కళాశాలల్లో బాగా ప్రేమ పేరుతో మోసాలు ఎక్కువయ్యాయి. యుక్త వయస్సులో వచ్చే ఆకర్షణని ప్రేమ అనుకుంటున్నారు అందరు. ఆది ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా వినే ఆలోచన చేయడంలేదు. ఈ ప్రేమల వలన జీవితంలో ఉండే నిజమైన ప్రేమని ఆశ్వాదించలేకపోతున్నారు.
ఒక జంట ప్రేమలో పడింది మొదలు (ఎక్కువశాతం ప్రేమలు పక్కన ఉండే వారితోనే ఏర్పడతాయి) 24గంటలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడూ అదే ధ్యాస, మాట్లాడాలని, చూడాలని, ఎప్పుడూ పక్కనే ఉండాలని, జీవితం వీళ్ళతోనే తప్ప వేరేవారితో లేదని రకరకాల ఆలోచనలు చుట్టుముట్టి, ఆ ఆలోచనలకి అనుగుణంగా వీళ్ళు ప్రవర్తిస్తూనే ఉంటారు. ప్రేమలో పడింది మొదలు చిన్ననాటి విషయల దగ్గర మొదలుపెట్టి ఈరోజు, ఎప్పుడు, ఎక్కడ ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాల ద్వారానో, ఫోన్ ల ద్వారానో ఎప్పటికప్పుడు ఇచ్చేసుకుంటారు. పనిలో పని కార్యక్రమం కూడా కానిచేస్తున్నారు. మొదటిరాత్రి అంటే జీవితం మొత్తం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకం. కాని ఇప్పటి పరిస్థితులలో మొదటిరాత్రికి విలువలేదు. ఎందుకంటే ముందే ఐపోతుంది కదా. ఎన్నో ఏళ్ల కలని సర్వమంగళం పాడించేస్తున్నారు నేటి యువత.
ఇంకో చెప్పుకోదగిన విషయం ఏంటంటే! ఈ ప్రేమలో ఉన్న అమ్మాయికి అత్తకొడుకు కాని ఉంటె వాడు ఈమెకి యముడు. ఇంటికెళ్తే పొరబాటున కూడా పలకరించదు. ఈ అమ్మాయికి తోడు ఇంట్లోవారు కూడా "వయసొచ్చిన ఆడపిల్ల ఇంటికి పొద్దాకా రాకు"అని ఇంకో ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు. ఇన్నాళ్ళు కొనసాగిన బంధం "ఒక ఆడపిల్ల వయస్సుకి రావడంతో ఆగిపోతుంది" (ఇది నేను నా స్నేహితులకి ఎదురుకావడం ప్రత్యక్షంగా చూశాను.) ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది. అన్ని కబుర్లు చెప్పుకున్నాక తరువాతి ఘట్టం అభిప్రాయభేదం మొదలవుతుంది. ఇప్పటివరకు అన్నీ మాట్లాడేసుకున్నారు కదా! ఇంకేమిలేవు. ఇన్నాళ్ళు వాళ్ళే లోకం, ఇప్పుడు? నరకం. ఏదైనా చెప్తే బోర్. ఈ చెట్టునుండి ఇంకోచేట్టుకి ఎగిరిపోవడం. దీన్ని ప్రేమ అనుకుంటున్నారు. దీనిలో ట్విస్ట్ ఏంటంటే! ప్రేమ మొదలైన కొన్నాళ్ళకి అమ్మాయి/అబ్బాయి ఎక్కడ ఇంకొకరితో వెళ్ళిపోతారో అని అనుక్షణం ఇంకో ఒత్తిడి.
ఇన్ని దాటుకుని పెళ్లి చేసుకుంటే ఇద్దరిమధ్యా పొసగదు. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు ఒక్కరే కనుక భాద్యతలు తక్కువ. అనుక్షణం పక్కనే ఎప్పుకవాలంటే అప్పుడు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు పప్పు, ఉప్పు, నునె, బియ్యం, గ్యాస్, పాలు ఇంకెన్నో ఇంటికి తీస్కురావాలి. ప్రేమ ఆకలి తీర్చదు కదా. వీటితోబాటు ఇంట్లో అత్తమామలు చెప్పేవిషయాలు విసుగెత్తిస్తాయి. అలవాటులేని కొత్త ప్రపంచం. అయినదానికీ కానిదానికి కుళాయి తిప్పడం. ఇంట్లో అమ్మానాన్నలని చుసుకోవాలా? భార్యని చుసుకోవాలా అనే ప్రశ్న తెరమీదికి వచ్చేస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు అరేయ్, ఒరేయ్, ఎంటిబే అని ముద్దుగా పిలిపించుకునే భర్త "అందరి ముందు అలా పిలవకు, విలువ ఉండదు"అనేసరికి "నామీద ప్రేమతగ్గిపోయింది అని ఇంకో సమస్య వచ్చేస్తుంది. ఇంతకుముందు ఐ మాక్స్, పార్క్, క్లబ్, పబ్ ఎన్నో తిరుగుతారు. సినిమాలు షికార్లు ఊహల్లో ఉండి పెళ్లి చేసుకోవడమే దీనికి ప్రధానమైన మూలం. ప్రేమకి ముందు ఎంతో సమయం వెచ్చించినవారు పెళ్ళయ్యాక ఎందుకు వెచ్చించడంలేదు. దీనికి సమాధానం దొరక్క, కాదు వెతుక్కోలేక , వెదకడానికి కూడా ఇష్టపడక కోర్ట్ మెట్లు ఎక్కుతున్నారు. విడిపోతున్నారు. పెళ్ళికి ముందు ఇదే సమస్య, పెళ్లి చేసుకున్న తరువాత కూడా ఇదే సమస్య.
దీనికి కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు.
మొట్టమొదటిది వంశవృక్షాన్ని ప్రేమపేరుతో కుదపడం, ఇన్నిసంవత్సరాలు ఎంతో కష్టపడి పెంచిన తల్లిదండ్రులని ఏడిపించి, మీరు ఇకిలించుకుంటూ పెళ్ళిచేసుకోవడం, పెద్దల ఆశీర్వాదాలు లేకపోవడం. పనికిమాలిన స్నేహితులు పక్కనే ఉండటం. స్నేహితుడంటే ప్రేమించిన అమ్మాయిని/అబ్బాయిని కలపడం కాదు. స్నేహితులు ప్రేమించుకుంటున్నారని తెలిస్తే రెండు కుటుంబాల మధ్య సమన్వయించి కలపాలి. వ్యవహారాలు సమన్వయించాలి.
మన సంప్రదాయాల రీత్యా జాతకాలు కలవకపోవడం. నామ నక్షత్రాలు ఎదురుతిరగడం. కుజ దోషాలు. ఇలాంటి ఎన్నో సవాలక్ష సమస్యలు కట్టి కుదిపేస్తుంటే ఇవన్ని పట్టనట్టు, పట్టించుకోనట్టు, అసలు అవసరమే లేనట్టు ప్రేమే దైవం, ప్రేమే లోకం, ప్రేమే శాశ్వతం అని ప్రేమ నామ జపం చేయడం వలన అనేకానేక సమస్యలు. ఇవన్ని చాలనట్టు వయస్సు. ఇద్దరూ ఒకే వయస్సు వారు అవ్వడం. ఒకే చదువు చదివి ఉండటం (చదువు అహంకారం పెంచుతుంది. ఎదుటివారు ముందు తల దించనివ్వదు. ఇదేదో సరదాగా అనే మాటకాదు).
ఇన్నీ సమస్యలు వదిలేసి మేము ప్రేమించుకున్నాం కనుక సంతోషంగా ఉంటాము. అని ఎలా అనుకుంటున్నారు? తల్లిదండ్రులు బిడ్డలవలన పొరబాటున కూడా కంటివెంట నీరు పెట్టుకోకూడదు. మీరు ఎన్ని చరిత్రలు తిరగేసినా ఇంతకుమించి ఎవరూ ముందుకి వెళ్ళలేదు. (ఒకప్పటి ప్రేమల్లో స్వచ్చత ఉంది. ఎన్ని కష్టాలు వచ్చిన కలిసి ఉండాలనే భాద్యత ఉంది. తిట్టుకుంటూ కొట్టుకుంటూ అయినా కలిసే ఉండేవారు. అది భాద్యతతో కూడిన ప్రేమంటే.).

No comments:
Post a Comment