కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి.
సాధారణంగా మనం తీసుకునే ఆహారమే మన అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది.
మన శరీరానికి రక్షణ కవచమైన చర్మం మన ఆరోగ్య స్థితిని చెప్పకనే చెబుతుంది.
పుట్టిన నాటి నుంచి మన శరీరంతో పాటు చర్మంలో కూడా ఎన్నో మార్పులు
చోటుచేసుకుంటాయి. చిన్నపిల్లలప్పుడు లేత చర్మం పెద్దవాళ్లయ్యేప్పటికి
పూర్తిగా మారిపోతుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగే మార్పే అయినా సరైన ఆహారం,
చక్కటి జీవనశైలి ద్వారా వృద్ధాప్యపు జాడలని మన దరికి చేరనీయకుండా చర్మాన్ని
కాపాడుకోవచ్చు.
ముట్టుకుంటే గరుగ్గా... చూడటానికి కాంతిహీనంగా కనిపించే చర్మం సరైన పోషణ, సంరక్షణ లోపాన్ని ఎత్తి చూపుతుంది. అయితే అందంగా, ఆరోగ్యమైన చర్మం కోసం ఖరీదైన క్రీములు, ట్రీట్ మెంట్లు అవసరం అనుకుంటే మీరు పొరబడుతున్నట్టే! చర్మం, దాని పని తీరు వంటి అంశాలపై అవగాహనతో పాటు దానిని సంరక్షించుకోవటంలోని మెళకువలు తెలుసుకుంటే నిగనిగలాడే చర్మం ప్రతి ఒక్కరి సొంతం అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
మృతకణాల పొరలు : మన శరీరంలో అతి పెద్ద అవయవం ‘చర్మం'. లోపలి భాగాలను కప్పిఉంచటమే కాదు, ఒక కవచంలా మనల్ని అంటి పెట్టుకుని ఉంటుంది. పైకి కనిపించే చర్మం పూర్తిగా 25- 30 అతిసన్నటి పొరల మృతకణాలతో తయారై ఉంటుంది . ప్రతీ 28-30 రోజులకోసారి కొత్త కణాలను తయారుచేసుకుంటుంది మన శరీరం. వాతావరణ కాలుష్యం, దుమ్మ ధూలితో చర్మం మలినమైనప్పుడు మృతకణాలు పూర్తిగా తొలగించుకునే శక్తి చర్మానికి లేదు. ఈ పరిస్థితిలో మృతకణాలు గనక పేరుకుపోతే చర్మం గరుగ్గా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా సున్నిపిండి లాంటి పదార్థాలతో స్క్రబ్బింగ్ చేసుకొని మృతకణాలను తొలగించేందుకు మనవంతు సహాయం చేయాలి.
మెలనిన్ : శరీర ఛాయను నిర్దేశించేది చర్మంలో ఉన్న మెలనిన్ శాతం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత నల్లగా ఉంటుంది శరీర ఛాయ. ఎండలో తిరిగినప్పుడు సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడటం కోసం శరీరం మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే ఎండలో తిరిగినప్పుడు సన్‌టాన్ (చర్మం నల్లబడటం) అవుతుంది. అయితే మెలనిన్ ఎంత శక్తివంతమైనా సూర్యుడి ప్రతాపం నుంచి పూర్తిసంరక్షణ మాత్రం మనకందించలేదు. అందుకే ఎండలో తిరిగినప్పుడు తప్పనిసరిగా సన్‌టాన్ లోషన్‌ని వాడటం అలాగే సరైన దుస్తులతో సంరక్షించుకోవటం చేయాలి.
మృతకణాలు : చర్మం లోపలిపొర కింద ఉండే పొరని డెర్మిస్ అంటారు. ఇది మన చర్మానికి జీవాన్నిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఉండే నరాల చివర్లు, రక్తనాళాలు, నూనె, శ్వేత గ్రంధులు స్పర్శని కల్పించటంతోపాటు చర్మం ఊపిరి పీల్చుకోవటానికి సహాయపడతాయి. అయితే వీటితోపాటు కొలాజెన్, ఎలాస్టిన్, కెరటిన్ అనే అతి ముఖ్యమైనవి కూడా డెర్మిస్ పొరలో ఉంటాయి. పీచులాగా సాగే గుణం ఉన్న మాంసకృత్తులు ఇవి. మన శరీర పటుత్వం, ఆరోగ్యం, వంచ గలిగే శక్తిని ఎలాస్టిన్ నిర్దేశిస్తే, కొలాజన్ వృద్ధాప్యపు జాడలతో పోరాటం చేస్తుంది. కెరటిన్ శరీర దారుఢ్యాన్ని పెంచి హుషారుగా ఉంచుతుంది .
కొలాజెన్ : కొలాజెన్ మన చర్మాన్ని శరీరంతో పాటే పట్టివుంచేలా దోహదపడుతుంది. కెరటిన్ తో కలిసి ఇది మన శరీరానికి ఎంతోమేలు చేస్తుంది. శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకి కొలాజెన్ ప్రమేయం ఉంది. కనుక దీన్ని తయారు చేసుకోగలిగే శక్తి శరీరానికి ఉంటే అమృతం తాగిన దేవతల్లా నిత్యయవ్వనంతో ఉండిపోవచ్చు. వృద్ధాప్యపు ఛాయ కూడా దరిచేరకుండా చేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు వయసు పైబడే కొద్దీ కొలాజెన్ తగ్గిపోవటం వలన చర్మం పలచగా తయారవ్వటమే కాదు పటుత్వం కోల్పోయి ముడతలు పడుతుంది. ఇలా జరగకుండా మనం తినే ఆహారం ద్వారా మన శరీరానికి అవసరమైనంత కొలాజెన్‌ను అందించవచ్చు. కొన్ని రకాల విటమిన్లు, యాంటిఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్...అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ద్వారా దీన్ని సాధించవచ్చు.
కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. అవి నిత్యయవ్వనంగా మార్చే కొలాజెన్ ఆహారాలు..
Source: http://food-health-disease.blogspot.in/

- పాలకూర :
- సబ్జా గింజలు :
- టొమాటోలు :
- బాదం :
- బ్లూ బెర్రీస్:
- సాల్మన్ ఫిష్:
- సోయా ప్రొడక్ట్స్:
- క్యారెట్స్:
- కీర దోస:
- అరటి:
- ఆరెంజ్:
- బొప్పాయి:
- ఆపిల్స్:
- వేరు శనగ :
- బీట్ రూట్:
- కివి:
- నీరు:
Source: http://food-health-disease.blogspot.in/
No comments:
Post a Comment