Friday, January 11, 2013

గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవానికి జాగ్రత్తలు

గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి, దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు తీసుకోవలసిన ఆహారం ఏమిటో చూద్దాం... 

 పౌష్ఠిక ఆహారం: పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. వైద్యుల సలహాలు, వారిచ్చే మందులు, టానిక్కులు క్రమం తప్పకుండా వాడుతుండాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఒత్తిడికి గురికాకూడదు. భయం అనేది అస్సలు ఉండకూడదు. దీంతో ప్రసవ సమయంలో శిశువుకు కష్టతరమౌతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

 గర్భము, ప్రసవము అనేటివి సృష్టిలో సర్వసాధారణం. మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు,ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. సాధారణంగా కొందరు స్త్రీలు ఎత్తు మడమల చెప్పులు వాడుతుంటారు. గర్భం ధరించిన తర్వాత ఎత్తు మడమలున్న చెప్పులు వాడకండి. మీరు దూరప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కుదుపులు లేకుండా చూసుకోండి. కాన్పు అయిన తర్వాత బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చివరి 3 నెలల్లో మీ వైద్యనిపుణుల సలహాలు తీసుకోండి.

 సుఖప్రసవం జరిగేందుకు శ్వాసక్రియ వ్యాయామాలు, శరీర బరువు పెరగకుండా ఇతర తేలికపాటి వ్యాయామాలు వైద్యుల సలహాలననుసరించి చెయ్యాలి. గర్భిణీస్త్రీలు క్రమం తప్పకుండా విశ్రాంతిని తీసుకుంటుండాలి. రాత్రిపూట 8నుంచి 10గంటలపాటు శరీరానికి విశ్రాంతినివ్వాలి. నిద్ర పోయేటప్పుడు ఒక ప్రక్కకు వీలైతే ఎడమ వైపు పడుకోవడం ఉత్తమం అంటున్నారు వైద్యులు. 

No comments:

Post a Comment