Monday, May 19, 2014

ఋణానుబంధం

మనం పోయేలోపు మనం చేసిన, చేయించుకున్న ఋణాలు తీర్చేసుకోవాలి.
పుట్టినప్పుడు మనిషికి 3 ఋణాలు ఉంటాయి.
ఒకటి ఋషి ఋణం, రెండు దైవరుణం, మూడు మనిషి ఋణం..
మొదటిది : గ్రంధాలు చదివి అర్ధం చేసుకొని అందులో ఉన్న ధర్మాల్ని అనుసరిస్తూ బ్రతకడం ద్వార ఋషి ఋణం తీర్చుకోవచ్చు.
రెండోది : దైవరుణం : నిత్యాగ్ని హోత్రం, దీపారాధన చేయడం, నిత్యం అయన ఉన్నాడనే తలంపుతో ధ్యానిస్తూ జీవితాన్ని గొప్పగా బ్రతకడం (10 మందికి ఉపయోగపడేలా, ఆదర్శవంతంగా బ్రతకడం) ద్వార తీర్చుకోవచ్చు.
మూడవది మనిషిరుణం: తల్లితండ్రులకి సంస్కారాలు చేయడం ద్వారా, గురువుకి విద్యని అభ్యసించి పేరు తీసుకురావడం ద్వారా ఋణం తీర్చుకోవచ్చు. ఇంతటితో వీరి ఋణం తీరుతుంది.
కాని మనం చేసే అప్పులు, మనల్ని కొన్ని ఆపదల సమయంలో కొందరు ఆదుకున్న ఋణం, కొందరు మనకి తెలియకుండా చేసే మార్గదర్శక ఋణం, స్నేహితుడు ఒకరోజు డబ్బులు లేవని 10/- ఇచ్చాడు అనుకుందాం. దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు కాని దానితో సహా తీర్చివేయవలసిందే. అశ్రద్ద చేశామంటే వచ్చే జన్మ వచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఎవరి ఋణం వారు తీర్చేసుకోండి.

ఈ దేశంలో పుట్టి దేశాన్ని దూషించడం, జాతిని మార్చి(మతమార్పిడులు) వర్ణ సంకరం చేయడం, స్త్రీలని(మంచివారిని మాత్రమే. కొందరు ఉంటారు ఇంతింత నోర్లు వేసుకొని పడతారు ఎదుటివారిమీద. అత్తామమల్ని ఏడిపించేవారు, మొగుడిని నిందించేవారు. వీరికి దండనీతి ప్రయోగించవచ్చు అని శాస్త్రం) మాట ద్వారా కానీ చేత ద్వారా కాని హింసించడం, అప్పులు తీసుకుని ఐ పి లు పెట్టడం, అనవసరపు నిందలు వేసి ఎదుటివారిని నాశనం చేయాలనీ ప్రయత్నించేవారికి, ఇతరుల గురించి, వారు చేసే తప్పులు గురించి ఆత్రంగా ఎదురుచూసే వారు, పెళ్ళాం మాట విని తల్లితండ్రులని నిర్లక్ష్యం చేసేవారు, తల్లితండ్రులని అనాధలుగా వృద్ధాశ్రమాల్లో చేర్పించే నీచ్యులు, సంపదకోసం అడ్డమైన గడ్డి కరిచేవారు, ప్రజలని పీడించేవారు, దుర్మార్గ పాలకులని, అవినీతి నాయకులని ఎదగడానికి సాయంచేసే ప్రజలు, దుర్వ్యసనలకి లోనైనవారు, పర స్త్రీ వ్యామోహం, భర్తని కాకుండా పరపురుషుడినికోరుకునేవారు, తాగుడు, జూదరి, ఇంటికి పెద్దవాడైన కొడుకు ఇంటిని నిర్లక్ష్యంచేసేవారు, పండితులని, బ్రాహ్మణులని దూషించేవారు, పెళ్ళికి ముందే (అర్ధంచేసుకోగలరు), గోవుని అదలించడం, కొట్టడం, గో మూత్రం, గోమయం చూసి అసహ్యించుకోవడం కూడా పాపమే ఇంకా.. ఉన్నాయి.. ఇహ (భూమి మీద), పర (పరలోకాల్లో) ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తారు. వీరు వేల జన్మలు ఎత్తి నానా పాట్లు పడతారు అని శాస్త్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి.

No comments:

Post a Comment