Saturday, April 25, 2015

అలసటను దూరము చేసే ఆహారము :

శారీరకముగా , మానసికముగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది.అలుపు , మత్తు , నిద్రమత్తు , నిస్సతువ లాంటివన్నిటినీ  అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది.మన ఆరోగ్యము పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనము తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది.

అలసటను అధికమించడానికి అవసరమైయ్యే ఆహారపదార్ధాలు - అలవాట్లు :

టిఫిన్‌ తప్పనిసరి -- ఉదయాన్నే కడుపు ఖాలీ గా ఉండడము వలన మనము తప్పనిసరిగా శక్తినిచ్చే గ్లూకోజ , పోషకాలు , కార్బోహైడ్రేట్స్ ఉంటే టిఫిన్‌ తినాలి .

లంచ్ లో ఉండాల్సినవి : మధ్యాహ్నం పూట శక్తి , చురుకుదనము కోసము కార్బోహడ్రేట్సు , ప్రోటీన్లు వున్న ఆహారము తీసుకోవాలి. చురుకుదనాన్ని , మానసిక కేంద్రీకరణను పెంచే న్యూరోట్రాన్సుమీటర్ల కోసము పోటీన్లు పుష్కరముగా లభించే ఆహారము తప్పనిసరిగా తీసుకోవాలి .

ఎక్కువ నీరు త్రాగాలి : శరీరములో తగినంత నీరు లేకపోతే పని సామర్ధ్యము తగ్గిపోతుంది. శరీరము లో నీరు తగ్గిపోవడము వల్ల అన్ని అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోయి మెదడు పనితనము నెమ్మదిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ 8 గ్లాసులు (1600 -2000 మిల్లీలీటర్ల ) నీరు తాగాలి. దప్పిక అయ్యేవరకు ఆగకూడదు.

ఉపవాసాలు , విందులు వద్దు : బోలెడన్ని పదార్ధాలతో మితిమీరి కేలరీలు అభించే ఆహారము తీసుకోవద్దు .దీనివలన తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. వయసు , స్త్రీ-పురుష బేధము , బరువు , చేసేపని ... ఆధారముగా పోషకవిలువలు గల ఆహారము అవసరము . బోజనము మానివేయవద్దు . మానేస్తే రక్తము లో చెక్కెర శాతము తగ్గి అలసట వస్తుంది. శరీరానికి కావసైన శక్తినిచ్చే తగినన్ని కార్బోహడ్రేట్స్ లేని రకరకాల ఆకర్షనీయమైన చిరుతిండ్లు పనికిరావు . . . వీటిలో విటమిన్లు ఉండవు . పోషకవిలువలు లేని ఆహారపదార్దములు అలసటకు దారితీస్తాయి.

ఐరన్‌ ఎక్కువగా ఉంటే మేలు : శరీరములోని వివిధ అవయవాలకు రక్తము ద్వారా ఆక్షిజన్‌ బాగా సరఫరా కావడానికి ఐరన్‌ దోహదము చేస్తుంది.ఐరన్‌ శరీరానికి సరిపడినంత లభించకపోతే అలసటకు దానితీస్తుంది. ఒకవేళ రక్తహీనత లేకపోయినా ఐరన్‌ శాతము తక్కువగా ఉన్నట్లైతే అలసటకు , మనోవ్యాకులతకు దారితీస్తుంది.

కెఫిన్‌ తో జాగ్రత్త : రోజులో కెఫిన్‌ వున్న కాఫీ , టీ , కోలా లాంటి డ్రింక్సు ఒకటి .. రెండు సాలు తాగినట్లయితే శరీరములో శక్తి పెరుగుతుంది . చురుకుదనము వస్తుంది . అలా కాకుండా రోజులో 5-6 సార్లు మించి కెఫినేటెడ్  ద్రవపదార్ధాలు తీసుకున్నట్లయితే అది ఆందోళనకు , చికాకు కలగడానికి , శారీరక సామర్ధ్యము తగ్గిపోవడానికి దారితీస్తుంది.

యోగర్ట్ : దీర్ఘకాలికంగా అలసటకు గురవడానికి ముఖ్యకారణము జీర్ణక్రయ జరిగే మార్గములో మైక్రో-ఆర్గానిజమ్స్ అసమతుల్యముగా ఉండడమే. రోజులో 200 మి.లీ. యోగర్ట్ (పెరుగు/మజ్జిక ) రెండు సార్లు తీసుకుంటే అలసట లక్షణాలు తగ్గుతాయి.

విటమిన్‌ సి : యాంటి ఆక్షిడెంట్ గా పనిచేసే విటమిన్‌ ' సి ' ఉన్న ఆహార-పానీయాలు తీసుకుండే శరీరానికి మంచిది , వ్యాదినిరోధక శక్తిని పెంచుతుంది. . రక్తకణాలు తయారీకి , ఫ్రీరాడికల్స్ పారద్రోళి అలసటను తగ్గిస్తుంది. శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే అందుకే మల్టీవిటమున్‌ మాత్రలు రోజూ ఒకటి డాక్టర్ల సలహా తో తీసుకోవాలి .

Source: http://food-health-disease.blogspot.in

No comments:

Post a Comment