Monday, May 19, 2014

మానవ స్వభావం తెలుసుకోవాలంటే?

లోకం ఎప్పుడూ సత్వ, రజ, తమో అనే 3 గుణాలకు కట్టుబడి ఉంటుంది.
ఈ మూడిటిలో ఎ ఒక్కటి అడుపుతప్పినా లోకం తల్లక్రిందులు అవుతుంది. సత్వ గుణం ఉన్నవారు దేనిలోనైన మంచినే చూస్తారు. రజో గుణం ఉన్నవారు ఎలాంటి విషయం మీద ఒక నిర్ణయం తీసుకోలేరు. వీరి వల్ల అనర్ధాలు జరుగుతాయి. మొదట ఒకమాట, రంగంలోకి దిగిన తరువాత ఒకమాట మాట్లాడుతారు. తమో గుణం ఉన్నవారు నిర్ణయం తీసేసుకుంటారు. దానికి మంచి, చెడు అనే సంభందం ఉండదు. అనుకుంటే చేసేయాలి అంతే! ఎవడు ఎలా పోయినా సంబంధం లేదు. హత్యలు చేయడానికి కూడా వెనుకాడరు.

ఈ సృష్టిలో ఈ మూడు ఉండాల్సిందే. వీళ్ళని ఎలా వాడుకోవాలో పైవాడికి బాగా తెలుసు. మళ్లి జన్మ ఉందొ లేదో తెలియదు. స్వర్గం నరకం కూడా తెలియదు. పూర్వజన్మ జ్ఞాపకం ఉండదు కనుక ఇవేమీ లేవు అనేవారు చాలా ఎక్కువమంది ఉన్న కాలంలో ఉన్నాం. కానీ ఇవన్ని తెలుసుకోవాలంటే ఎలా అనే సందేహం మీకు రావచ్చు.

మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి సంబంధించిన చిన్న పుస్తకం ఇస్తారు. దాన్ని చదివితేనే వాడటం తెలుస్తుంది. లేదా ఎవరైనా పక్కనే ఉంది చెపితే తెలుసుకుంటాం. ఇలాగె మనకి (మానవులకి) కూడా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. అవి చదివితేనే మన జీవన విధానం తెలుస్తుంది. ఇవేమీ చదవకుండా దేవుడు లేడు, ఏమి లేదు అంటే అది వట్టి మూర్ఖత్వం మాత్రమే.
ఉదాహరణకి మనకి పూర్వజన్మ స్మృతులు కలిగి ఉంటె ! ఆ జన్మలో ఏ కుక్కగానో, నక్కగానో, పంది గానో పుట్టి ఉంటె ఆ దరిద్రపు జన్మని ఊహించుకుంటూ ఎలా బ్రతకగాలమో ఆలోచించండి.

అందుకే మానవుడు ఎందుకు జన్మించాం, ఎక్కడికి వెళతాం అని ఎల్లప్పుడూ శోధిస్తూ, శాస్త్రాలలో ఏమి చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి.

No comments:

Post a Comment