటియందు గురు శిష్య సిద్ధంతంగలదు. ధమ్మ పదము అనునది బుద్ధుని అనుయాయులగు బౌద్ధులు చదివే చిన్న బౌద్ధ మత గ్రంధము.
జైనం :
జైనుల ముఖ్య మత గ్రంధం ఆగమం. ఇది రెండు భాగాలు. అంగాలు, ఉపాంగాలు. ఇందు బుక్తి యొక్క అభిప్రాయము, జైన సల్యాసులు అవలంబింపవలసిన నియమాలు, ధర్మాలు చెప్పబడ్డాయి. ఇవి కూడా వేదాల వలనే క్రీ.శ. 5వ శ్డాతావ్దంలో శ్రుతులుగా రాయబడ్డాయి.
శిక్కు మతగ్రంధం :
వీరి పవిత్ర గ్రంధం ఆదిగ్రంధ్. గురునానక్‌తో ప్రారంభమై మొదటి 5 శిక్కు గురువూ ఉపదేశాలు సంగ్రహించబడిన గ్రంధమే ఆదిగ్రంధ్. దీఎనియందు ప్రార్ధనలు, వేదాంతము, ధర్మోపదేశాలు గలవు.
క్రీస్తు మతం :
వీరి ముఖ్య గ్రంధం బైబిల్. క్రీస్తు ఉపదేశాలు, అమూల్యమైన సందేశాలు కలిగిన న్యూ టెస్టమెంట్ అత్యంత ప్రామాణికమైన క్రైస్తవ గ్రంధము.
జూదుల మతం :
జూదులకు ఓల్డ్ టెస్టమెంట్, తాల్ముండ్ రెండు ముఖ్యమైన గ్రంధాలు. తాల్ముండ్ జూదుల సంప్రదాయక సర్స్వస్వం అని చెప్పవచ్చు. ఇది ఓల్డ్ టెస్టమెంట్‌కు ఉత్తర భాగమువంటిది.
ఇస్లాం :
ఈ మతానికి చెందిన పవిత్ర గ్రంధం ఖురాన్. దీనిలో 77,639 మటలు గల 114 సురాలు ఉన్నాయి. దేవదూతయగు గబ్రెయెల్ చెప్పగా మత ప్రవక్తయగు మహమ్మదు గ్రహించిన విషయాలు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. వీటి ప్రకారం భగవంతుడు ఒక్కడే, ఒకే మతం - అదే ఇస్లాం.
వివిధ మతాల యొక్క పవిత్రగ్రంధాల ముఖ్యసందేశం మానవుని ముక్తే. ఇవి ఆయా మతానుయాయుల విశ్వాసాలను, అనుసరించవలసిన ధర్మాలను సూచిస్తాయి. ఏ మతానికి చెందినా ప్రతీ వ్యక్తి ప్రగతి మార్గంలో ముందుకు కొనసాగి జీవిత పరమావధిని సాధించుకోవడం వ్యక్తిగత ధర్మం.

No comments:
Post a Comment