అదృష్టం అంటే లక్షల కోట్ల సంపద వుండటం కాదు. ఉన్నదానితో తృప్తి పొంది దాంట్లోనే ఇంకొకరికి సాయం చేసే మనస్సు ఉండటం.
మనం దేవుడి దగ్గర కోరుకోవలసింది కూడా ఇదే!
''నీపాద కమల సేవయు,
నీపాదర్చకులతోటి నెయ్యమును,
నీపాదాంతాపార భూతదయయును,
తాపస మందార నాకు దయచెయగదె!''
మంచి మనస్సు ఇవ్వు, విచ్చలవిడిగా చెలరేగే కోరికలని అణిచివేసే శక్తిని ఇవ్వు, నిరంతరం నీనామ సంకీర్తనం చేసే అదృష్టం ప్రసాదించు. ఆధ్యాత్మిక గురువుని ప్రసాదించు, నీ పాద సేవ చేసే భక్తులతో సాన్నిహిత్యం కలిగించు. సకల భూతాలతో సమదృష్టితో మెలిగే మనస్సు ఇవ్వు. నిన్ను కొలుచుకునే భాగ్యం కరుణతో ప్రసాదించు అని వేడుకోవాలి. ఇదీ దేవుడిని వేడుకునే విధానం..
నేను పరీక్షలో ఉత్తీర్ణత సాదిస్తే తలనీలాలు ఇస్తాను, వ్యాపారం అభివృద్ధి చెందితే ఫలానాది ఇస్తాను, నేను ఇంకో దాంట్లో ఏదన్నా సాదిస్తే ఏదన్నా ఇస్తాను. ఇలా కోరుకుంటే భక్తులు అవ్వరు. వ్యాపారులు అవుతారు. ఈ వ్యాపార ధోరణి కాకుండా పైన చెప్పినట్టు కోరుకుంటే అయన మీరు అడక్కుండానే అన్ని ఏర్పాటు చేస్తాడు. ఏ సమయానికి ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తాడు. వ్యాపార ధోరణిలో పూజలు, వ్రతాలూ, నోములు, మొక్కులు మొక్కే పనులు చేయడం వలన మీరు కోరిన కోరిక దగ్గరే ఆగిపోతారు.ఇంకోసారి ఏదైనా కావాలంటే మళ్లీ పరిగెత్తాలి. తీరకపోతే నువ్వు అసలు దేవుడివేనా? నీమీద నమ్మకం పోతుంది. ఫలానా దేవుడంటే నాకు ఇష్టంలేదు. ఇలాంటి పెడ బుద్దులు పుట్టుకొస్తాయి. అలాగని వంశపారంపర్యంగా వచ్చే పూజలు, నోములు, వ్రతాలు ఆపకూడదు. ఆపితే! అలా ఆపిన దోషం ఏదో ఒక సమయంలో చేటు చేస్తుంది.
మనిషికి కావలసింది! స్వతంత్రం అనే పేరుతొ విచ్చలవిడి తనం కాదు. ఏ క్షణంలో నైన ఆ దేవుడిని ద్యానించే, కొలిచే అవకాశం కావాలి. ఏ క్షణంలో నేనా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనస్సు కావాలి. ఏ క్షణంలోనూ ధర్మాన్ని వదలని పట్టుదల కావాలి. ఇవన్ని కావాలంటే కోరుకోవలసింది? పైన చెప్పిన విధానంతో పూజించాలి.
ద్వాపరయుగం వరకు రాక్షసులు సైతం కొలిచింది ఎవరిని? హరిహరులని మాత్రమే! వారికోసం వేల సంవత్సరాలు తపస్సులు, యజ్ఞాలు, యాగాలు చేసి మెప్పించి సాక్షాత్కారం సాదించుకున్నారు. అలవికాని కోరికలని నెరవేర్చుకున్నారు. కాని మనం ఎందుకు కనీసం 10 సంవత్సరాలు కాదుకదా కేవలం 10రోజులు కూడా పూర్తీ కాకుండానే నమ్మకం పోయింది అంటున్నాం? ఆలోచించండి..

No comments:
Post a Comment