హిందూ శాస్త్రాలు - ధర్మాల ప్రకారం... మానవ శరీరంలో వున్న రకరకాల అంగాలకు, అవయవాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క దేవత లేదా దేవుడు అధిపతులుగా వుంటారు. అందులో భాగంగానే లలాటానికి (నుదుటకి) బ్రహ్మదేవుడు అధిపతిగా వుంటాడు. మన పురాతన గ్రంథాలు, శాస్త్రాలలో కూడా లలాటం ప్రదేశాన్ని బ్రహ్మస్థానంగా పేర్కోవడం జరిగింది. ఆ విధంగా కొలువై వున్న బ్రహ్మదేవుడి ప్రియతమ రంగు ఎరుపు. అందువల్లే బ్రహ్మస్థానమైన లలాటంలో (నుదుట) ఎరుపు రంగులో వున్న బొట్టును పెట్టుకోవడం జరుగుతోంది. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఎంతో ఆధ్యాత్మికమైన ఆచారం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... మన లలాటాన్ని సూర్యకిరణాలు అస్సలు తాకకూడదు. అందుకోసం కూడా నుదుటకు బొట్టు ధరించాల్సి వుంటుంది.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మానవులు తమ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు. ప్రాచీన కాలంలో ఎంతో ఆధ్మాత్మికంగా ఆచరించే పద్ధతులను ప్రస్తుతకాలంలో వున్నవారు వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పురాతన గ్రంథాల ప్రకారం... మహిళలు తమ భర్త జీవితాంతం ఎటువంటి ఆటంకాలు లేకుండా, సుఖంగా వుండాలనే ఆశతో నుదుటనే కుంకుమను ధరించేవారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు కుంకుమను తొలగించుకునేవారు కాదు. కానీ నేటి ప్రపంచంలో వున్న మహిళలు మాత్రం ఫ్యాషన్ అన్న పేరుతో నుదుటన కుంకుమను రాసుకోవడమే మానేశారు. ఇంకొంతమంది వెటకారంగా ప్లాస్టిక్ బొట్టు బిళ్లలను పెట్టుకుంటున్నారు. ఇలా చేస్తే దాంపత్య జీవితంలో సమస్యలను ఏర్పడుతాయి... అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కాబట్టి నుదుటన కుంకుమ ధరించడం ఎంతో అవసరం. కుంకుమను ధరించడం క్రిమి సంహారకం. దీనిని అద్దుకోవడం వల్ల జ్ఞానచక్రాన్ని పూజించనంత సమాన పుణ్యం లభిస్తుంది. అందం, అలంకరణలో కూడా కుంకుమ అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది.
ఇక చివరగా... చాలామంది నుదుటన కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే మంచి జరుగుతుందన్న సంశయంలో వుంటారు. చాలావరకు ప్రతిఒక్కరికి ఈ విషయం గురించి తెలిసి వుండదు కూడా! సాధారణంగా కుంకుమను ఏ వేలితోనైనా నుదుటన రాసుకోవచ్చు. అయితే ఒక్కొక్క వేలితో పెట్టుకుంటే ఒక్కొక్క ఫలితం కలుగుతుంది. ఉంగరపు వేలితో కుంకుమను పెట్టుకుంటే మానసికంగా ఎంతో ప్రశాంతత, శాంతి లభిస్తుంది. నడివేలితో ధరిస్తే మానవుని ఆయువు సమృద్ధి చెందుతుంది. బొటన వేలితో పెట్టుకుంటే అనూహ్యమైన శక్తి పెరుగుతుంది. చూపుడు వేలితో ధరిస్తే చెడు అలవాట్లు అన్నీ సమసిపోయి, భక్తీ కార్యక్రమాల్లో మనసు కేంద్రీకృతమవుతుంది. పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా ఈ విధంగా కుంకుమను ధరించడంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

No comments:
Post a Comment