Wednesday, October 23, 2013

మీ కోసం కొన్ని చిట్కాలు

దోసకాయ ముక్కల్లో కొద్దిగా పెరుగు కలిపి రుబ్బాలి. గుజ్జు నుంచి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మేనిరంగు తాజాగా మారుతుంది.

ఒక క్యారెట్‌.. ఒక ఆలూ, ఒక ముల్లంగి ఇలా మిగిలిపోతుంటాయి. వీటినేం చెయ్యాలో తెలియక అలాగే ఎండబెట్టేస్తుంటాం. అలాంటప్పుడు అన్నిటినీ పప్పుతో పాటు కలిపి కిచిడి చేయవచ్చు.

బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే, డబ్బాలో ఎండు వేపాకులు కానీ, ఎండు మిరపకాయలు కానీ వేయాలి.

చర్మం టోనింగ్‌కి ఆరంజ్‌ జ్యూస్‌లోని విటమిన్‌ సి అద్భుతమైన టోనర్‌గా పనిచేస్తుంది. దీనిని ముఖంపై మర్దనా చేసినపుడు సబ్బుతో పోని అదనపు మలినాన్ని, మచ్చలను తలొగించవచ్చు. టోనర్‌ తయారీకి సగం ఆరంజ్‌, సంగం టీస్పూన్‌ నిమ్మరసం, ఒక క్వార్టర్‌ కప్పు నీటిని బ్లెండ్‌ చేయండి. ఈ మిశ్రమం మృదువుగా అయ్యే వరకు బ్లెండ్‌ చేయండి. దూదిని దానిలో ముంచి ముఖంపై అప్లై చేయండి.

చర్మం సంరక్షణలో ఇది ఒక మంచి మూలిక. మొటిమలను నివారంచడంలో లావెండర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చర్మ ఛాయను బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టి, లావెండర్‌ హెర్బ్‌ను నూరి పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.

గ్రీన్‌ కలర్‌లో ఉన్న ఈ అవొకాడో పండును మెత్తగా పేస్ట్‌ చేసి కొద్దిగా పాలు చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించడం ద్వారా మంచి కలర్‌ పొందవచ్చు. ఈ ప్యాక్‌ను వారంలో రెండుసార్లు వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరికాయలో కొబ్బరి తీశాం.. ఇక దీంతో పనేంటి..? పారేస్తే పోలా..? అనుకుంటున్నారా?... ఆగండి.. మీలోని సృజనాత్మకతకు పదునెడితే... ఆ కొబ్బరి చిప్ప అందరినీ ఆకట్టుకునే అందాలు, ఆకృతులతో వెలిగిపోతుంది. ఇదిగో... ఇక్కడున్నవి అలాంటివే.... మరి!

గుడ్డలోని తెల్లసొనలో చెంచా బాదం నూనె కలిపి ముఖం, మెడకు బాగా మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటినీళ్ళతో కడిగేసుకుంటే పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది

 ''పరిగెత్తే ముందు నడవడం నేర్చు కోండి'' అనేది ఈ మాటకు ఉన్న సాధారణ అర్థం. ఏదైనా ఒక పనిని తెలిసీ తెలియ కుండా చేయకూడదని, ఒక పనిలోని లోతుపాతులు లేదా ప్రాథమిక సూత్రా లు తెలుసుకున్నాకే అందులో ముందు కు సాగాలని ఈ సామెత అర్థం.  ఉదా: ఒక వ్యాపారాన్నో లేదా రిపేరు వర్కునో చేయడానికి పూను కున్నప్పుడు ముందుగా దానిని 'ఎలా' చేయాలో మనకు తప్పక తెలిసి ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

జ్వరం తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకుల పసరు రెండు చెంచాల తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని వేడి పదార్థాలకు బదులు చలవ పదార్థాలు తింటే మంచిది.

మృదువైన, శుభ్రమైన, మచ్చలు లేని ముఖవర్చస్సు కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చిన్న టీస్పూన్‌ పసుపు (టర్మరిక్‌)తో మూడు చెంచాల పెరుగు కలపండి. గట్టిగా మృదువైన పేస్ట్‌ వచ్చేవరకు కలపండి. ముఖం మొత్తం సమానంగా పూయండి. ఇరవై నిముషాలు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి. మృదువైన, శుభ్రమైన, మచ్చలు లేని ముఖవర్చస్సు కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చిన్న టీస్పూన్‌ పసుపు (టర్మరిక్‌)తో మూడు చెంచాల పెరుగు కలపండి. గట్టిగా మృదువైన పేస్ట్‌ వచ్చేవరకు కలపండి. ముఖం మొత్తం సమానంగా పూయండి. ఇరవై నిముషాలు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి.

రెండు నిండు చెంచాల తాజా తేనెను ఒక చెంచా ఆలివ్‌ నూనెతో కలిపి మృదువైన పేస్ట్‌ తయారు చేయండి. దానిని మీ జుట్టుపై మర్దన చేసి, జుట్టు కుదుళ్లతో ప్రారంభించి, జుట్టు చివర్ల వరకు చేయండి. తరువాత, ఈ మిశ్రమం మీ తలకు పట్టేటట్లు, షవర్‌ క్యాప్‌తో మీ జుట్టును చుట్టి ఉంచండి. 20 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని తొలగించడానికి సున్నితమైన హెర్చల్‌ షాంపూను వాడండి.

బఠాణీలను ఉడికించేటప్పుడు చిటికెడు తినేసొడా వేస్తే త్వరగా ఉడుకుతాయి. రంగు కూడా ఆకర్షణీయంగా మారుతుంది.

జున్ను పైన నీరు పారబోయకుండా పిండిలో కలుపుకోవచ్చు. కూరల్లోనూ వేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది.

కాకరకాయ కూరలో పోపు గింజలు, బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది

చలికాలంలో కానీ, ఫ్రిజ్‌లోంచి అప్పుడే తీసిన పచ్చికొబ్బరి చిప్పను తురిమి మిక్సీలో రుబ్బేటప్పుడు కానీ, కొంచెం గోరు వెచ్చని నీరు అందులో కలపడం వలన కొబ్బరికి అవసరమైనంత వేడి అందడమే కాదు త్వరగా రుబ్బడానికి కూడా కుదురుతుంది. పైన ఫ్యాట్‌ పేరుకుపోకుండా కూడా ఉంటుంది.

వంట చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఆ జాగ్రత్తలలో భాగంగా, వెల్లుల్లిని, యాలకులను డైరక్ట్‌గా నూనెలో వేయడం వలన అవి పగిలి నూనె మీదకి చిందే అవకాశం ఉంది. పొట్టు తీసి వేసుకుంటే మంచిది. లేక, అలా పొట్టుతోనే వేయాలనుకుంటే, కొద్దిగా నలగ్గొట్టి వేస్తే నూనె చిందే ప్రమాదం ఉండదు.

కొత్తిమీర ఆకుల రసం పెదాలపై రాసి, మర్దన చేస్తే అవి గులాబీ రంగుతో, మృదువుగా ఉంటాయి.

టమాటాలను ఏడెనిమిది నిమిషాలపాటు వేడినీళ్లలో ఉంచి తీస్తే తొక్క సులభంగా వస్తుంది.

Tuesday, September 17, 2013

జంట అరటి పళ్ళను తినవచ్చా?

కొంత మంది జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని నమ్ముతారు. 

జంటఫలాలను తినటం ద్వార, స్వామికి అర్పించటం ద్వార , ఎలాంటి దోషము రాదనీ శాస్రాలు చెబుతున్నాయి . అందంతో అహంకార పూరితయైన రంభ శ్రీమహావిష్ణువు శాపం వలన భూలోకంలో అరటి చెట్టుగా జన్మించిందని పురాణ సారాంశం. 


తాంబూలంలో మాత్రం జంట అరటిపండును పెట్టకూడదు. దానికి కారణం ఏకఫలమవుతుందనే.

Friday, June 28, 2013

పిల్లలతో..అమ్మానాన్నలే తోడూనీడగా...

పిల్లలకు.. అమ్మానాన్నలే తోడూనీడగా ఉండాలని మానసిక వైద్యులు అంటున్నారు. ఇంకా బుల్లి బుడతడు ముద్దుముద్దుగా వాదిస్తుంటే చూడ ముచ్చటగానే వుంటుంది. పెద్దలకు. అయితే సహజంగా వాదనంతా పళ్ళు శుభ్రం చేసుకోవడం గురించో, పక్క నీటుగా వుంచుకోవడం గురించో, పుస్తకాలను ఓ పద్ధతిలో సర్దుకోవడం గురించి వుంటుంది.


పిల్లలకు చిన్నప్పటినుంచి ఈ నైపుణ్యాలు నేర్పడంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. ఏదో ఒక రోజున పిల్లలు ఎదిగి స్వతంత్రంగా జీవిస్తారు. పిల్లలు పెరిగే కొద్దీ వారి మేధస్సు వికసిస్తుంది. వారిలో నిబిడీకృతమై వున్న సృజనాత్మక శక్తి బహిర్గతమవుతుంది.


తల్లిదండ్రులు పిల్లల అభిరుచుల్ని, మేధాశక్తిని, ప్రత్యేక కౌశలాలను గుర్తించాలి. పిల్లలు అల్లరికి మారుపేరు. అల్లరి శృతిమించకూడదని ఆంక్షలు పెడతాం. ఇది సరికాదంటారు మనో వైజ్ఞానికులు. ఇప్పుడు వాళ్లకు విధించే శిక్షలు ఉత్తరోత్తరా వారి ప్రవర్తనపైనా, ఉద్వేగాలపైన ప్రభావం చూపిస్తాయంటున్నారు. శిక్షలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించే విషయంలో వారి వయసును, మనసును పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు పరిశోధకులు.


ఆరునుంచి పదమూడేళ్ళ మధ్య వయస్సు చాలా సున్నితమైనది. శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా వారిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇతరుల మీద ఆధారపడకూడదన్న తపన, స్వేచ్ఛగా వ్యవహరించాలన్న కోరిక, బయటి ప్రపంచాన్ని తెలుసుకోవాలి అన్న కుతూహలం వాళ్ళలో కనిపిస్తాయి.


ఎన్నో విషయాలలో పిల్లలు తమ సొంత తెలివితేటలను ఉపయోగించడం ముచ్చటవేస్తుంది. అయినా అప్పుడప్పుడు పనుల్ని తప్పించుకోవడానికి ఏవో సృజనాత్మక మైన సాకులు చెబుతుంటారు. సో.. అమ్మానాన్నలో ఎదిగే పిల్లలకు తోడూనీడగా ఉండాలని మనో వైజ్ఞానికులు అంటున్నారు.

మీ పిల్లలు ఇంట్లోనే ఉన్నారా?.. అయితే నిమోనియో సోకే ప్రమాదం!

మీ పిల్లలు టీవీలను అంటిపెట్టుకుని కూర్చుంటున్నారా..? ఆడుకోకుండా ఇంట్లోనే ఉన్నారా..? అయితే నిమోనియా సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. చైనాలోని స్కూల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ హువా కియాన్ బృందం నిర్వహించిన సర్వేలో నగరాల్లోని ఎత్తైన భవనాల్లో నివసించే పిల్లలకు నిమోనియా ఏర్పడే అవకాశం ఉందని తెలిసింది.


చైనా, చైల్డ్, హోమ్ అండ్ హెల్త్ అనే పథకం కింద నాన్జింగ్‌లో ఉన్న 11 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. 2010వ సంవత్సరం డిసెంబర్ నెల నుంచి 2011 మార్చి వరకు జరిగిన ఈ సర్వేలో హైటెక్ టెక్నాలజీతో కూడిన ఎత్తైన భవనాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే పిల్లలకు నిమోనియా సోకే అవకాశం ఉందని తెలియవచ్చింది. భవనాలు, అపార్ట్‌మెంట్లలో ఉండే పిల్లలకు కావాలిసినంత గాలి లభించకపోవడంతో నిమోనియా సోకే ప్రమాదముందని తెలిసింది.

రాత్రివేళ కొరివి దెయ్యాలు ఉంటాయా?

రాత్రి వేళ పొలాల్లో కొరివి దెయ్యాలను తాము చూశామని చాలా మంది గ్రామీణులు చెపుతుంటారు. ముఖ్యంగా ఈ తరహా దెయ్యాలు ఎక్కువగా అటవీ ప్రాంతంలో కనిపిస్తుంటాయని, మంటతో నడుస్తూ, పరుగెత్తుతూ వెళుతుంటాయని చెపుతుంటారు.


అయితే, రాత్రి పూట మంటలు కనిపించడం సహజమేనని పలువురు చెపుతారు. ఈ మంటలు కొరివి దెయ్యాలకు చెందినవి కావని, పక్షుల రెట్టలు, వృక్ష, జంతుజాల అవశేషాలలో ఉండిపోయే సోడియం, గంధకం, ఫాస్పరస్ వంటివి తేలికగా మండే గుణంగల ధాతువులు భూమి మీద ఉష్ణోగ్రత మార్పుల వల్ల మండుతాయన్నది నిజం.


ఇదే తరహా మార్పులు పగటి పూట కూడా చోటు చేసుకుంటాయి కూడా. అయితే, భానుడి వెలుగుల ముందు అవి కంటికి కనిపించవని చెపుతున్నారు. రాత్రివేళ మండినపుడు చీకటి వల్ల కనిపిస్తాయని చెపుతున్నారు.

భారతదేశపు గొప్ప ఆయుర్వేద వైద్యుడు చరకుడు

ఆయుర్వేద శాస్త్రంలో సువిఖ్యాతులు చరక, సుశ్రతులు. చరకుడు ఆయుర్వేద వైద్య రంగంలో మంచి పేరుగడించారు. సుశ్రతుడు గొప్ప శస్త్ర చికిత్సకుడు. వీరిద్దరిలో చరకుడు క్రీస్తు పూర్వం 800 కాలానికి చెందినవాడుగా పేర్కొంటారు. ఇదేవిషయాన్ని అతని బృహద్గ్రంథం 'చరక సంహిత'లో కూడా స్పష్టంగా ఉంది.


చరకుడు అనే పేరులో కూడా నిఘూడార్థం ఉంది. 'చర్' అనగా చలించుట. తన పేరుకు తగినట్టుగానే చరకుడు నిరంతరం సంచరిస్తూ రోగులకు చికిత్స చేస్తూ వచ్చేవాడు. ఈయనతో పాటు అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన డాక్టర్ క్కార్క్‌లు కలిసి కనుగొన్న వైద్య విధానంలో దీర్ఘరోగ నివారణలో అత్యంత ఉపయుక్తమైనదిగా గుర్తింపు పొందింది.

దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?

పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు.


ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుందట. అలా జరిగినపుడు ఆహారం బాగా వంటబడుతుందని చెపుతున్నారు.


చాలా మంది పిల్లలకు టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు ఆహారం వంటబట్టదని అనేక తాజా సర్వేలు కూడా వెల్లడించాయి. వారి దృష్టి ఆహారం మీద కాకుండా, టీవీపైనే కేంద్రీకృతమై ఉంటుందని అందువల్లే భోజనం చేసే సమయంలో దిక్కులు చూడకుండా తినాలని మన పెద్దలు చెప్పేవారట.